Bholaa Shankar Anil Sunkara… ఎద్దు ఈనిందిరా.! అని ఎవడో అంటే, ‘అయితే, దూడని కట్టెయ్..’ అన్నాడట వెనకటికి ఒకడు.!
‘భోళా శంకర్’ సినిమా విషయంలో జరుగుతున్న దుష్ప్రచారం కూడా అంతే.! నిర్మాతని హీరో తీవ్రంగా వేధించాడన్నది ఆ దుష్ప్రచారం తాలూకు సారాంశం.
సినిమా రిలీజ్‌కి ముందు, హీరో రెమ్యునరేషన్ సెటిల్ చేయడానికి, నిర్మాత ఆస్తులు తాకట్టు పెట్టాడట.. అయినా, క్లియర్ కాకపోవడంతో.. సినిమా విడుదలయ్యాక.. కొన్ని ఆస్తులు అమ్ముకున్నాడట నిర్మాత.! ఇదీ గాసిప్.
Bholaa Shankar Anil Sunkara.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా..
దీన్ని ఎవడు వండి వడ్డించాడోగానీ.. గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా, సోకాల్డ్ మీడియా సంస్థలన్నీ, దాన్ని ‘కవర్’ చేసేశాయ్.!
కాస్త తీరిగ్గా, ‘భోళా శంకర్’ చిత్ర నిర్మాణ సంస్థ, ‘అవన్నీ రూమర్స్’ అని కొట్టి పారేసింది. మరి, సోకాల్డ్ మీడియా సంస్థలు, చేసిన తప్పుకి లెంపలేసుకోవాలి కదా.!
తెరవెనుకాల కథ ఎవరు నడిపించారోగానీ, నిర్మాత అనిల్ సుంకర (Anil Sunkara) మౌనం.. ఆ దుష్ప్రచారానికి ఆజ్యం పోసినట్లయ్యింది.

తీవ్ర నష్టం వాటిల్లాక, తీరిగ్గా నిర్మాణ సంస్థ, ‘ఖండన ప్రకటన’ విడుదల చేసింది. ఇక్కడ, నిర్మాణ సంస్థకి జరిగిన డ్యామేజీ ఎంత.? అన్నది వేరే చర్చ.
ఔను, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌కి ఆర్థికంగా కలిగిన నష్టం కంటే, మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ఇమేజ్‌కి చాలా చాలా నష్టం వాటిల్లేలా ప్రవర్తించారు కొందరు.
బాధ్యత వుండక్కర్లా.!
‘బ్రో’ సినిమా విషయంలో కూడా ఇలాగే దుష్ప్రచారం చేస్తే, ఆ చిత్ర నిర్మాత మీడియా ముందుకొచ్చి మరీ, దుష్ప్రచారం చేసినవారి చెంపలు పగలగొట్టేలా కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.
Also Read: రేణు దేశాయ్ విషయంలో పవన్ కళ్యాణ్ తప్పెంత.?
నిర్మాణ సంస్థ అంటే, హీరోని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి.! అది ఆయా నిర్మాణ సంస్థల బాధ్యత. బాధ్యత లేని బ్యానర్‌గా ఇప్పుడు ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
‘భోళా శంకర్’ సినిమా విషయంలో జరిగిన కుట్రలో, నిర్మాత అనిల్ సుంకర ‘వాటా’ కూడా వుందనే విమర్శలు ఎందుకు వస్తున్నాయ్.? ఎందుకంటే, స్పందించాల్సిన రీతిలో స్పందించలేదు గనుక.!