Ante Sundaraniki Rating..సహజ నక్షత్రం.. అదేనండీ, నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘అంటే సుందరానికీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
ట్రైలర్ కడుపుబ్బా నవ్వించింది. సినిమా అంతకు మించి నవ్వించిందనే టాక్ ఓ వైపు.. అబ్బే, సాగదీసేశారండీ.. అనే పెదవి విరుపులు ఇంకో వైపు.!
ఈ సందట్లో ‘రాజకీయ రంగు’ పులుముకుంది ‘అంటే సుందరానికీ’ సినిమా. దానిక్కారణం, పవన్ కళ్యాణ్ (Janasena Party Chief Pawan Kalyan) ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కావడమే.
తమ అభిమాన ‘నాయకుడ్ని’ పిలవకుండా, తమ అభిమాన నాయకుడు పాలిస్తున్న రాష్ట్రాన్ని కాదని, మరో రాష్ట్రంలో ఈవెంట్ నిర్వహించిన కారణంగా, ‘అంటే సుందరానికీ’ సినిమా మీద కక్ష కట్టేసింది ఓ వర్గం.

కొన్నాళ్ళ క్రితం సినిమా టిక్కెట్టు.. కిరాణా కొట్టు.. అంటూ నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి.
అప్పట్లో నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singha Roy) సినిమాని దెబ్బతీద్దామనుకున్నారు, దెబ్బ తీశారు. కానీ, సినిమా హిట్టయ్యింది.
Ante Sundaraniki Rating.. అప్పుడు ‘ఆర్ఆర్ఆర్’, ఇప్పుడేమో ‘అంటే సుందరానికీ’.!
అందుకేనేమో, ఈసారి మరింత కసిగా, ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki Rating) సినిమాని తొక్కేయాలనుకున్నారు. రాజకీయ కోణంలో ‘రేటింగు’ తగ్గించేశారు.
అన్నట్టు, ‘ఆర్ఆర్ఆర్’( RRR Movie) సినిమాకి కూడా ఇలాగే రేటింగ్ తగ్గించేశారండోయ్.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి రేటింగు రెండున్నర.. చిత్రంగా, ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki Review) సినిమాకి కూడా రేటింగు రెండున్నరే.! పోలా.? అదిరిపోలా.?
సినిమా బావుంటే, ఒకటిన్నర రేటింగు ఇచ్చినాగానీ.. సినిమా సూపర్ హిట్ అయి తీరుతుంది. అస్సలు బాగాలేని సినిమాకి ఐదుకు ఐదు మార్కుల రేటింగ్ ఇచ్చినా, అది పుంజుకునే అవకాశమే వుండదు.
Also Read: అనసూయ ఆన్‌లైన్ ‘ఆట’: ఆడండి, నాశనమైపోండి.!
కాకపోతే, ఎడ్జ్‌లో వుండే కొన్ని సినిమాల్ని హిట్ నుంచి డిజాస్టర్‌కి మార్చేయడంలో ఈ రేటింగ్ కొంతవరకు ఉపయోగపడుతుంది.
రేటింగ్ పేరుతో బ్లాక్‌మెయిలింగ్ చేసే ఓ సెక్షన్ వెబ్ మీడియా.. ఇదిగో, ఇలాంటి ‘బ్లూ కాలర్ దారుణాలకు’ పాల్పడుతోందన్నమాట.