తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో నాలుగో సీజన్‌కి సంబంధించినంతవరకు ఇప్పటిదాకా కనిపిస్తున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే, అబిజీత్ నెంబర్ వన్ ప్లేస్‌లో (Abijeet Number One In BIgg Boss Telugu 4) వున్నట్లు అర్థమవుతోంది.
తాజా ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున, ఆరుగురు కంటెస్టెంట్స్‌ని 1 నుంచి 6 వరకు నెంబర్స్ వెనుక నిల్చోమని అడిగితే.. హౌస్‌లో యునానిమస్‌గా అందరూ ఫస్ట్ ప్లేస్‌ని అబిజీత్‌కి ఇచ్చేశారు. రెండో ప్లేస్‌లో మెహబూబ్ నిల్చున్నాడు.
మూడో ప్లేస్‌లో లాస్య సెటిలైపోగా, 4, 5, 6 పొజిషన్ల విషయమై కొంత గందరగోళం నడిచింది. హౌస్‌మేట్స్ ఎవరికీ నెంబర్ వన్ పొజిషన్ విషయంలో పెద్దగా ‘ఇష్యూ’ ఏమీ లేకుండా పోయిందంటే, దానర్థం.. ఈ సీజన్ నెంబర్ వన్ ఎవరో కాదు, అబిజీత్.. అని అనుకోవాలేమో.
కానీ, కింగ్ అక్కినేని నాగార్జున మాత్రం, ‘ఈ నెంబర్లన్నీ తప్పు’ అని తేల్చి పారేశారు. ‘హౌస్‌లో గేమ సీరియస్‌గా ఆడాల్సిందే..’ అంటూ చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చాడు. మరోపక్క, అబిజీత్ నామినేట్ అయిన ప్రతిసారీ, ఆయా పోల్స్‌లో అతనికే టాప్ ప్లేస్ దక్కుతోంది.
ఇవన్నీ అనధికార పోల్స్. బిగ్‌బాస్ మాత్రం ఇప్పటిదాకా జరిగిన పోల్స్‌లో ఎన్ని ఓట్లు వచ్చాయో చెబుతున్నాడుగానీ, ఏ కంటెస్టెంట్‌కి ఎన్ని ఓట్లు వచ్చాయో మాత్రం చెప్పడంలేదు. ‘అతి తక్కువ ఓట్లు వచ్చాయి..’ అంటూ సూర్య కిరణ్, కరాటే కళ్యాణి, దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్‌లను ఇప్పటిదాకా హౌస్ నుంచి ఎలిమినేట్ చేసినా.. వారికి వచ్చిన ఓట్లపైనా భిన్నాభిప్రాయాలున్నాయి.
ఏదిఏమైనా, అబిజీత్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాడు. అయితే, అతని పట్ల నెగెటివిటీ కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. మోనాల్ రూపంలో ప్రతిసారీ అబిజీత్‌కి సమస్యలు ఎదురవుతున్నాయి. ఆ ఒక్క ఇష్యూ లేకపోతే, హౌస్‌లోనూ.. బయటా అబిజీత్‌కి తిరుగుండకపోవచ్చు. మోనాల్ గజ్జర్ సమస్యని డీల్ చేయడమే పెద్ద టాస్క్‌గా మారిపోతోంది అబిజీత్‌కి.
చివరగా, అమ్మాయిలా కనిపించాల్సి వచ్చినప్పుడు అఖిల్ ముసుగేసుకుని తప్పించుకున్నట్లే, అబిజీత్ కూడా చేసి వుండాల్సిందేమో. లేడీ గెటప్ వల్ల అబిజీత్ మీద నెగెటివ్ ఇంప్రెషన్ పడింది.