Anushka Shetty Opposite Chiranjeevi.. పాచిపోయిన వార్తని కొత్తగా మేకప్ వేసి వదులుతున్నారు.! ఔను, మెగాస్టార్ చిరంజీవి సరసన అనుష్క.. అంటూ ప్రచారంలోకి వచ్చిన ఓ వార్త తీరు ఇదే.
అనుష్క శెట్టి ఇటీవల ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. సినిమాలో అయితే నటించిందిగానీ, ఇంతవరకు ఆమె మీడియా ముందుకు రాలేదు.
అసలు అనుష్కకి ఏమయ్యింది.? ఎందుకామె మీడియా ముందుకు రావడానికి తటపటాయిస్తోంది.? ఏదో ఆబ్లిగేషన్ మీద ఎలాగోలా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాని అనుష్క పూర్తి చేయగలిగిందంతే.!
Anushka Shetty Opposite Chiranjeevi.. చిరంజీవితోనా.? ప్చ్.. ఛాన్సే లేదు.!
చిరంజీవి (Mega Star Chiranjeevi) ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి వుంది. గతంలో వశిష్ట, ‘బింబిసార’ సినిమా తెరకెక్కించాడు.
ఇక, కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలోనూ చిరంజీవి (Mega Star Chiranjeevi) ఓ సినిమా చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల్నీ చిరంజీవే స్వయంగా ప్రకటించారు.

అనుష్క (Anushka Shetty) నిజంగానే ఫేడవుట్ అయిపోయింది.! స్టార్‌డమ్ బొత్తగా లేకుండా పోయింది.! కొన్నాళ్ళుగా తెరపై కనిపించకపోవడమే ఇందుక్కారణం.
గతంలో చిరంజీవి సరసన ‘స్టాలిన్’ సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్‌లో అనుష్క శెట్టి (Anushka Shetty) ఆడిపాడిన సంగతి తెలిసిందే.
Also Read: Malaika Arora: ఇంతకీ నీ వయసెంత పాపా.!
అంతే కాదు, మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) నటించిన ‘సైరా నరసింహా రెడ్డి’ (Syraa Narasimha Reddy) సినిమా కోసం వాయిస్ ఓవర్ కూడా ఇచ్చింది అనుష్క శెట్టి.
ఏమో, ఈ గాసిప్ వచ్చలవిడిగా సర్క్యులేట్ అయిపోయి, బజ్ బాగా పెరిగితే, చిరంజీవి కూడా అనుష్కని కన్సిడర్ చేస్తారేమో తన సినిమా కోసం.
కానీ, దానికి ఛాన్సులు చాలా చాలా తక్కువ. అన్నట్టు, వశిష్ట తెరకెక్కించనున్న సినిమాకి సంబంధించి ఇటీవల కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.