Bheemla Nayak Vs Betting Broker.. పదవి అంటే తమ్మితే ఊడిపోయే ముక్కులాంటిది. అధికారం ఓ బాధ్యత మాత్రమే. బాధ్యత లేనోడికి అధికారమిస్తే.. సర్వనాశనమే.!
అధికారం అనే అహంకారం నెత్తికెక్కితే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటి వుండదు. మూడేళ్లకే మంత్రి పదవి ఊడిపోయింది. అయినా సెటైర్లు వేయడం ఆపలేదాయన.
ఆయనెవరో కాదు, పదవి అనే ఓ అహంకారాన్ని నెత్తినెత్తుకున్నోడు. ‘నేనిప్పుడు పదవిలో లేను, ప్రాజెక్టుల గురించి నన్నేమీ అడగొద్దు..’ అంటూ ఆ బులుగు వీరుడు మీడియా ముందు గుస్సా అయ్యాడు. ఇదండీ బాధ్యత.
అప్పుడెప్పుడో 2020లోనే ప్రాజెక్టు పూర్తయిపోతుందని పదవి చేతిలో వున్నప్పుడు మీసం మెలేసి, తొడ కూడా కొట్టేసిన ఘనుడీయన.
చెప్పే మాటలకీ, చేసే పనులకీ పొంతన లేనోళ్ళు కూడా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మీద విమర్శలు చేయడమేంటి కామెడీ కాకపోతే.! మాట ఇచ్చి తప్పాక, జనానికి మొహం చూపించడానికి సిగ్గన్నా లేకపోవడమేంటో.!
Bheemla Nayak Vs Betting Broker.. కామెడీకి అయినా ఓ హద్దుండాలి కదా.!
ఇలాంటోళ్ళు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Party Chief Pawan Kalyan) మీద సెటైర్లు వేసేస్తున్నారు. అధినేత గీసిన గీత దాటలేని వాళ్లు, ఇంకో పార్టీ అధినేత మీద సెటైర్లేయడం హాస్యాస్పదమే.
జనసేన పార్టీ… ఎవరితో ఎన్నికల సమయంలో కలుస్తుందన్నది వేరే చర్చ. ఆ కలయిక జరుగుతుందా.? లేదా.? అన్నదానిపై స్పష్టత లేదు.
ఎలాగైనా ఆ రెండింటినీ కలిపేయాలన్న తాపత్రయం మాత్రం సోకాల్డ్ బ్లూ లీడర్స్‌లో బాగా కనిపిస్తోంది.
ఔను మరి, బులుగు పార్టీ అధినేత.. పచ్చ పార్టీకి ఏనాడో దత్తపుత్రుడైపోయాడు. లేకపోతే, పచ్చ పార్టీని పైకి లేపే బాధ్యత బులుగు కార్మికులెందుకు భుజానికెత్తుకుంటారు.?

వీలైతే, రెండు పార్టీల మధ్య బ్రోకరిజం చేయడానికి కూడా సో కాల్డ్ బులుగు గ్యాంగ్ రెడీయేనేమో. తద్వారా వచ్చే కమీషన్ కోసం కక్కుర్తి పడుతున్నట్లున్నారు.
ఏ పార్టీకి ఆ పార్టీ కొన్ని రాజకీయ వ్యూహాలతో ముందుకెళుతుంటుంది. అవి హిట్టవ్వచ్చు. ఫ్లాప్ అవ్వచ్చు.
పాపం.! ఇంతటి అవగాహనా రాహిత్యమా.?
కేంద్రంలో తమకు సంపూర్ణ మెజార్జీ వున్నా సరే, బీజేపీ కొన్ని మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగని ఆ మిత్ర పక్షాలు బీజేపీ దగ్గర బిచ్చమెత్తుకుంటున్నాయని అనగలమా.?
Also Read: తీరం తాకిన Bheemla Nayak తుపాను.. ‘అహంకారం’ కకావికలం.!
రాజకీయ అపరిపక్వత ఇలాగే వుంటుంది. గెలవడం, ఓడిపోవడం రాజకీయాల్లో కామన్. పొత్తులూ, సర్వసాధారణం.
‘భీమ్లా నాయక్’ పవన్ కళ్యాణ్‌ని (Pawan Kalyan), ‘బిచ్చం నాయక్’ అనే ముందు తన మీద వున్న ‘బెట్టింగ్ బ్రోకర్’ (Betting Nayak) అనే మచ్చని ఓ సారి మాజీ మంత్రిగారు చూసుకుంటే మంచిది.