Table of Contents
Bheemla Nayak Review Power Storm: అసలు ‘భీమ్లానాయక్’ సినిమా ప్రమోషన్లలో ‘పవర్ తుపాను’ అన్న మాట ఎందుకు వాడారు.? ‘Power Storm’ అంటూ చేసిన ప్రచారం వెనుక అసలు సీక్రెట్ ఏంటి.?
పవన్ కళ్యాణ్‌ని పవర్ స్టార్.. (Power Star) అని అభిమానులు పిలుచుకుంటుంటారు. అయితే, ఆ పవర్ స్టార్ తీసెయ్యాలంటూ నిర్మాతలకి పవన్ కళ్యాణ్ స్వయంగా సూచించాడు.. దాంతో, టైటిల్స్‌లో జస్ట్ పవన్ కళ్యాణ్ అని మాత్రమే వుంది.
Bheemla Nayak Power Storm.. ఓటీటీలో ఒరిజినల్ చూసేసినాగానీ.!
‘భీమ్లానాయక్’ సినిమా విషయానికొస్తే, ఇది మలయాళ సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియమ్’కి తెలుగు రీమేక్. ఓటీటీ పుణ్యమా అని వివిధ భాషల సినిమాలన్నీ మన ఇంట్లోనే అందబాటులో వుంటున్నాయి. ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కూడా అంతే. చాలామంది ఈ సినిమాని చూసేశారు.
ఎప్పుడైతే తెలుగులోకి దీన్ని రీమేక్ చేస్తున్నారనే ప్రచారం జరిగిందో, ఆ వెంటనే మరింత ఎక్కువగా చూసేశారు.. సో, ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా కథ గురించి మళ్ళీ చెప్పుకోవడం అనవసరం.
ఇద్దరు వ్యక్తులు.. ఒకరిది అహంకారం, ఇంకొకరిది ఆత్మగౌరవం. ఆ ఇద్దరి వ్యక్తుల మధ్య చిన్న వివాదం తలెత్తి, అది కాస్తా ఆధిపత్య పోరుగా మారుతుంది. ఇద్దరిలో ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతే తప్ప, వివాదం సద్దుమణిగే ప్రసక్తే లేదు. మరి, ఎవరో ఒకరు చచ్చిపోవాల్సిందేనా.? అన్నది తెరపై చూడాల్సిందే.

ముందే చెప్పేసుకున్నాం కదా.. చాలామంది చూసేసిన మలయాళ సినిమా అని. తెలుగులో కొత్తదనమేముంటుంది.? అని చాలామంది అనుకోవచ్చుగాక. కానీ, అక్కడున్నది పవన్ కళ్యాణ్. అందుకే, సినిమా చాలా కొత్తగా అనిపిస్తుంది.. స్ట్రెయిట్ సినిమా అన్న భావన కూడా కలుగుతుంది.
రీమేక్స్ పవన్ కళ్యాణ్‌కి కొత్త కాదు.!
పవన్ కళ్యాణ్ తన కెరీర్లో చాలా రీమేక్ సినిమాల్ని చేశారు. అందులో ఇది కూడా ఒకటి. అయితే, ఏ సినిమాని పవన్ రీమేక్ చేయాల్సి వచ్చినా, అందులో తనదైన ప్రత్యేకత వుండేలా చూసుకుంటారు. ‘భీమ్లానాయక్’ సినిమా విషయానికొస్తే, మార్పులు చేర్పుల విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి హేట్సాఫ్ చెప్పాలి.
దర్శకుడు సాగర్ చంద్ర, పవన్ హీరోయిజంని పీక్స్‌లో చూపిస్తే, మలయాళ వెర్షన్లో ‘ఆత్మ’ చెడిపోకుండా, తెలుగు నేటివిటీని అందంగా అద్ది, సినిమాని పవర్ స్టార్మ్‌గా మార్చేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్.
Bheemla Nayak Review Power Storm.. పవర్ డబుల్ డోస్.!
పవన్ కళ్యాణ్ (Power STARm నటించే ఏ సినిమా అయినా, ‘పవర్ డబుల్ డోస్’ అనిపిస్తుంటుంది. దీంట్లో అయితే, ఏకంగా పదింతలని అనుకోవచ్చు. పవన్ ఉగ్ర రూపమే ప్రదర్శించేశారు. పవన్ మాత్రమే కాదు, రానా దగ్గుబాటి అయితే ప్రాణం పెట్టేశాడనడం అతిశయోక్తి కాదు.
నిత్యామీనన్ (Nithya Menen), సంయుక్త మీనన్ (Samyuktha Menon), మురళీ శర్మ, సముద్రఖని.. ఇలా ఒకరేమిటి.? సినిమా కోసం ఎవరికి వారు శక్తివంచన లేకుండా కృషి చేశారని తెరపై ఆయా పాత్రల్ని చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.
కాగా, అటు రానా దగ్గుబాటి (Rana Daggubati) కనిపించినా, ఇటు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కనిపించినా, ఇంకోపక్క.. ఇతరత్రా ముఖ్యపాత్రలు కనిపించినా.. వినిపించేది మాత్రం తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఆ స్థాయిలో సినిమా అంతా తానే అయి తమన్ వ్యవహరించాడు.. నేపథ్య సంగీతం అదరగొట్టేశాడు.
అసలు సిసలు విందు భోజనం.!
సినిమాటోగ్రపీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా, చాలా రిచ్‌గా తెరకెక్కింది. వాట్ నాట్.. ఎడిటింగ్ దగ్గర్నుంచి అన్ని శాఖలూ సంపూర్ణ సమన్వయంతో ఈ సినిమాని చేశాయనడం అతిశయోక్తి కాకపోవచ్చు.
‘అయ్యప్పనుమ్ కోషియమ్’ (Ayyappanum Koshiyum) సినిమా కాస్త స్లో పేస్‌లో నడిస్తే, ‘భీమ్లానాయక్’ పరుగులు పెడుతుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ‘భీమ్లానాయక్’లో పుష్కలంగా వున్నాయ్. ఓవరాల్‌గా చెప్పాలంటే పవన్ అభిమానులకే కాదు, సగటు సినీ ప్రేక్షకుడికి ఇది విందు భోజనం.
Also Read: గోతికాడి నక్కలకి గూబ గుయ్యమంది ‘బాస్’.!
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. సినిమాకి ముగింపు.. ఇవన్నీ ‘భీమ్లానాయక్’ సినిమాని ఒరిజినల్‌గా మార్చేశాయి. ఈ విషయంలో గురూజీ (త్రివిక్రమ్ శ్రీనివాస్)కి హేట్సాఫ్ చెప్పి తీరాల్సిందే.
పనిగట్టుకుని చేసే దుష్ప్రచారం తప్పితే, ‘భీమ్లానాయక్’ (Bheemla Nayak) సినిమాలో వంక పెట్టడానికేమీ లేదు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు, డైలాగుల్ని చూసి.. రాజకీయ కోణంలో ఎవరైనా భుజాలు తడుముకుంటే చేయడానికేమీ లేదు కూడా.!
చివరగా: సినిమా విడుదలైన రోజే రివ్యూ రాసేయొచ్చుగానీ.. కాస్త తీరిగ్గా, ఆ పవర్ తుపానుని ఎంజాయ్ చేస్తూ రాస్తే ఆ కిక్కే వేరప్పా.!
– yeSBee