Arjunudu Of Andhra Politics.. ఒకవేళ అర్జునుడు నిజంగా బతికే వుంటే.? అర్జునుడంటే, ఆ పేరున్న ఇప్పటి వ్యక్తుల గురించి కాదు.! మహాభారతంలో అర్జునుడి గురించి.!
ఔనూ, అర్జునుడంటే మహారతంలో వుంటాడు కదా.? అదేనండీ, పంచ పాండవుల్లో ఒకడు.! ఇంకా సరిగ్గా చెప్పాలంటే, విలు విద్యలో మేటి.!
కాదేమో, రామాయణంలో అర్జునుడు వున్నాడేమో.! ఛ.. కాదు లెండి. మహాభారతంలోనే అర్జునుడుంటాడు. అభిమన్యుడి తండ్రి.. అర్జునుడు.!
బుర్ర పూర్తిగా చెడింది మరి.! అందుకే, ఇంత గందరగోళం. చెడదా మరి.. ఎవరెవరో తమను తాము అర్జునుడితో పోల్చుకుంటోంటే.!
Arjunudu Of Andhra Politics.. అభిమన్యుడూ అర్జునుడూ కానే కాదు
‘అభిమన్యుడు కాదు.. అర్జునుడు వీడు..’ అంటూ, ఓ తెలుగు సినిమాలో పాటొకటుంటుంది. అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించలేకపోతాడు.
కారణం తెలుసు కదా, తల్లి గర్భంలో వున్నప్పుడు పద్మవ్యూహం గురించి సగమే తెలుసుకుంటాడు. వెళ్ళడం తెలుసుకుంటాడుగానీ, రావడం తెలీదు.
అదీ అసలు సంగతి.! సరే, అభిమన్యుడి గురించి మనకెందుకుగానీ, అర్జునుడి గురించి మాట్లాడుకుందాం.!
ఈ అర్జునుడు వేరు. ఈయన పొలిటికల్ అర్జునుడట.! ‘నేనేమన్నా అభిమన్యుడిననుకుంటున్నారా.? కాదు, నేను అర్జునుడ్ని..’ అంటున్నాడు.
నవ్విపోదురుగాక నీకేటి సిగ్గు.? అని జనం పుసుక్కున నవ్వేసుకుంటున్నారు. నవ్వడమేంటి, కాండ్రించి ఉమ్మేసేలా వున్నారు.!
సిరాకొచ్చెయ్యదేటి?
గొప్ప గొప్ప పేర్లు వాడితే, గొప్పోళ్ళయిపోవచ్చనుకుంటున్నాడేమో సదరు రాజకీయ నాయకుడు.!
అక్రమాస్తులు కూడబెట్టినోళ్ళు, తల్లిని తరిమేసినోళ్ళు.. చెల్లితో చీవాట్లు తినేటోళ్ళు ‘అర్జునుడు’ అనీ, ఇంకోటనీ పోల్చేసుకుంటోంటే సిరాకొస్తది మరి.!
ఏండేయ్.. ఎవర్నీ కించపర్చడానికి కాదండోయ్.! పురాణాల్లోని పాత్రల్ని రాజకీయ నాయకులు అస్సలు వాడకూడదనే ఈ రాత.!
Also Read: జస్ట్ ఆస్కింగ్: విగ్రహాలు పెట్టమని అంబేద్కర్ అడిగారా.?
రోత రాజకీయాల్లో కొట్టుమిట్టాడుతున్న ‘మురుగు పురుగులకి’ పురాణ పురుషులతో పోల్చుకునే నైతిక హక్కు ఎక్కడిది.? ఇది పార్టీలకతీతం.. ఎవడు చేసినా తప్పు తప్పే.! మీరేమంటారు.?
జోడిచ్చుకొట్టీగల్ను ఈసారి ‘అర్జునుడి’తో పోల్చుకుంటే.. అంటూ ఉత్తరాంధ్రకి చెందిన ఓ కిట్టయ్య మహా సిరాకు పడిపోతున్నాడుట సోకాల్డ్ డర్టీ పొలిటీషియన్‌ని చూసి.!
ఎవరా పొలిటీషియన్ అని మాత్రం అడక్కండి.! దయచేసి గుమ్మడికాయల దొంగలెవరూ భుజాలు తడుముకోవద్దని మనవి.!
– yeSBee