Balakrisna Roja Tokkineni.. సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే.. మంత్రి రోజా సెటైర్లు వేశారు.
స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావుపై బాలకృష్ణ వ్యాఖ్యల్ని రోజా ఖండించారు. ఇటీవల ‘వీర సింహా రెడ్డి’ సినిమా ఫంక్షన్‌లో అక్కినేని గురించి ప్రస్తావిస్తూ, ‘తొక్కినేని’ అంటూ పరుష వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ.
ఈ వ్యాఖ్యలపై రోజా స్పందిస్తూ, గొప్ప వ్యక్తుల్ని అవమనించేలా మాట్లాడకూడదని, స్వర్గీయ ఎన్టీయార్‌ని ఎవరైనా ఏమైనా అంటే, నందమూరి అభిమానులకు కోపం రాదా.? అని ప్రశ్నించారు.
అక్కినేని అభిమానులూ ఆలోచించుకోండి..
ఈ మధ్యన తరచూ, ‘జనసైనికులూ, పవన్ కళ్యాణ్ అభిమానులూ ఆలోచించుకోండి.. నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలూ ఆలోచించుకోండి..’ అంటూ చిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు రోజా.
బాలకృష్ణ ‘తొక్కినేని’ వివాదంపైనా రోజా పరమ రొటీన్ డైలాగ్ పేల్చారు. ‘బాలకృష్ణ అభిమానులు ఆలోచించుకోవాలి..’ అనేశారామె. ఇంతకీ, ఏం ఆలోచించుకోవాలి.?
Balakrisna Roja Tokkineni.. రోజా చేస్తే తప్పు కాదేమో.!
నందమూరి అభిమానులకు స్వర్గీయ ఎన్టీయార్ ఎలాగో.. అక్కినేని అభిమానులకు స్వర్గీయ నాగేశ్వరరావు ఎలాగో.. మెగా అభిమానులకు చిరంజీవి కూడా అంతే కదా.?

మరి, చిరంజీవిపై రోజా ఎందుకు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నట్లు. తీవ్రాతి తీవ్రమైన వ్యాఖ్యలు గతంలో రోజా చేశారు.
ఒహో, రాజకీయాల్లో వుంటే ఏమైనా అనొచ్చన్నమాట. కాదు కాదు, రోజా ఏం చేసినా రైటే.. అదే ఇంకెవరన్నా చేస్తే తప్పన్నమాట.
Also Read: Nithya Menen.. టీచరమ్మ పాఠం.. వాళ్ళకి గుణపాఠం.!
బాలయ్య వ్యాఖ్యల్ని ఇక్కడ ఎవరూ సమర్థించరు. అలాగే, రోజా తీరు విషయంలోనూ అంతే. అందుకే, ‘ఆఖరికి నువ్వు కూడానా రోజా.?’ అంటూ నెటిజన్లు సెటైర్లేస్తున్నారు.
అయినా, మీడియాని అనాలి.. రాజకీయ ప్రముఖులు కన్పిస్తే చాలు.. మొహాల మీద కెమెరాలు, మైకులు పెట్టేసి.. అడగాల్సిందీ, అడక్కూడనిదీ అడిగేస్తుంటారు టీఆర్పీ కక్కుర్తిలో భాగంగా.
అన్నట్టు, అక్కినేని అభిమానులు నందమూరి బాలకృష్ణ మీద తీవ్రంగా మండిపడుతూ ఆందోళనలు చేస్తున్నారు. ‘నోటి దూల బాలయ్య’ అంటూ కొత్త పేరు పెట్టారు.!