Bhagyashri Borse Lenin Luck.. తెలుగమ్మాయిులు తెలుగులో డైలాగులు చెబితే కొత్తేముంటుంది.
పర భాషా అమ్మాయిలు తెలుగు డైలాగులు అది కూడా గ్రాంధికంలో డైలాగులు చెప్పేస్తుంటే.. అది కదా అసలు సిసలు కి్క్కు.
ఇంతకీ గ్రాంధికంలో డైలాగులు పలికేస్తున్న ఆ ముద్దుగుమ్మ ఎవరనుకుంటున్నారా.? ఇంకెవరు భాగ్యశ్రీ బోర్సే.
మరాఠీ అమ్మాయి. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
Bhagyashri Borse Lenin Luck.. సక్సెస్, ఫెయిల్యూర్ డోంట్ కేర్.!
తొలి సినిమా ఆశించిన సక్సెస్ అందుకోలేదు.. అయినా వరుస అవకాశాలు దక్కించుకుంటూనే వుంది. తాను నటించిన సినిమాని ప్రమోట్ చేసుకోవడంలో భాగ్యశ్రీ బోర్సే పెట్టే ఎఫర్ట్ అంతా ఇంతా కాదు.
సినిమాలో ఆమె పాత్ర ఎలాంటిదైనా.. ఎక్కువ, తక్కువ.. అనే స్కోప్‌తో సంబంధం లేకుండా సినిమా ప్రమోషన్స్‌లో మాత్రం హండ్రెడ్ పర్సంట్ తన బెస్ట్ ఇస్తుంటుంది.
దురదృష్టవశాత్తూ భాగ్యశ్రీ ఇంతవరకూ నటించిన సినిమాలన్నీ నెగిటివ్ టాకే తెచ్చుకున్నాయనుకోండి.
అలా అని నటన రాదంటారా.? అంటే, కాదు కాదు, ‘కాంత’ తదితర సినిమాల్లో భాగ్యశ్రీ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. డాన్సులూ, గ్లామరూ ఇలా ఎక్కడా వంక పెట్టడానికి లేదు.
కమర్షియల్ యాంగిల్ విషయానికి వస్తే.. ఆ లెక్కలు వేరే వుంటాయ్ కదా..! ఆ లెక్కలు బెడిసికొట్టి భాగ్యశ్రీకి సరైన గుర్తింపు దక్కకపోతుండొచ్చు..
వెరీ లేటెస్టుగా, భాగ్యశ్రీ బోర్సే ‘లెనిన్’ సినిమాలో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అఖిల్ అక్కినేని నటించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ పోషించిన పాత్ర ప్రయారిటీ సంగతి అటుంచితే.. ఈ సినిమాని ప్రమోట్ చేసే యాంగిల్లో ఆమె పడుతున్న శ్రమకు అభిమానులు ఫిదా అవ్వాల్సిందే.
భాగ్యశ్రీ డైలాగు.. బహు బాగు బాగు.!
‘ఏమంటివి.. ఏమంటివి..’ అంటూ పెద్ద ఎన్టీయార్ చెప్పిన పాత చేంతాడంత క్లిష్టతరమైన డైలాగులు భాగ్యశ్రీ బోర్సే చాలా అలవోకగా చెప్పేస్తోంది.
ఈ డైలాగులు తెలుగమ్మాయిలు.. చెప్పడమే చాలా చాలా కష్టం. పెద్ద ఎన్టీయార్ తర్వాత, అలాంటిది మరాఠీ అమ్మాయ్ అయ్యుండి భాగ్యశ్రీ.. అది కూడా లైవ్‌లో చెప్పేస్తుండడం నిజంగా ఆశ్చర్యకరం.
ఎంత కష్టపడి నేర్చుకుంటే ఈ డైలాుగుల్ని అంత అలవోకగా చెప్పగలదు భాగ్యశ్రీ. అంటే సినిమాపై తనకున్న ప్యాషన్.. డెడికేషన్ అలాంటిది మరి.
సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో పని లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే వుంది. అవి కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులే. అన్ని సినిమాల్నీ అంతే కష్టపడి ప్రమోట్ చేసింది.
ఇప్పుడు ‘లెనిన్’ విషయంలోనూ అంతే.! తన వంతుగా సినిమాని ప్రమోట్ చేయడంలో నెక్స్‌ట్ లెవల్ ఎఫర్ట్స్ పెడుతున్నట్లు కనిపిస్తోంది.
అందులో భాగంగానే పెద్ద ఎన్టీయార్ డైలాుగుల్ని స్టేజ్‌పై చక్కగా పలికేస్తోంది. ‘లెనిన్’ సినిమా హిట్ అయితే, భాగ్యశ్రీకి మంచి భవిష్యత్తు వుంటుందనడంలో ఎనీ డౌట్.!
