Anupama Parameswaran Punctuality.. సినిమా అంటే, చాలా లెక్కలుంటాయ్.! స్టార్‌డమ్ లెక్కలుంటాయ్. బాక్సాఫీస్ లెక్కలుంటాయ్.! ఇంకా చాలా చాలా వుంటాయ్.!
సినిమా అవే ప్లస్సూ.. అవే మైనస్సూ.! ఇది అందరికీ తెలిసిన విషయమే. చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తాయ్.. అలాగని, స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించకుండా వుంటారా.?
పెద్ద సినిమాలు దారుణమైన నష్టాలు మిగిల్చినాసరే, దర్శక నిర్మాతలు స్టార్‌డమ్ వెంటే పరుగులు పెడతారు. అదే, సినిమా ఈక్వేషన్.!
స్టార్‌డమ్ ఏంటో, అనుపమ పరమేశ్వరన్ కూడా రుచి చూసింది. ఆ స్థాయికి ఆమె నటిగా వెళ్ళింది కూడా.! అలాంటప్పుడు, ఆ లెక్కలు ఆమెకు తెలియకుండా వుంటాయని ఎలా అనుకోగలం.?
Anupama Parameswaran Punctuality.. ఏడు గంటలకే హీరోయిన్.. తొమ్మిదిన్నరకి హీరో..
ఓ హీరో, షూటింగుకి ఆలస్యంగా వస్తాడట. తాను మాత్రం, ఉదయాన్నే షూటింగుకి వెళ్ళిపోవాలట. ఏడు గంటలకి మేకప్‌తో సహా, అనుపమ రెడీగా వుంటుందట.
కానీ, హీరో మాత్రం తొమ్మిదిన్నర తర్వాతగానీ రాడట.! అలాంటప్పుడు, తానెందుకు ముందుగా రావాలంటూ అనుపమ తాజాగా ప్రశ్నించేసింది.

ఎవర్ని ప్రశ్నించేశావ్ అనుపమా.? ఎవరా హీరో.? అంటే, ప్చ్.. సమాధానం దొరకదు. గాల్లోకి ఓ రాయి విసిరింది, ఎవరికైనా తగిలిందో లేదో.!
పంక్చువాలిటీ మీద ఎప్పుడూ డిస్కషన్ జరుగుతూనే వుంటుంది. క్రియేటివ్ ఫీల్డ్ కదా.. చిన్నా చితకా సమస్యలుంటాయ్. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎవరూ కాదనలేని సమస్య ఇది.
ఆటిట్యూడ్ అనుపమ..
అనుపమ, ఆ పరిస్థితుల్ని ప్రశ్నించి ‘ఆటిట్యూడ్ ఎక్కువ’ అనిపించుకుంది. కొన్ని అవకాశాల్ని ఇలానే కోల్పోయిందా.? అంటే, ఏమో ఆమెకే తెలియాలి.
అయినా, పెద్దోళ్ళ వ్యవహారాలు అనుపమకి ఎందుకు.? నచ్చితే, సినిమా చేయొచ్చు.. లేదంటే మానెయ్యొచ్చు.. అనేవారూ లేకపోలేదు.
Also Read: Ronth Telugu Review: ఆ రాత్రి.. ఆ ఇద్దరు పోలీసులు ఏం చేశారు.?
తన తాజా సినిమా ‘పరదా’ ప్రమోషన్ల నిమిత్తం.. ఇంటర్వ్యూల్లో, అనుపమ.. ఇచ్చిన ‘పంక్చువాలిటీ’ స్టేట్మెంట్ వైరల్ అయ్యింది.
కేవలం సినిమా ప్రమోషన్ కోసమే అనుపమ ఇలాంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిందా.? లేదంటే, నిజంగానే ఆమె ఆటిట్యూడ్ అలాంటిదా.?