Bhola Shankar Chiranjeevi మే..డే.. అదేనండీ.. కార్మికుల దినోత్సవం.! ప్రపంచ వ్యాప్తంగా ప్రతి యేడాదీ మే 1న కార్మికుల దినోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది.!
ఈ ఏడాది మే 1న మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘భోళా శంకర్’ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ స్టిల్స్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
మెగాస్టార్ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరిది.! చిరంజీవి అంటే, నిఖార్సయిన సినీ కార్మికుడు.! తనను తాను చిరంజీవి అలాగే పరిచయం చేసుకుంటుంటారు.
అందుకేనేమో, కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘భోళా శంకర్’ సినిమా నుంచి చిరంజీవి స్టిల్స్‌ని విడుదల చేశారు.
Bhola Shankar Chiranjeevi ట్యాక్సీ డ్రైవర్..
ఈ సినిమాలో చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సినిమా ‘వేదాళం’కి ఇది తెలుగు రీమేక్.
‘భోళా శంకర్’ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తోంది. కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కనిపించనుంది.

ఇదిలా వుంటే, ‘భోళా శంకర్’ (Bhola Shankar) సినిమా ఆగస్ట్ 11న విడుదల కానుందని చిత్ర నిర్మాణ సంస్థ గతంలోనే ప్రకటించింది.
అయితే, సినిమా విడుదల విషయంలో మల్లగుల్లాలు నడుస్తున్నాయనీ, వాయిదా పడే అవకాశాలున్నాయనీ ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో, సినిమా విడుదల తేదీపై స్పష్టతనిచ్చింది చిత్ర నిర్మాణ సంస్థ. ఆగస్ట్ 11నే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినీ కార్మికుడు.. భోళా శంకరుడు..
‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సక్సెస్‌తో మంచి ఊపు మీదున్న చిరంజీవి (Mega Star Chiranjeevi).. ‘భోళా శంకర్’గా మరో బంపర్ హిట్ అందుకునేలా వున్నాడు.!

సినిమా సంగతుల్ని పక్కన పెడితే, సినీ కార్మికుల కోసం తనవంతు సాయం చేస్తూనే వుంటారు చిరంజీవి. అది సాయం అనడం కంటే, తన బాధ్యత అంటారాయన.
Also Read: ఆర్జీవీ నిజాలు చెబుతాడట.! నవ్వకండెహే.!
కరోనా కష్టకాలంలో సామాజిక బాధ్యతగా ఆక్సిజన్ బ్యాంకుల్ని నెలకొల్పిన చిరంజీవి, సినీ కార్మికుల్ని ఆదుకునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేసిన సంగతి తెలిసిందే.
పరిశ్రమ పెద్ద.. అన్న హోదా కంటే, సగటు సినీ కార్మికుడిగానే తనను తాను అభివర్ణించుకోవడం.. ఈ భోళా శంకరుడి ప్రత్యేకత.!