Ashu Reddy Drugs Case.. అషు రెడ్డికి ఏమయ్యింది.? ఆమె పేరెందుకు డ్రగ్స్ కేసులో వినిపిస్తోంది.?
ఆయనో సినీ నిర్మాత అట.! డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడట. పేరు కేపీ చౌదరి.. అట.! ఆయనతో పలువురు తెలుగు సినీ ప్రముఖులు టచ్‌లో వున్నారట.
ఆ లిస్టులో సురేఖా వాణి సహా అషు రెడ్డి మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై అషు రెడ్డి చాలా చాలా గుస్సా అవుతోంది.
Ashu Reddy Drugs Case.. అషు రెడ్డి పేరెందుకు లాగారబ్బా.?
సినీ పరిశ్రమ అన్నాక.. పరిచయాలుంటాయ్.! ఎవరెలాంటోళ్ళో ఎలా చెప్పగలం.? పైగా, కేపీ చౌదరి నిర్మాత అట.! నటీనటులతో సంబంధాలుంటాయ్ కదా.!

కేవలం ఫోన్ నెంబర్, నిందితుడి ఫోన్‌లో దొరికిందనో.. ఎక్కువసార్లు అతనితో సినీ ప్రముఖులు మాట్లాడారనో.. వారిపై నిందలు మోపెయ్యగలమా.?
గతంలో డ్రగ్స్ కేసులు ఏమయ్యాయ్.? ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, నటి అలాగే నిర్మాత ఛార్మి.. ఇలా చెప్పుకుంటూ పోతే, చాలా పేర్లు తెరపైకొచ్చాయ్.
విచారణ జరిగింది.. తెలుగు సినీ ప్రముఖులకు డ్రగ్స్ కేసులో క్లీన్ చిట్ వచ్చింది కూడా.! అయితే, రవితేజ సోదరుడిపై వచ్చిన అభియోగాలు.. అదంతా వేరే కథ.
లగ్జరియస్‌గా వుండకూడదా.?
అషు రెడ్డి ( Ashu Reddy ) లగ్జరియస్‌గా కనిపిస్తుంటుంది. ఖరీదైన కార్లు.. విదేశీ పర్యటనలు.. ఇవే ఆమెపై అనుమానాలకు కారణమని అంటే అతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా పాపులర్ అయిన అషు రెడ్డి, అంతకు ముందు నుంచే లగ్జరీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది.
పలు టీవీ షోస్, బిగ్ బాస్ తర్వాత అషు రెడ్డి చేసింది.. పాపులారిటీ పెంచుకుంది.! లగ్జరీస్‌కీ, డ్రగ్స్‌కీ లింక్ పెట్టడం సహజం. అలాగని లింక్ వుండదనుకోవడమూ పొరపాటే.!
Also Read :హీరోయిన్‌తో క్రికెటర్ డేటింగ్ ‘గిల్లు’డు.!
ఏమో, ఈ కేసు ఎలా తేలుతుందోగానీ.. అషు రెడ్డి ( Ashu Reddy ) పేరు మాత్రం హాట్ టాపిక్ అయ్యింది.
‘నా పేరు అనవసరంగా తీస్తున్నారు.. చట్ట పరమైన చర్యలకూ వెనుకాడను’ అంటూ హెచ్చరిస్తోంది అషు రెడ్డి, తనపై దుష్ప్రచారం చేస్తున్నవారికి.