Table of Contents
BEAST Movie Telugu Review.. తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ‘బీస్ట్’ సినిమా, ఆ సినిమాలోని ‘అరబిక్ కుతు’ పాటతో రిలీజ్‌కి ముందు విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది.
విజయ్ సరసన పూజా హెగ్దే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి నెల్సన్ దిలీప కుమార్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
ఓ ‘రా’ ఏజెంట్, సరదా సరదాగా తీవ్రవాదుల్ని ఏరివేయడమే ఈ సినిమా కథాంశం. చిత్రమేంంటే, సినిమా కథలో ఎక్కువ భాగం, ఓ పేద్ధ షాపింగ్ మాల్‌లోనే జరుతుంటుంది.
BEAST Movie Telugu Review.. హైపూ.. నెగెటివిటీ.. రెండూ విచ్చలవిడిగానే.!
విజయ్ సినిమాలకు సహజంగానే వుండే, ప్రీ రిలీజ్ నెగెటివిటీ, ప్రీ రిలీజ్ హైప్ ‘బీస్ట్’ సినిమా విషయంలోనూ కనిపించాయి.
డిజాస్టర్ టాక్‌తోపాటు, విజయ్ అభిమానులు చేసిన సూపర్ హిట్ ప్రచారం ‘బీస్ట్’ సినిమాకి ఎలా పనిచేశాయ్.? అన్నది వేరే చర్చ.
కోవిడ్ పాండమిక్ తర్వాత రిలీజైన భారీ చిత్రాల్లో ‘బీస్ట్’ కూడా ఒకటి. క్వాలిటీ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. కథ పరంగానూ ఇంట్రెస్టింగ్ వ్యవహారమే. కాకపోతే, ఒకే చోట సినిమా నడవడమే ఈ సినిమాకి పెద్ద మైనస్.
విజయ్ స్టైలింగ్ సూపర్బ్.! కానీ, సింగిల్ కాస్ట్యూమ్.. అన్నట్టు తయారైంది పరిస్థితి. హీరోయిన్ పూజా హెగ్దే కూడా అంతే. ఆ లోటుని పాటల్లో తీర్చేశారనుకోండి.. అది వేరే సంగతి.
ఒక్క పాట, చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించింది. చివర్లో వచ్చే మరో పాట.. అప్పటికే, సినిమా చూసేయడంతో.. ధానికోసం నీరసంగా ఎదురుచూడటం కష్టమే.
తీవ్రవాదం వర్సెస్ దేశభక్తి.!
దేశానికి ప్రధాని అవ్వాలనుకునే ఓ కేంద్ర మంత్రి, తీవ్రవాదులతో చేతులు కలిపి, షాపింగ్ మాల్ హైజాక్‌కి ప్లాన్ చేస్తాడు.
తమక్కావాల్సిన తీవ్రవాద నాయకుడ్ని విడిపించుకుపోవడం సదరు తీవ్రవాదుల లక్ష్యం. దాన్ని హీరో ఎలా భగ్నం చేశాడన్నది ఈ సినిమా కథ.

ఇలాంటి కథలు చాలానే గతంలో చూసేశాం. దాంతో, కథ కొత్తగా ఏమీ అనిపించదు. కాకపోతే, హీరోకి చిన్న పిల్లలంటే కాస్త ఎక్కువ ప్రేమ. అదొక్కటే, ఇందులో కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ అనుకోవాలి.
Also Read: నయనతారకి పెళ్ళి కాకుండానే విడాకులట.!
భయంకరమైన తీవ్రవాదులతోనూ హీరో కామెడీ చేసేస్తాడు. సూసైడ్ స్క్వాడ్‌గా మారిపోయే తీవ్రవాదుల్ని, ఫ్యామిలీ సెంటిమెంట్‌తో హీరో కట్టి పడేస్తాడు.
‘రా’ ఏజెంట్, యుద్ధ విమానం వేసుకుని, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి వెళ్ళిపోతాడు.. ఆ ‘రా’ ఏజెంట్ అడగ్గానే, రాఫెల్ యుద్ధ విమానాల్ని భారత ప్రభుత్వం పంపించేస్తుంది.
ఇలాంటి కామెడీ సీన్స్ చాలానే వున్నాయ్ సినిమాలో. అవే ఈ సినిమాకి చాలా పెద్ద మైనస్ అయిపోయాయి. అసలు సినిమాలో కామెడీ చెయ్యనిదెవరు.? అందరూ కామెడీ చేసేసి, సినిమాని నిండా ముంచేశారు.
ఏం కామెడీ బాసూ ఇది.?
చివర్లో యుద్ధ విమానాల కాన్సెప్ట్ పెట్టకపోయి వుంటే, ఒకింత బావుండేదేమో.!
యుద్ధ విమానాలతో కామెడీ చేయబోయి బోల్తా కొట్టారు. నిజానికి, రోమాలు నిక్కబొడుచుకునేలా చేయాల్సిన సన్నివేశాలవి. వాటిని కామెడీ కోణంలో రాసుకున్నారో, సీరియస్‌గా రాసుకుంటే కామెడీ అయిపోయాయో.. చెప్పడం కష్టమే.
కడుపుబ్బా నవ్వుకోవడానికి కామెడీ సీన్స్ చాలానే వుంటాయ్. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌ని కూడా కామెడీగా వాడేసుకోవడం శోచనీయమే. ఎంత దళపతి విజయ్ హీరో అయితే మాత్రం, మరీ ఇలా కామెడీ చేసేస్తావా దిలీప్.?
Also Read: కాఫీ విత్ కరణ్.! ఈ ‘కంత్రీ’ వేషాలేంటి సామీ.?
సాంకేతిక అంశాల విషయానికొస్తే, యాక్షన్ కొరియోగ్రఫీ బావుంది. డాన్సులు సూపర్బ్. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. అన్నీ చాలా చాలా బావున్నాయ్. అన్నీ కుదిరినా, ‘బీస్ట్’ సీరియస్‌గా కామెడీ అయిపోయింది.!
చివరగా.. కథ, కమామిషు ముందే అర్థమై.. ఓటీటీ రివ్యూ ఇచ్చేద్దామని.. లైట్ తీసుకోవడం వల్లే ఈ జాప్యం సుమండీ.!