Balakrishna Slams Nagachaitanya ‘వీర సింహా రెడ్డి’ సినిమా విజయోత్సవంలో నందమూరి బాలకృష్ణ, ‘ఆ రంగారావు.. ఈ తొక్కినేని’ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
బాలకృష్ణ వ్యాఖ్యల్ని ఖండిస్తూ, అక్కినేని నాగేశ్వరరావు మనవళ్ళు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్లేశారు.
మరోపక్క, ఎస్వీ రంగారావు అభిమానులు అలాగే అక్కినేని అభిమానులు నందమూరి బాలకృష్ణకు అల్టిమేటం జారీ చేశారు. బాలకృష్ణ దిష్టిబొమ్మల్నీ తగలబెట్టారు.
ప్రేమ అక్కడ లేదు.. ఇక్కడ వుంది.. అని బాలయ్య చేసిన వ్యాఖ్యలు వెనుక అసలు అర్థమేంటి.? ఇది మళ్ళీ ఇంకో వివాదం కానుందా.?
Mudra369
‘నోటి దూల బాలకృష్ణ’ (Bala Krishna) అంటూ అక్కినేని (Akkineni Nageswara Rao) అభిమానులు, నందమూరి బాలకృష్ణపై మండిపడుతున్నారు కూడా.
Balakrishna Slams Nagachaitanya.. ప్రేమ అక్కడ లేదు.. ఇక్కడ వుంది.!
ఈ వివాదంపై తాజాగా బాలకృష్ణ స్పందించారు. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గానికి వెళ్ళిన బాలయ్య, అక్కడ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

‘అక్కినేని నాగేశ్వరరావు నాకు బాబాయ్. నా పట్ల ఎంతో ప్రేమ, ఆప్యాయతతో వుండేవారాయన. ఆయనంటే నాకు అభిమానం, గౌరవం..’ అని బాలకృష్ణ (Nandamuri Bala Krishna) చెప్పుకొచ్చారు.
అంతే కాదు, ‘ప్రేమ అక్కడ లేదు.. ఇక్కడ వుంది..’ అంటూ బాలకృష్ణ (TDP MLA Nandamuri Bala Krishna) చేసిన వ్యాఖ్యలు మళ్ళీ సంచలనంగా మారాయి.
బాలయ్యకు మద్దతుగా ఎస్వీయార్ వారసులు..
కాగా, ‘నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటల్లో తప్పేమీ మాకు కనిపించలేదు. మా కుటుంబానికి బాలకృష్ణ అత్యంత సన్నిహితుడు..’ అంటూ ఎస్వీయార్ మనవళ్ళు ఇప్పటికే స్పందించారు.
Also Read: ‘తొక్కినేని’ రచ్చ: బాలకృష్ణని నాగార్జున ఏమీ పీకలేడా.?
ఈ మేరకు ఎస్వీయార్ (SV Ranga Rao) మనవళ్ళు ఓ వీడియోతోపాటు, ప్రెస్ నోట్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.
మొత్తమ్మీద, గత కొద్ది రోజులుగా జరుగుతున్న రచ్చపై బాలయ్య స్పందించారన్నమాట. ఈ స్పందనతో వివాదం సద్దుమణగుతుందా.? వివాదం ముదిరి పాకాన పడుతుందా.? వేచి చూడాల్సిందే.