Ante Sundaraniki ‘అంటే.. సుందరానికీ.!’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నేచురల్ స్టార్ నాని. నటించడం కాకుండా, పాత్రల్లో జీవించడం విషయానికొస్తే.. నజ్రియా కూడా నాని లాగానే.!
అందుకే, నటిగా ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా, నజ్రియా ఎక్కువ పేరు ప్రఖ్యాుతులు సంపాదించుకుంది.
డబ్బింగ్ సినిమా ‘రాజ రాణి’తో తెలుగు ప్రేక్షకులకు చాలాకాలం క్రితమే పరిచయమైన నజ్రియా, తొలిసారి ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది ‘అంటే.. సుందరానికీ..!’ సినిమాతో.
Ante Sundaraniki.. అంటే.! సుందరం కథేంటంటే.!
ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? అంటూ, నాని అభిమానులు మురిసిపోయే సందర్భమిది. అంతలా ‘అంటే.. సుందరానికీ.!’ సినిమా ప్రోమోని తీర్చిదిద్దారు.
సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన హీరో ఓ వైపు.. క్రిస్టియన్ కుటుంబంలో పుట్టిన హీరోయిన్ ఇంకో వైపు.
ఈపాటికి కథ మీకర్థమయిపోయి వుంటుంది. కానీ, ఇక్కడో ట్విస్ట్ వుంది. అదేంటన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది. ప్రోమోలో, ‘అంటే..’ అంటూ నాని సాగదీయడంతోనే ఆ సస్పెన్స్ ఏంటన్నదానిపై మరింత ఉత్కంఠ రేగింది.
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ ‘అంటే.. సుందరానికీ.!’ సినిమా తెరకెక్కుతోంది. అన్నట్టు, ‘పుష్ప’ విలన్ ఫాజిల్ ఫహాద్ వున్నాడు కదా.. ఆ ఫాజిల్‌నే రియల్ లైఫ్‌లో పెళ్ళాడింది నజ్రియా (Nazriya Fahadh).
అప్పుడెప్పుడో ఇవ్వాల్సిన ఎంట్రీ..
ఎప్పుడో యంగ్ టైగర్ ఎన్టీయార్ (Young Tiger NTR) సినిమాతో తెలుగులోకి రీ-ఎంట్రీ ఇవ్వాల్సిన నజ్రియా.. ఇన్నేళ్ళకు ఇలా తెలుగు తెరపై తెరంగేట్రం చేస్తుండడం గమనార్హం.
Also Read: జాతీయ సమస్యగా మారిన ప్రబాస్ పెళ్లి ముచ్చట.?
అన్నట్టు, ‘అంటే.. సుందరానికీ.!’ ప్రోమో అదిరిపోయింది. నాని (Natural Star Nani) తనకు బాగా అలవాటైన కామెడీ టైమింగ్‌లో అదరగొట్టేశాడు. నజ్రియా తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టేసుకుంటోంది.
‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singha Roy) తర్వాత నాని హీరోగా వస్తున్న సినిమా కావడంతో ‘అంటే.. సుందరానికీ.!’ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి.
ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా కూడా ‘అంటే సుందరానికీ.!’ సినిమా గురించి ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్ వుంది.
తనకు కొట్టిన పిండి లాంటి ఫన్నీ క్యారెక్టర్‌లో నాని ఎలా అదరగొట్టేశాడో తెలియాలంటే సినిమా విడుదలయ్యేదాకా వేచి చూడాల్సిందే.