Bheemla Nayak Power Storm: ఓ సినిమా దెబ్బకి ప్రభుత్వం గజగజా వణకడం.. ఎప్పుడైనా చూశామా.? పొద్దున్న సినిమా రిలీజైతే సాయంత్రానికి ఓ మంత్రి మీడియా ముందుకొచ్చి సెటైర్లేశారుగానీ.. అందులో తమ ప్రభుత్వ భయాన్నంతా ఆయన వెల్లగక్కుకున్నారు. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడైనా ఊహించామా.? ‘భీమ్లా నాయక్’ ఇదీ పవర్ తుపాను.
ఆయన సినిమాని మేమెందుకు అడ్డుకుంటాం.? అని ప్రశ్నించేశాడా మంత్రి. ఏ సినిమాని అయినా ఎవరైనా ఎందుకు అడ్డుకోవాలి.? అసలు ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవాలి.? సినిమాపై సెన్సార్ వుంటుంది. సెన్సార్ దాటి వచ్చిందంటే, ఆ సినిమాని అడ్డుకోవడానికి అవకాశమెక్కడుంటుంది.?
Bheemla Nayak Power Storm పవన్ కళ్యాణ్.. వ్యక్తి కాదు, శక్తి.!
ఒక వ్యక్తి ఒక శక్తిలా మారితే, ఆ శక్తిని తట్టుకోలేని అసమర్ధులు, అధికారాన్నిఅడ్డం పెట్టుకొని వెకిలి వేషాలు వేసినంత మాత్రానా తుపాను ప్రభావం తగ్గిపోతుందనుకుంటే పొరపాటు. తుపాను కాస్తా అతి తీవ్ర పెను తుపానుగా మారి అహంకారాన్ని బద్దలుకొట్టేసింది.
సినిమాని సినిమాగా చూస్తే, ఇది అసలు పెద్ద విషయమే కాదు. ఎన్నో సినిమాలొస్తుంటాయ్. పోతుంటాయ్. హిట్టు, ఫ్లాపు సినీ పరిశ్రమలో సర్వసాధారణం. ఫ్లాప్ అనుకున్న సినిమాలు ఒక్కోసారి వసూళ్ల ప్రభంజనం సృష్టించేస్తాయ్. హిట్ అనుకున్న సినిమాలు అనూహ్యంగా దెబ్బ తింటుంటాయ్.
సినిమా అంటే అదో మ్యాజిక్. ప్రతిసారీ వర్కవుట్ అయ్యే మ్యాజిక్ కాదది. ఎప్పుడయితే, రాజకీయం, తన అధికారాన్ని చూపెట్టేందుకు మదమెక్కి తన స్థాయిని తగ్గించుకుని, తన స్థాయిని దిగజార్చుకుని ఓ సినిమాపై పడుతుందో అప్పుడే దాని పతనం పాతాళం కంటే దిగువకు పడిపోయిందని అర్ధం.
పవన్ ఫోకస్ పెడితే.. ఈ నికృష్ట రాజకీయం గతేం కాను.?
ఏడాదికో సినిమా కనా కష్టంగా చేసే పవన్ కళ్యాణ్ విషయంలో ఈ వెకిలితనం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. ‘మనల్ని ఎవ్వడ్రా ఆపేది..’ అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. దమ్ము చూపించారు.
Also Read: కొత్త రాజ్యాంగం రాస్కో బాసూ.! ఇంతకీ, ఏ సిరాతో.!
చేతిలో బోలెడన్ని సినిమాలున్నాయ్. కొంచెం ఫోకస్ పెట్టి మూడు నెలలకోసారి, లేదా ఆరు నెలలకో సినిమా చొప్పున ఇలాగే తీసుకొస్తుంటే, సో కాల్డ్ రాజకీయం ఏమైపోతుంది.?
పాలనా యంత్రాంగం తన పని పక్కన పెట్టి సినిమా ధియేటర్ల వద్ద, సినిమా థియేటర్లలో కాపలా కాయడమే పరమావధిగా పని చేస్తుందా.? ప్రజల కోసం పనిచేయాల్సిన అధికారులు.. థియేటర్లలో చీపుగా ‘కాపు’ కాసే దుస్థితి వచ్చినందుకు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిందేనా.? జస్ట్ ఆస్కింగ్.!