దివి నుంచి దిగివచ్చిన దేవకన్యవా.? అని అందాల భామల్ని ఉద్దేశించి ప్రస్తావించడం మామూలే. పేరులోనే ఆ ‘దివి’ పెట్టుకున్న ఈ అందాల భామ పేరు దివి వద్త్య (Angel Divi Vadthya Beauty With Confidence).
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ (Maheshbabu Maharshi Movie) సినిమాలో నటించిన దివి, బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో నాలుగో సీజన్ ద్వారా అనూహ్యమైన పాపులారిటీ దక్కించుకుంది. టైటిల్ విన్నర్ అయ్యే అర్హత (Divi Vadthya Spicy) వున్నా, ఎందుకో ఆమె తనంతట తానుగా ‘డౌన్ ప్లే’ చేసుకున్నట్లు కనిపించింది.
సరిగ్గా 50వ రోజు ఆమె బిగ్ హౌస్ నుంచి దివి (Divi Vadthya Bigg Boss Telugu 4) బయటకు వచ్చేసింది.. అదీ స్పెషల్ గెస్ట్ హోస్ట్ సమంత అక్కనేని (Samantha Akkineni) చేతుల మీదుగా. యంగ్ హీరో కార్తికేయ, ఆమెకు తన సినిమాల్లో నటిగా ఛాన్సులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చాడు, సమంత సూచనతో.
ఇదిలా వుంటే, బిగ్ హౌస్ నుంచి వచ్చాక దివి వద్త్యని పలు సినిమా అవకాశాలు పలకరించాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది దివి. మరోపక్క, మ్యూజికల్ ఆల్బమ్స్ కూడా ఆమె చేస్తోంది. ఇవన్నీ ఓ యెత్తు.. ఎప్పటికప్పుడు సరికొత్త ఫొటో సెషన్లతో (Divi Vadthya Hot) ఆమె చేసే సందడి ఇంకో యెత్తు.

సరైన అవకాశాలొస్తే, ‘హీరోయిన్’గా దివి వద్త్య (Divi Vadthya) సత్తా చాటినా (Angel Divi Vadthya Beauty With Confidence) ఆశ్చర్యపోనక్కర్లేదు.