Table of Contents
Arvind Kejriwal Mango.. అగ్గి పుల్లా.. సబ్బు బిళ్ళా.. కుక్క పిల్లా.. కాదేదీ కవితకనర్హం.! వెనకటికి ఓ మహా కవి చెప్పిన మాట ఇది.!
కోర్టులు.. చట్టాలు.. అరెస్టులు.. బెయిళ్ళు.. వీటి గురించి బోల్డంత చర్చ జరుగుతోంది దేశవ్యాప్తంగా చాలా ఏళ్ళుగా.. అదీ రాజకీయ పరమైన కేసులకి సంబంధించి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారమై పెద్ద రచ్చే జరుగుతోంది.
సామాన్యుడే.. కానీ, అసామాన్యుడు.!
అరవింద్ కేజ్రీవాల్ అంటే, ప్రజా నాయకుడు.. ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా.! కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీల్ని ఢిల్లీలో మట్టి కరిపించిన సామాన్యుడు అరవింద్ కేజ్రీవాల్.!
సరే, ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్‌కి మనం సర్టిఫికెట్లు ఏమీ ఇచ్చెయ్యట్లేదు. కేసు నమోదైంది.. విచారణ జరుగుతోంది.. ఆయన అరెస్టయ్యారు.. జైల్లో వున్నారు.
ఓ వ్యక్తి.. తనకు ఇష్టమైన ఆహారం తినకూడదా.? తింటే నేరమా.?
ఇంట్లో అయితే ఎవరూ ఎలాంటి అభ్యంతరాలూ పెట్టరు.
కానీ, జైల్లో కదా.! కొన్ని నియమ నిబంధనలుంటాయ్.. పాటించి తీరాలి.!
Mudra369
బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న అరవింద్ కేజ్రీవాల్‌కి ప్రతిసారీ చుక్కెదురవుతోంది. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ, అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి ఏంటి.? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఇక, తాజాగా అరవింద్ కేజ్రీవాల్ విషయమై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, న్యాయస్థానంలో ఆసక్తికరమైన అప్పీల్ చేసింది. అదీ, మామిడి పళ్ళకు సంబంధించి.
Arvind Kejriwal Mango.. తెగ తినేస్తున్నాడట..
డయాబెటిస్‌తో బాధపడుతున్న అరవింద్ కేజ్రీవాల్, జైల్లో మామిడి పళ్ళు ఎక్కువగా తినేస్తున్నారట. ఇంటి నుంచి వస్తున్న భోజనంలో అధికంగా షుగర్ కంటెంట్ వుంటోందట.. అదీ ఆరగించేస్తున్నారట.
ఇదంతా ఎందుకు.? అంటే, డయాబెటిస్ పెరిగిపోతే.. ఆ కారణం చూపి, బెయిల్ పొందాలన్నది అరవింద్ కేజ్రీవాల్ కుట్ర అట. అలాగని ఈడీ ఆరోపిస్తోంది.
Also Read: కొబ్బరి బొండాల ‘కత్తి అందుకో’.. ‘జాణ’కీ.!
ఈడీ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు కదా.! దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థల్లో ఇదీ ఒకటి. ఇంత చీప్‌గా మామిడి పళ్ళ గురించి అరవింద్ కేజ్రీవాల్ మీద న్యాయస్థానానికి పితూరీలు చెప్పడమేంటి.?
ఆమ్.. ఆమ్.. ఆమ్..
అన్నట్టు, ఇది మామిడి పండ్ల సీజన్.! పైగా అక్కడున్నది ‘ఆమ్’ ఆద్మీ పార్టీ.! హిందీలో ఆమ్ అంటే మామిడి పండు అనే కదా అర్థం.! సరిపోయింది లెక్క.!
వ్యవస్థలు ఇలా తగలడ్డాయ్.! నిందితులు తప్పించుకోవడానికి నిజంగానే వెకిలి వేషాలు వేస్తున్నారా.? దర్యాప్తు సంస్థలు వెకిలి వేషాలు వేస్తున్నాయా.?
ఇది సామాన్యుడి అనుమానం.! ఈ అనుమానాలకి నివృత్తి ఎలా.?