Table of Contents
Bholaa Shankar Review.. మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘భోళా శంకర్’ థియేటర్లలోకి వచ్చేసింది. తమిళ సినిమా ‘వేదాలం’కి ఇది తెలుగు రీమేక్.
రీమేక్.. ఎందుకు.? అన్న ప్రశ్నకి చిరంజీవి ఇప్పటికే సమాధానమిచ్చారు. కానీ, రీమేక్ పేరుతో ట్రోలింగ్ అయితే జరుగుతూనే వుంది.
సినిమా విడుదలకు ముందే నెగెటివ్ రివ్యూలు ప్రచారంలోకి వచ్చాయి. రేటింగులు ఎవరూ ‘రెండు’కి మించి ఇవ్వకూడదని ప్రముఖ వెబ్‌సైట్లన్నీ తీర్మానించేసుకున్నాయ్.!
నెగెటివిటీ చిరంజీవికి కొత్త కాదు.! దాదాపు నాలుగు దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ఈ నెగెటివిటీని అధిగమిస్తూనే వున్నారు.
చిరంజీవి చూడని సక్సెస్సులు లేవు.. ఆయన కెరీర్‌లో కొన్ని ఫ్లాపులూ వున్నాయ్. సక్సెస్, ఫెయిల్యూర్‌కి అతీతం.. చిరంజీవి స్టార్‌డమ్.!
అయినాగానీ, చిరంజీవి సినిమాల పనిగట్టుకుని చేసే దుష్ప్రచారం.. ఇంకా ఇంకా పెరుగుతూనే వుంది. ఈసారి అది పదింతలయ్యిందనడం అతిశయోక్తి కాదేమో.!

లేకపోతే, రివ్యూల్లో ఎలా చెత్త నింపాలి.? రేటింగులు ఎంత దారుణంగా వెయ్యాలి.? అని ఆయా వెబ్ సైట్ల నిర్వాహకులు, వాటిల్లో రివ్యూలు రాసేవాళ్ళు.. ముందుగానే, స్పెషల్ మీటింగులు పెట్టుకోవడమేంటి.?
అన్నిటికీ మించి, లక్షలు ఖర్చు చేసి మరీ, సోషల్ మీడియాలో ఫేక్ రివ్యూులు, ఫేక్ ట్వీట్లు ‘భోళా శంకర్’కి చేయిస్తున్నారంటే.. ఈ పైత్యాన్ని ఏమనాలి.?
Also Read: ‘వారాహి’ అంటే పంది కాదు.! దేవతరా.! అచ్చోసిన ఆంబోతూ.!
ఇంత నెగెటివిటీ మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘భోళా శంకర్’ పరిస్థితేంటి.? ఇంతకంటే, నెగెటివిటీని ఎదుర్కొన్న ‘వాల్తేరు వీరయ్య’ని ‘భోళా శంకర్’ అధిగమిస్తాడా.?
Bholaa Shankar Review.. కథేంటంటే..
అన్నా చెల్లెళ్ళ మధ్య అనుబంధం.. ఆపై హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా.. ఈ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘భోళా శంకర్’.!
చెల్లెల్ని ఎలా కాపాడుకున్నాడు.? హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియాని ఎలా అంతం చేశాడు.? అన్నది అసలు కథ.
కథ కొత్తది కాకపోయినా, ‘వేదాళం’ ట్రీట్మెంట్ కాస్త భిన్నంగా వుంటుంది. హీరోయిజం ఎలివేషన్ సీన్స్.. ఆ సినిమాకి ప్లస్ అయ్యాయ్.
మెగాస్టార్ చిరంజీవి.. స్టైలిష్ అండ్ ఈజ్..
మెగాస్టార్ చిరంజీవి యాజ్ యూజువల్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేశారు. ఆయన స్టైలింగ్ అదిరింది. తెరపై చాలా హుషారుగా కనిపించారు.
టైమింగ్ విషయంలో చిరంజీవికి సాటి ఇంకెవరూ లేరంతే.! ఆ స్థాయిలో పలు సన్నివేశాల్లో చిరంజీవి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు.
తమన్నా భాటియా గ్లామర్‌కే పరిమితమైంది. కీర్తి సురేష్‌కి మాత్రం ప్రాధాన్యమున్న పాత్ర దక్కింది. ఆ పాత్రలో కీర్తి కాసిన్ని మెరుపులు మెరిపించింది.
శ్రీముఖి, రష్మి గౌతమ్.. మమ అనిపించారు. వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను.. ఇలా చెప్పుకుంటూ పోతే, బోల్డంతమంది కమెడియన్లు వున్నారు. కొన్ని కామెడీ సీన్లు పండినా.. ఇంకా కామెడీని బాగా పండించి వుంటే బావుండేది.
టెక్నికల్‌గా చూస్తే..
సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఎడిటింగ్ పరంగా కొన్ని లోపాలున్నాయి. మ్యూజిక్ ఓకే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్లేదు. యాక్షన్ సీన్స్ స్టైలిష్‌గా, కంపోజ్డ్‌గా డిజైన్ చేశారు. డైలాగ్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని వుండాల్సింది.
స్క్రీన్ ప్లే విషయంలోనూ కొంచెం తడబడినట్లే అనిపిస్తుంది. నిర్మాణపు విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు. ఖర్చు గట్టిగానే పెట్టారు నిర్మాత.
మెహర్ రమేష్.. ఏంటిలా.?
ఫ్లాపులు కాదు, డిజాస్టర్లే కెరీర్ నిండా నింపేసుకున్న దర్శకుడు మెహర్ రమేష్. చిరంజీవితో సినిమా అంటే, చాలా చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకుని వుండాల్సింది.
కేవలం చిరంజీవి మీదనే ఫోకస్ పెట్టాడు దర్శకుడు. అదే పెద్ద సమస్య. మెగాస్టార్ కామెడీ టైమింగ్‌ని సరిగ్గా వాడుకోలేకపోయాడు.
ఒరిజినల్ సినిమాని మించి, బెటర్‌గా తీసే అవకాశం వున్నా.. రిస్క్ చేయలేకపోయాడు. నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేసినా, వాటి ప్రభావం తక్కువే.
కీర్తి సురేష్ లాంటి మహానటిని ఇంకా బాగా వాడుకుని వుండాల్సింది. తమన్నా విషయంలోనూ మెహర్ రమేష్, లోభించాడు.. ఆమె పాత్రని మెరుగ్గా తీర్చిదిద్దడంలో.
‘ఖుషీ’ సీన్‌ని రీ-క్రియేట్ చేయడం ఓకేగానీ.. ఇంకా చాలా చాలా బాగా తీసే అవకాశం వున్నా, ప్చ్.. ఆ స్థాయిని అందుకోలేకపోయాడు.
ఓటీటీ యుగంలో.. ఒరిజినల్ మూవీస్ అందుబాటులో వున్న దరిమిలా, రీమేక్స్ విషయంలో ఖచ్చితంగా పోలికలు ఇబ్బంది పెడతాయ్. ఆ ఇబ్బందుల్ని ముందే గుర్తించి, ఇంకాస్త జాగ్రత పడితే, బెటర్ రిజల్ట్ వుండేది.
అన్నా చెల్లెళ్ళ మధ్య అనుబంధం వర్కవుట్ అయితే.. దానికి తోడు, తెరపై మెగాస్టార్ చిరంజీవి చూపించిన జోరు, హుషారు.. ఆయన స్టైలిష్ అప్రోచ్.. ఇవన్నీ సినిమాని వేరే లెవల్‌కి తీసుకెళ్తాయ్.!
చివరగా.. లోపాలున్నాయ్.. కానీ, తీసిపారేసేంతలా కాదు.! ‘వాల్తేరు వీరయ్య’కి ఇంతకంటే నెగెటివిటీని చూశాం. ఇప్పుడూ చూస్తున్నాం.!
పొలిటికల్ పైత్యం.. కుల జాడ్యం.. ఇవన్నీ రివ్యూలు, రేటింగుల మీద ముందే కన్నేసిన దరిమిలా.. వాటిని చిరంజీవి సినిమా ఈసారి ఎలా తట్టుకుని నిలబడుతుందో చూడాలి.!