Ashika Ranganath Sardar.. కార్తీ హీరోగా రూపొందిన ‘సర్దార్’ సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతోందిప్పుడు.
‘సర్దార్-2’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్టులో ఆషిక రంగనాథ్ నటిస్తోంది. ఆషిక రంగనాథ్ పుట్టినరోజు నేపథ్యంలో, ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది చిత్ర యూనిట్.

తమిళ, తెలుగు సహా పలు భాషల్లో ‘సర్దార్-2’ విడుదల కాబోతోంది. ఈ సినిమాలో మరో అందాల భామ మాళవిక మోహనన్ కూడా నటిస్తోంది.
పీఎస్ మిత్రన్ (PS Mitran) ఈ ‘సర్దార్-2’ (Sardar 2) చిత్రానికి దర్శకుడు. ఇదొక స్పై థ్రిల్లర్.!
Ashika Ranganath Sardar.. ‘విశ్వంభర’లో మెగాస్టార్ చిరంజీవితో..
కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్ విషయానికొస్తే, తెలుగులో ఆమె నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) సరసన ‘అమిగోస్’ (Amigos) సినిమాలో నటించింది. అదే ఆమెకి తొలి సినిమా.

ఆ తర్వాత అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), అల్లరి నరేష్ (Allari Naresh), రాజ్ (Raj Tarun) తరుణ్ కలిసి నటించిన ‘నా సామి రంగ’ (Naa Saami Ranga) సినిమాలోనూ ఓ కీలక పాత్రలో కనిపించింది.
Also Read: కియారా అద్వానీకి ‘గేమ్ ఛేంజర్’ బర్త్ డే విషెస్.!
మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’ (Vishwambhara)లోనూ ఓ కీలక పాత్రలో నటిస్తోంది ఆషిక రంగనాథ్.
హ్యాపీ బర్త్ డే ఆషిక రంగనాథ్.! Happy Birth Day Ashika Ranganath.