Annabelle Sethupathi Review హారర్ కామెడీ సరిగ్గా తీస్తే, తేలిగ్గా హిట్టు కొట్టగల జోనర్. కొంచెం థ్రిల్, కొంచెం కామెడీ అంతే. స్టార్స్అక్కర్లేదు. హంగామా అక్కర్లేదు. చిన్న సినిమాతో పెద్ద లాభాలు వచ్చేస్తాయ్.
అందుకే కామెడీ థ్రిల్లర్స్.. అలియాస్ హరర్ కామెడీ.. జోనర్‌లో కుప్పలు తెప్పలుగా సినిమాలొస్తుంటాయ్. అయితే, కామెడీనీ, హారర్‌నీ సరిగ్గా కలిపితే మాత్రమే ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. మరి ఆ జోనర్‌లో వచ్చిన ‘అనబెల్ సేతుపతి’ సంగతేంటీ.?
Also Read: తాప్సీ అపరిచితురాలు.. ఇదిగో సాక్ష్యం.!
విలక్షణ చిత్రాలు.. ఛాలెంజింగ్ రోల్స్ ఎంచుకోవడంలో తనదైన ముద్ర వేస్తున్న తాప్సి, విజయ్ పేతుపతి ఈ సినిమాతో మ్యాజిక్ చేశారా.? తెలుసుకుందాం పదండి.
Annabelle Sethupathi Review దెయ్యాల గుంపు వర్సెస్ చిల్లర దొంగల ఫ్యామిలీ..
ఓ బంగ్లాలో దెయ్యాల గుంపు. దానికో లీడర్. బయట ఓ చిల్లర దొంగ అండ్ గ్యాంగ్. వీరిద్దరి మధ్యా నడిచే కథ ‘అనబెల్ సేతుపతి’. అసలు చిల్లర దొంగల ముఠా దెయ్యాల కొంప అయిన ఆ రాజమహల్‌లోకి ఎందుకు వెళ్లింది.? దెయ్యాల గుంపు లీడర్‌కీ, చిల్లర దొంగల టీమ్ లీడర్‌కీ సంబంధం ఏంటీ.?
తాప్సీ మంచి నటి. ఆమెకి ఇలాంటి సినిమాలు కొత్తేమీ కాదు. ‘ఆనందోబ్రహ్మ’ సినిమా ఆల్రెడీ చేసేసింది. అయితే, ఒకప్పటి ఆ క్యూట్ అప్పీల్ తాప్సీలో మిస్ అయ్యింది. తాప్సీ చాలా బాగా నటించింది.. అని చెప్పడానికి, అంత గొప్ప పాత్ర దర్శకుడు ఆమెకివ్వలేదు.
Also Read: అందాల ప్రదర్శనలో హీరోయిన్లతో హీరోలకు పోటీనా.?
ఆ పాత్రకి అవసరమైనంత మేర మమ అనిపించేసిందంతే తాప్సీ. దొంగల ముఠా లీడర్ పాత్రలో చక్కగానే ఒదిగిపోయింది. తాప్సీ బ్రిటీష్ మహిళగా కూడా ఈ సినిమాలో మరో పాత్రలో కనిపించింది. ఆ పాత్రలోనూ అంతే. అంతకు మించి తాప్సీ ఆ పాత్ర ద్వారా ప్రత్యేకంగా ప్రేక్షకులు గుర్తు పెట్టుకునేంత ఏమీ చేయలేదు.
విజయ్ సేతుపతి అంటే, విలక్షణ నటుడు. అయినా ఈ సినిమాలో మమ అనిపించేశాడు. ఇంకాస్త ఎనర్జిటిక్‌గా విజయ్ సేతుపతిని దర్శకుడు వాడుకుని ఉంటే బాగుండేది. కాస్త నిడివి ఉన్నఅతిథి పాత్ర అనిపిస్తుందంతే.
Annabelle Sethupathi Review యోగిబాబు ఆదుకున్నాడు..
యోగిబాబు విషయానికి వస్తే, కథని ఎడా పెడా మలుపులు తిప్పేస్తుంటాడు. సినిమా కథంతా అతని చుట్టూనే తిరుగుతుంది. తమిళ నటుడైనా తెలుగు ప్రేక్షకుల మైండ్‌లోకి బాగానే చొరబడ్డాడు. బాగా ఆకట్టుకుంటున్నాడు.
Also Read: కంగన – తాప్సీ.. మహిళకు మహిళే శతృవు.!
తమిళంలో యోగిబాబు స్టార్ కమెడియన్. అతన్నీ ఇంకాస్త వాడుకొని ఉండాల్సింది. సీనియర్ నటులు రాధిక, రాజేంద్ర ప్రసాద్ ఓకే. కొంత మేర నవ్వించారు. జగపతిబాబు జస్ట్ ఓకే. మెయిన్ విలన్ జగపతిబాబు అయినా, అతని పాత్ర కూడా దెయ్యమే. ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్లలో కూడా జగపతిబాబు అదనంగా చేసిందేమీ లేదు.
కడుపుబ్బా నవ్వించే కామెడీ లేదు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా లేవు. జస్ట్ ఓటీటీ బొమ్మ అంతే. కాసిన్ని నవ్వులూ, రాజమహల్ అందాలు, కొంచెం కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఆకట్టుకునే మ్యూజిక్ ఇవీ ప్లస్ పాయింట్స్.
విజయ్ సేతుపతి, తాప్సీ కాంబో అనే అంచనాలతో ’అనబెల్ సేతుపతి’ (Annabelle Sethupathi Review) చూస్తే, నిరాశ తప్పదు. అంచనాల్లేకుండా చూస్తే, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు.