శ్రీముఖి.. బుల్లితెరపై చేసిన హంగామాని నిన్న మొన్నటిదాకా చూశాం.. ఇప్పుడు బిగ్‌బాస్ రియాల్టీ షోలో బోల్డన్ని యాంగిల్స్ ఆమెలో (Sree Mukhi Rahul Sipligunj) చూస్తున్నాం. బాబోయ్ శ్రీముఖి ఇలాక్కూడా వుంటుందా.? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. బిగ్‌బాస్ రియాల్టీ షో అంటేనే అంత.
రియల్ లైఫ్‌లో ఎలా వున్నా, బిగ్ హౌస్‌లో ఈక్వేషన్స్ మారిపోతాయ్. ఆ బిగ్‌బౌస్ ఈక్వేషన్స్‌ని పెర్‌ఫెక్ట్‌గా ముందే జీర్ణించేసుకుని, హౌస్‌లోకి ఎంటర్ అయ్యింది శ్రీముఖి. అందుకేనేమో, ఆమె వేసే ప్రతి స్టెప్ ప్రీ-ప్లాన్డ్‌గానే వుంటోంది. ఏ టాస్క్ చేయాలన్నా సరే, శ్రీముఖి ప్లానింగ్ సూపర్బ్.
దొంగ – పోలీస్ టాస్క్ విషయంలో శ్రీముఖి ప్లానింగ్ ఎలాంటిదో చూశాం. డంబెల్ తీసుకుని, గ్లాస్ బాక్స్ పగలగొట్టడం అనే కాన్సెప్ట్‌కి ఆమె వేసిన స్కెచ్ అదుర్స్ అంతే. అఫ్‌కోర్స్, అది బెడిసి కొట్టేసిందనుకోండి. ఇక, లేటెస్ట్ టాస్క్‌లో శ్రీముఖి మరోమారు తనలోని ‘చంద్రముఖి’ యాంగిల్‌ని తెరపైకి తెచ్చింది.
ఫిజికల్‌గా రాహుల్ సిప్లిగంజ్ స్ట్రాంగ్ గనుక, అతనంటే ఇష్టం లేకపోయినా తన టీమ్‌లోకి శ్రీముఖి తీసుకుంది. పెర్‌ఫెక్ట్‌గా గేమ్ ఆడించింది తన టీమ్‌తో. ఇతర ఫిమేల్ కంటెస్టెంట్స్‌పై వ్యూహాత్మకంగా దాడి చేయించింది కూడా. కానీ, చివర్లో రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి దగ్గర నుంచి డ్రాగన్ ఎగ్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం ఈక్వేషన్స్ మారిపోయాయ్.
ఎమోషనల్‌గా రాహుల్ సిప్లిగంజ్‌ని బ్లాక్‌మెయిల్ చేయడానికి ట్రై చేసింది శ్రీముఖి. ‘నన్ను టచ్ చేయొద్దు.. చేశావంటే ఊరుకునేది లేదు’ అంటూ హెచ్చరించింది.
‘నువ్వంటే ఇష్టం లేకపోయినా గుడ్డిగా నమ్మి నిన్ను నా టీమ్‌లోకి తీసుకున్నాను. ఇప్పుడు నన్ను టచ్ చేశావో, జీవితంలో నిన్ను క్షమించే ప్రసక్తే వుండదు’ అంటూ శ్రీముఖి చెప్పేసరికి రాహుల్ సిప్లిగంజ్‌కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది.
బిగ్‌హౌస్‌లో ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు వుండకూడదనీ, టాస్క్‌లను ఎవరైనా గేమ్ ప్లాన్‌తో ఆడొచ్చనీ బిగ్‌బాస్‌తోపాటు, బిగ్‌హోస్ట్ కూడా హెచ్చరిస్తున్నా, శ్రీముఖి మాత్రం మారలేదు. బహుశా, శ్రీముఖి విషయంలో రాహుల్ సిప్లిగంజ్‌పై నాగార్జున చేసిన హెచ్చరికలతో, శ్రీముఖి మరింత బలాన్ని పుంజుకుందేమో.
ఆ అత్యుత్సాహంతో రాహుల్ సిప్లిగంజ్‌ని (Sree Mukhi Rahul Sipligunj) మరీ దారుణంగా ట్రీట్ చేసిందని అనుకోవాల్సి వస్తుంది. హౌస్‌లో ఓ సందర్భంలో శ్రీముఖిపై ‘ఫాల్తు’ వ్యాఖ్యల్ని రాహుల్ చేసిన మాట వాస్తవం. దానికి రాహుల్ క్షమాపణ కూడా చెప్పాడు నాగార్జున సమక్షంలో.
ఆ తర్వాత కూడా రాహుల్‌ని శ్రీముఖి క్షమించలేదన్నమాట. హౌస్‌లో ఇలాంటి వాతావరణాన్ని కొనసాగిస్తూనే, టాస్క్ గెలవడం కోసం రాహుల్‌ని శ్రీముఖి తన టీమ్‌లోకి ఎంచుకుని, చివర్లో షాక్ ఇచ్చిందంటే.. అమ్మో, శ్రీముఖి.. చంద్రముఖి లాంటిదే అన్పించడం వింతేమీ కాదన్నమాట.