Home » ఔను.! పవన్ కళ్యాణ్‌ని అరెస్ట్ చేసి తీరాల్సిందే.!

ఔను.! పవన్ కళ్యాణ్‌ని అరెస్ట్ చేసి తీరాల్సిందే.!

by hellomudra
0 comments
Pawan Kalyan

Pawan Kalyan Sugali Cheating.. కరెక్ట్.! పవన్ కళ్యాణ్‌ని అరెస్ట్ చేసి తీరాల్సిందే.! వీలైతే, ఉరి శిక్ష కూడా విధించెయ్యాలి.! ఇంత పెద్ద నేరం చేశాక, పవన్ కళ్యాణ్‌ని ఎలా వదిలేస్తాం.? అస్సలు వదలకూడదు.

ఇంతకీ, జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన నేరమేంటి.? అనుమానాస్పద స్థితిలో మరణించిన సుగాలి ప్రీతి గురించి తెలిసిందే కదా.!

ఆ సుగాలి ప్రీతి డెత్ మిస్టరీ నేపథ్యంలో, ఆమె కుటుంబానికి అండగా నిలబడటమే జన సేనాని పవన్ కళ్యాణ్ చేసిన నేరం.!

‘పవన్ కళ్యాణ్ స్పందించడం వల్లే, తన బిడ్డ సుగాలి ప్రీతి డెత్ మిస్టరీ అంశం, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది..’ అని స్వయానా సుగాలి ప్రీతి తల్లి పార్వతీ దేవి అప్పట్లో చెప్పారు.

కేవలం, పవన్ కళ్యాణ్ అలా స్పందించడం వల్లనే, తమ కుటుంబానికి న్యాయం జరిగిందని కూడా చెప్పుకొచ్చారు పార్వతీ దేవి గతంలో.

జన సైనికులు బలంగా నిలబడటం వల్లే, అప్పటి ప్రభుత్వం దిగొచ్చి, తమ కుటుంబానికి న్యాయంగా దక్కాల్సినవి ఇచ్చిందని సుగాలి ప్రీతి తల్లి పార్వతీ దేవి వివరించిన వీడియోలున్నాయి.

కానీ, అదే పార్వతీ దేవి తాజాగా పవన్ కళ్యాణ్ మీద చీటింగ్ కేసు పెట్టాలంటూ, పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ మధ్యలో ఏం జరిగింది.? అంటే, అదే రాజకీయమంటే.!

వైసీపీ హయాంలోనే సాక్ష్యాలు తారుమారయ్యాయనీ, ఫేక్ జీవో ద్వారా సీబీఐ విచారణకు ఆదేశించినట్లు మాయ మాటలు చెప్పారనీ పార్వతీ దేవి సెలవిచ్చారు అప్పట్లో.

పార్వతీ దేవి ఏం చెప్పారో, అవే మాటల్ని ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కూడా చెబుతున్నారు. కానీ, మారిన మనిషి పార్వతీ దేవికి, పవన్ కళ్యాణ్ మాటలు నచ్చడంలేదు.

2019 ఎన్నికలకు ముందు సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆ తర్వాత ఐదేళ్ళు అధికారంలో వున్నది వైసీపీ. ఇప్పుడు ఆ వైసీపీ తరఫున వకాల్తా పుచ్చుకుంటున్నారు పార్వతీ దేవి.

‘రాజకీయాలు ఇలానే వుంటాయ్ పవన్ కళ్యాణ్.. ఇలాంటి రాజకీయాలు చేయగలిగితేనే, రాజకీయ పార్టీని నడపాలి.. లేదంటే, రాజకీయాల నుంచి తప్పుకోవాలి..’ అనే సందేశాన్ని పార్వతీ దేవి ఉదంతం నిరూపిస్తోంది.

నిజానికి, రాజకీయాలు ఇలాగే వుంటాయని పవన్ కళ్యాణ్‌కి కూడా తెలుసు. కానీ, బాధిత కుటుంబాన్ని ఆదుకునే విషయంలో, పవన్ కళ్యాణ్ ‘రాజకీయ కోణాన్ని’ చూడలేదు. అదే, పవన్ కళ్యాణ్ చేసిన నేరం.

ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.! కుమార్తె మరణంతో సుగాలి ప్రీతి తల్లి పార్వతీ దేవి చేస్తున్న రాజకీయం, ఆమెను నడిపిస్తున్న వైసీపీ నీఛ రాజకీయం.. అన్నిటినీ ప్రజలు చూస్తున్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో, పవన్ కళ్యాణ్‌కి రాజకీయంగా చెడ్డ పేరు వస్తుందా.? అంటే, న్యాయం కోసం నిలబడటమే నేరమైతే, ఆ నేరం మళ్ళీ మళ్ళీ చెయ్.. అంటున్నారు జన సైనికులు.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group