Balakrishna Anjali Meera Chopra.. అక్కడేం జరిగిందో పూర్తిగా ఎవరికీ తెలియదు. సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ, నటి అంజలిని నెట్టేశాడు.. అదీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో.
అలా పక్కకి జరగమని బాలయ్య చెప్పడం, అది అంజలికి వినిపించకపోవడం.. దాంతో గుస్సా అయిన బాలయ్య, అంజలిని తోసెయ్యడం.. ఇదీ సర్క్యులేట్ అవుతున్న వీడియోల్లో కనిపించిన విషయం.
బాలయ్య లిక్కర్ సేవించి, ఇలా దుస్సాహసానికి పాల్పడ్డాడంటూ ట్రోలింగ్ జరుగుతోంది.
అంజలి ట్వీటేసినా.. ఆగని దుమారం.
నటుడు బాలయ్యతో తనకున్న స్నేహం చాలాకాలం నాటిదనీ, తన సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌కి బాలయ్య రావడం ఆనందంగా వుందని ‘వివాదానికి’ ఫుల్ స్టాప్ పెట్టేలా అంజలి, ఓ ట్వీటేసింది.
ఇది ‘పోర్స్‌డ్ ట్వీట్’ అంటూ దుమారం కొనసాగుతోందనుకోండి.. అది వేరే విషయం. ఇంతలోనే ఓ నటి, ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా స్పందించింది.
Also Read: పాయల్ రాజ్‌పుత్‌ని వెంటాడుతున్న పాత గాయం.!
‘అమ్మాయిలు వెన్నెముక లేకుండా ప్రవర్తిస్తున్నారు.. అందుకే, ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయ్.. నవ్వడం కాదు, నిలదీయాలి..’ అంటూ ఆ నటి ట్వీటేసింది.
ఆ నటి ఎవరో కాదు, మీరా చోప్రా. తెలుగులో ‘బంగారం’ తదితర సినిమాల్లో నటించింది మీరా చోప్రా. హీరో నితిన్‌తోనూ ఓ సినిమా చేసింది. ఆ సినిమా నిర్మాణ సమయంలో అనేక వివాదాలు తెరపైకొచ్చాయ్.
Balakrishna Anjali Meera Chopra.. మీరా చోప్రా.. అప్పుడూ.. ఇప్పుడూ..
తమిళంలోనూ మీరా చోప్రా పలు సినిమాల్లో నటించింది. అక్కడే ఆమె వివాదాస్పద నటి అనిపించుకుంది.
ప్రస్తుతం బాలీవుడ్‌లో ఒకటీ అరా సినిమాల్లో నటిస్తోంది. ఈ మధ్యనే పెళ్ళి చేసుకుని, ‘మీరా చోప్రా కేజ్రీవాల్’గా తన పేరు మార్చుకుంది ఈ భామ.
అన్నట్టు, ‘ఆ నటుడు ఎవరో నాకు తెలీదు’ అని మీరా చోప్రా ట్వీట్‌లో పేర్కొనడం కొసమెరుపు.

ఇంతకీ, మీరా చోప్రా ట్వీటుపై నటి అంజలి స్పందిస్తుందా.? నటుడు బాలకృష్ణ తరఫున ఈ మొత్తం వ్యవహారంపై ఏమైనా స్పందన ఆశించొచ్చా.?
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలో విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా నటిస్తే, ఆ సినిమాలో అంజలి ఓ కీలక పాత్రలో నటించింది.