Table of Contents
టాలీవుడ్ మన్మథుడు (Manmadhudu), కింగ్ నాగార్జునకి (King Nagarjuna) వెండితెరపై అద్భుతాలు చేయడమే కాదు, బుల్లితెరపై సంచలనాలు సృష్టించడమూ (Bigg Boss Telugu Season 3) తెలుసు. నటుడిగా, నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్‌గా అక్కినేని నాగార్జున సాధించిన విజయాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే గేమ్ షోని నాగార్జున ఏ స్థాయిలో రక్తి కట్టించారో చూశాం. వెండితెరపై ‘బాస్’గా నాగార్జున నటనని తిలకించేశాం. ఇప్పుడాయన బుల్లితెరపై తాను ‘బిగ్ బాస్’ అంటున్నాడు. బిగ్ బాస్ రియాల్టీ షో మూడో సీజన్ (Bigg Boss Telugu Season 3) కోసం అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ఎంపికయ్యాడన్న వార్త అక్కినేని అభిమానులకు సూపర్బ్ కిక్ ఇస్తోంది.
సగటు సినీ ప్రేక్షకుడూ నాగార్జున ఈ రియాల్టీ షోని ఎలా హోస్ట్ చేస్తాడు.? అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయినా, నాగార్జునకి బుల్లితెర ఏమన్నా కొత్తా.? బిగ్ బాస్ రియాల్టీ షోని ఒంటి చేత్తో నడిపించగల సత్తా ‘కింగ్’ నాగార్జునకి వుందన్నది అక్కినేని అభిమానులు చెబుతున్నమాట.
ఓ వైపు సినిమాలు, ఇంకో వైపు బుల్లితెరపై రియాల్టీ షోని నిర్వహించడం.. ఆషామాషీ వ్యవహారం కాదిది. అయినా, కింగ్ నాగార్జునకి ఇది చాలా తేలికైన పని.. అని అక్కినేని అభిమానులే కాదు, నాగ్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు.
ఫస్ట్ సీజన్‌లో మెరిసిన యంగ్ టైగర్ (Bigg Boss Telugu Season 3)
మొట్టమొదటిసారి బుల్లితెరపై ఓ రియాల్టీ షోని హోస్ట్ చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అదే బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ వన్. అప్పట్లో వీకెండ్ ఎపిసోడ్స్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) తీసుకొచ్చిన ఊపు, ఇప్పటికీ అలాగే కళ్ళ ముందు కదలాడుతోంది.
పార్టిసిపెంట్లలో తానూ ఒకడినన్నట్లు కలిసిపోతూనే, అవసరమైన చోట తనదైన స్టయిల్లో ఛమక్కులతోపాటు, చురుక్కులూ వేయగలిగాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ రియాల్టీ షోకి తనదైన స్టార్‌డమ్‌ని అద్దడమే కాదు, తొలిసారి బుల్లితెరపై కనువిందు చేస్తూనే, అందివచ్చిన అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, బుల్లితెర వీక్షకులకు సొంత మనిషి అయిపోయాడు.
అలా, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటికీ యంగ్ టైగర్ (Young Tiger NTR) మరింత చేరువైపోయాడు. తొలి సీజన్ విజేతగా సినీ నటుడు శివబాలాజీ (Siva Balaji) ఎంపికైన విషయం విదితమే.
చిన్న చిన్న గొడవలు, అపార్ధాలూ ఆ రియాల్టీ షోలోనూ పార్టిసిపెంట్ల మధ్య కన్పించినా, అల్టిమేట్‌గా అదొక ఫన్. షో పూర్తయ్యాక, పార్టిసిపెంట్స్ అంతా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు.
నాని సహనానికి పరీక్ష – రెండో సీజన్
అనూహ్యంగా బిగ్ బాస్ నిర్వాహకులు, నేచురల్ స్టార్ నానిని (Natural Star Nani) రెండో సీజన్ హోస్ట్‌గా ఎంపిక చేసింది. అక్కడినుంచే షోపై చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. యంగ్ టైగర్ స్టార్‌డమ్ ఎక్కడ.? నాని ఎక్కడ.? అనే పోలికలొచ్చాయి.
కానీ, షోని సరదాగా నడపడంలో నాని తనదైన ముద్ర వేయగలిగాడు. అయితే, దురదృష్టవశాత్తూ పార్టిసిపెంట్స్, నాని (Nani) ని సీరియస్‌గా తీసుకోలేదు. పదే పదే నాని వార్నింగ్స్ ఇవ్వడమే తప్ప, వాటిని హౌస్ మేట్స్ పట్టించుకున్న దాఖలాల్లేవు.
పైగా, రెండో సీజన్‌లో కుట్రలు, కుతంత్రాలు ఎక్కువైపోయాయి. ఎవరి ఆట వారు ఆడాల్సింది పోయి, గ్రూపులు కట్టేశారు. కౌశల్ (Kaushal Manda) ఒక్కడూ ఒక వైపు, మిగతా హౌస్‌మేట్స్ అంతా ఇంకో వైపు.. అన్నట్టు నడిచింది సీజన్ టూ. ఈ క్రమంలో నానిపై చాలా విమర్శలొచ్చాయి.
సోషల్ మీడియాలో నాని (Natural Star Nani) ఎదుర్కొన్న ట్రాలింగ్ అంతా ఇంతా కాదు. ఎలాగైతేనేం, చిట్ట చివరికి కౌశల్ మండా విజయం సాధించాడు. హౌస్‌లో తలెత్తిన గొడవలు, అపార్ధాలు.. ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి హౌస్ మేట్స్ మధ్య.
కౌశల్ ఆర్మీ.. ది రియల్ విన్నర్
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, రెండో సీజన్ విన్నర్ ఎవరంటే, ఖచ్చితంగా చెప్పాల్సిన సమాధానం కౌశల్ ఆర్మీ (Kaushal Army). టైటిల్‌ని కౌశల్ సొంతం చేసుకున్నా, అతన్ని వెనకుండి నడిపించింది మాత్రం కౌశల్ ఆర్మీనే (Kaushal Army). అసలు ఆ ఆర్మీ ఎలా ఫామ్ అయ్యిందో ఇప్పటికీ చాలామందికి తెలియదు.
అయితే, అదంతా కౌశల్ ముందస్తుగా వేసుకున్న ప్లాన్ అంటారు కొందరు. అదేమీ కాదు, కౌశల్‌ని మిగతా హౌస్‌మేట్స్ అంతా ఒంటరిని చేసేస్తే, అది తట్టుకోలేక కొందరు గ్రూపుగా ఏర్పడి కౌశల్‌కి మద్దతు పలికడం ప్రారంభించారనీ, అదే ఆ తర్వాత కౌశల్ ఆర్మీగా మారిందనీ అంటారు మరికొందరు.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా.. ఆ మాటకొస్తే, విదేశాల్లోనూ కౌశల్ ఆర్మీ.. ఓ రేంజ్‌లో హల్‌చల్ చేసింది. రక్తదానాలు, ర్యాలీలు.. అబ్బో కౌశల్ ఆర్మీ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు.
ఆ కౌశల్ ఆర్మీ (Kaushal Army) లేకపోయుంటే, కౌశల్ (Kaushal Manda).. బిగ్‌బాస్ సీజన్ 2 (Bigg Boss Telugu Season 2 Winner) విన్నర్ అయి వుండేవాడు కాదేమో.
కింగ్ నాగార్జునకి అసలు సిసలు పరీక్ష (Bigg Boss Telugu Season 3)
హౌస్‌మేట్స్ ఏ క్షణాన ఎలా మారతారో తెలియదు. ప్రతి వీకెండ్‌లోనూ హోస్ట్ కన్పించాలి.. ఆ హోస్ట్‌తో హౌస్‌మేట్స్ తమ సమస్యలు చెప్పుకోవాలి. హౌస్‌మేట్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తూనే, బుల్లితెర వీక్షకుల్ని కట్టిపడేయాలి. అప్పుడప్పుడూ హౌస్‌మేట్స్‌ని ఓదార్చాలి, వార్నింగ్స్ కూడా ఇవ్వాలి.
ఒక్క మాటలో చెప్పాలంటే, కింగ్ నాగార్జున (King Nagarjuna) మీద హోస్ట్‌గా బరువు బాధ్యతలు చాలా ఎక్కువే. రెండో సీజన్ అనుభవాల్ని పరిగణనలోకి తీసుకుంటే, కింగ్ నాగార్జున మూడో సీజన్ హోస్ట్‌గా అగ్ని పరీక్షను ఎదుర్కోనున్నాడని చెప్పడం అతిశయోక్తి కాదేమో.
ఖచ్చితంగా ఈసారి కూడా హౌస్‌మేట్స్ తరఫున చాలా ఆర్మీలు పుట్టుకొస్తాయి. వాటన్నిటినీ ఎదుర్కొనేందుకు అక్కినేని (Akkineni Army) అభిమానులు సర్వసన్నద్ధంగా వుండాలి. నిజానికి ఈసారి జరుగుతున్నది రియాల్టీ షో మాత్రమే కాదు, దీన్నొక యుద్ధంగా పరిగణించొచ్చేమో.
బోల్డన్ని ఆర్మీలు.. దాంతోపాటే తలపడాల్సిన అక్కినేని ఆర్మీ.. వెరసి, బిగ్ బాస్ రియాల్టీ షో మూడో సీజన్ (Bigg Boss Telugu Season 3), మునుపెన్నడూ లేనంత ఉత్కంఠనే కాదు.. వివాదాల్నీ మోసుకురానుందన్నమాట.