Balakrishna Chiranjeevi Assembly Controversy.. నందమూరి బాలకృష్ణ ఏ ఉద్దేశ్యంతో ఆ మాట అన్నారోగానీ, ఆ వ్యాఖ్యలిప్పుడు కూటమికి బీటలు తెచ్చే పరిస్థితి ఏర్పడింది.!
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ‘సైకోగాడు’ అని నందమూరి బాలకృష్ణ అభివర్ణిస్తే, వైసీపీ శ్రేణులు గుస్సా అవడంలో వింతేమీ లేదు.
అక్కడితో నందమూరి బాలకృష్ణ ఆగిపోయి వుంటే, ఈ రోజు వ్యవహారం ఇంతలా రచ్చకెక్కేది కాదు. మధ్యలోకి చిరంజీవి పేరుని బాలయ్య తీసుకురావడం కొత్త వివాదానికి కారణమయ్యింది.
Balakrishna Chiranjeevi Assembly Controversy.. వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా..
చిరంజీవి పేరుని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రస్తావిస్తే, బాలయ్యకి ఎందుకు ఒళ్ళు మండిపోయిందో ఎవరికీ అర్థం కాలేదు.
డ్యామేజ్ కంట్రోల్ చర్యల్లో భాగంగా, కామినేనితో ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకునేలా చేయగలిగింది కూటమి నాయకత్వం. అసెంబ్లీ రికార్డుల నుంచి కామినేని, బాలయ్య వ్యాఖ్యలు తొలగించబడ్డాయి.
అక్కడితో వివాదం సమసిపోలేదు. వ్యవహారం వేరే టర్న్ తీసుకుంది. సోషల్ మీడియా వేదికగా ‘ఫ్యాన్ వార్స్’ నడుస్తున్నాయి. వాటిని టీడీపీ అధినాయకత్వం ఆపలేకపోతోంది.
కౌంటర్ ఎటాక్ ఇచ్చే క్రమంలో, జన సేన పార్టీ శ్రేణులు కూడా హద్దులు దాటుతున్నమాట వాస్తవం. ‘కుక్క కాటుకి చెప్పు దెబ్బ’ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నట్లు జనసైనికులు చెబుతున్నారు.
కూటమికి ముప్పుగా మారనుందా.?
నిజానికి, ఈ పరిస్థితుల్లో డ్యామేజ్ కంట్రోల్ జరగాల్సింది హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నుంచే. ఆయనే, వివరణ ఇస్తే తప్ప, వివాదం సమసిపోయేలా లేదు.
చిరంజీవి – బాలకృష్ణ మధ్య సన్నిహిత సంబంధాలే వుంటాయి. కాకపోతే, బాలకృష్ణ నోరు అదుపులో వుండదు ఒక్కోసారి. అదే, అన్ని సమస్యలకీ కారణం.
బ్లడ్డు, బ్రీడు.. అంటూ ఒకప్పుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదమయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Also Read: వీధి కుక్కలకేనా హక్కులు.? మనుషులకి లేవా హక్కులు.?
అసెంబ్లీలో చిరంజీవిపై బాలయ్య వ్యాఖ్యల నేపథ్యంలో, పవన్ కళ్యాణ్‌ని హైద్రాబాద్‌లో చంద్రబాబు ప్రత్యేకంగా కలవాల్సి వచ్చింది.
టీడీపీ – జనసేన మధ్య విభేదాల కోసం వైసీపీ ఆతృతగా ఎదురుచూస్తోంది. ఆ కారణంగా వైసీపీకి, ఇప్పుడు కంటెంట్ దొరికింది. కొందరు బాలయ్య అభిమానులు, వైసీపీకి ఆయుధాన్నిస్తున్నారు.
టీడీపీ అధినాయకత్వం, తక్షణం డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగాలి.. బాలయ్యతో, వివరణ ఇప్పించాలి. లేదంటే, కూటమి సఖ్యతకు బీటలు వారడం ఖాయం.
