Table of Contents
Bhagyashri Borse Mass Maharani.. అస్సలేమాత్రం మొహమాటపడలేదు ఈ కొత్త భామ.! తొలి తెలుగు సినిమాతోనే, టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిన భాగ్యశ్రీ గురించే ఇదంతా.!
భాగ్యశ్రీ బోర్సే.. అదేనండీ, ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కదా.! సినిమా ప్రమోషన్ల కోసం అన్నీ తానే అయి వ్యవహరించిందనడం అతిశయోక్తి కాదు.
హీరో రవితేజ, ఎందుకో ఈ సినిమా ప్రమోషన్ విషయంలో కాస్త మొహమాటపడ్డాడు. అటు నిర్మాత, ఇటు దర్శకుడు.. ఇంకో వైపు హీరోయిన్ భాగ్యశ్రీ ‘మిస్టర్ బచ్చన్’ ప్రమోషన్ బాధ్యతల్ని మోయాల్సి వచ్చింది.
Bhagyashri Borse Mass Maharani.. తొలి సినిమాతోనే డబ్బింగు..
వేదికలపై డాన్సులేసింది.. తెలుగులో మాట్లాడేందుకూ భాగ్యశ్రీ ప్రయత్నించింది. తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పుకుంది.
తదుపరి సినిమా ప్రమోషన్ల కోసం వచ్చేటప్పుడు, బాగా తెలుగు మాట్లాడతాననీ చెప్పింది భాగ్యశ్రీ బోర్సే. ఈ విషయంలో భాగ్యశ్రీని అభినందించాల్సిందే.

ఇంతకీ, ‘మిస్టర్ బచ్చన్’ సినిమా భాగ్యశ్రీకి హిట్టు ఇచ్చినట్లేనా.? రివ్యూలు అయితే మిక్స్‌డ్‌గానే కనిపిస్తున్నాయి.
గ్లామర్ గురించే చర్చ..
యునానిమస్ టాక్ ఏదన్నా వుందంటే, అది భాగ్యశ్రీ గ్లామర్ గురించే. అస్సలేమాత్రం మొహమాటపడలేదు గ్లామర్‌లో అని.. భాగ్యశ్రీ గురించి చర్చించుకుంటున్నారు.
యాభై ఆరేళ్ళ రవితేజ.. ఇరవై ఐదేళ్ళ భాగ్యశ్రీ మధ్య ఆన్ స్క్రీన్ రొమాన్స్ అసభ్యకరంగా వుందన్న వాదనల సంగతెలా వున్నా, ఆమె కోసం ఇంకోసారి సినిమా చూడొచ్చనేవారూ లేకపోలేదు.

డాన్సులు బాగానే చేసింది. తొలి సినిమా గనుక, నటన విషయంలో చిన్న చిన్న లోపాల్ని మరీ అంత ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
మంచి మార్కులే పడ్డాయ్..
ఓవరాల్‌గా చూస్తే, తొలి సినిమాతో భాగ్యశ్రీకి చెప్పుకోదగ్గ మార్కులే పడ్డాయ్.! అసలే, తెలుగు సినిమాకి హీరోయిన్ల కొరత వుంది.
Also Read: తుత్తర బ్యాచ్.! చెప్పేదాకా ఆగరేం.!
లక్కు కలిసొస్తే, భాగ్యశ్రీ (Bhagyashri Borse) స్టార్ హీరోయిన్ అయ్యేందుకు అవకాశాలు పుష్కలంగానే వున్నాయ్.
అన్నట్టు, ‘మాస్ మహరాణి’ అనే బిరుదుని తనకు తానే ఇచ్చేసుకుంది భాగ్యశ్రీ.! పాప కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు మరి.!