బిగ్‌హౌస్‌లో బూతులు (Bigg Boss 3 Boothulu) శృతిమించుతున్నాయా.? ఆ బూతుల్ని కంటెస్టెంట్లు కూడా తట్టుకోలేకపోతున్నారా.? ఇంతలా బూతులతో కంటెస్టెంట్లే రెచ్చిపోతోంటే, మిగతా కంటెస్టెంట్ల పరిస్థితి ఏంటి.? అసలు బిగ్‌బాస్‌కి ఈ బూతులు అర్థమవుతున్నాయా.? లేదా.?
కన్‌ఫెషన్ రూమ్‌లో కంటెస్టెంట్లు, తాము హౌస్‌లో వింటోన్న బూతుల్ని తట్టుకోలేకపోతున్నామని వాపోతున్నా, బిగ్ బాస్, ఆ బూతులపై తగిన చర్యలు తీసుకోవడంలేదెందుకు.? బిగ్‌బాస్ కూడా ఎవరికో భయపడుతున్నాడా.? బూతుల్ని ఆయనా ఎంజాయ్ చేస్తున్నాడా.?
అసలు బూతులు తిట్టిస్తున్నది స్వయానా బిగ్‌బాస్ (Bigg Boss 3 Telugu) కాదు కదా? టీఆర్పీ రేటింగుల కోసమే బిగ్‌హౌస్‌లో బూతుల్ని ఎంకరేజ్ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్న దరిమిలా, హోస్ట్ నాగార్జున ఈ విషయంలో సీరియస్‌గా స్పందించాల్సిన అవసరం ఏర్పడింది.
హౌస్‌లో తమన్నా సింహాద్రి ఆగడాలు హద్దులు దాటేస్తున్నాయి. రవికృష్ణని టార్గెట్ చేసే క్రమంలో ఆమె ‘అతి’ ప్రవర్తన అందర్నీ షాక్‌కి గురిచేసింది. బిగ్‌హౌస్‌లో కంటెస్టెంట్లెవరూ తమన్నా సింహాద్రి తీరుని సమర్థించే పరిస్థితి లేదు.
రవికృష్ణ (Ravi Krishna) మానసిక స్థితి ఒక్కసారి గమనిస్తే, బిగ్‌హౌస్ గోడల్ని బద్దలుగొట్టుకుని బయటకు వచ్చేయాలన్నంత కసిగా ఆయన వున్నాడేమో అన్పిస్తుంటుంది. నిజమే, అంతటి పెయిన్ భరిస్తున్నాడు. ‘నువ్వసలు మగాడివేనా.?’ అని పదే పదే రవికృష్ణను ఎగతాళి (Bigg Boss 3 Boothulu) చేస్తున్న తమన్నా (Tamanna Simhadri), రవికృష్ణ తిండి తింటున్నా కూడా అక్కడ వేధింపులకు దిగుతోంది. నిద్రపోనివ్వడంలేదు.
తమన్నాకి (Tamanna Simhadri) అత్యంత సన్నిహితురాలైన శ్రీముఖి (Sree Mukhi) వారిస్తున్నా వినడంలేదు. శివజ్యోతి మీద సైతం విషం చిమ్మింది తమన్నా. ‘డబ్బు కోసం నటించే జర్నలిస్టు’ అంటూ తమన్నా, తన మీద చేసిన వ్యాఖ్యల్ని శివ జ్యోతి (Siva Jyothy) సీరియస్‌గా తీసుకుంది.
రవికృష్ణ విషయంలో మాట్లాడబోతే, రాహుల్ సిప్లిగంజ్‌ని (Rahul Sipligunj) సైతం తమన్నా తిట్టేసింది. ‘హౌస్‌లో వాతావరణం చెడిపోతోంది.. మీరంటే మాకు గౌరవం వుంది..’ అని రాహుల్ మెట్టు దిగినా, తమన్నా తగ్గలేదు. ‘చావనైనా ఛస్తానుగానీ, నీతో మాట్లాడను’ అని తెగేసి చెప్పేసింది.
వరుణ్ సందేశ్ (Varun Sandesh), వితిక షెరు (Vithika Sheru), అషు రెడ్డి (Ashu Reddy), హిమజ, పునర్నవి భూపాలం.. ఇలా ఎవరు చెప్పినా తమన్నా ససేమిరా అనేసింది. చివరికి కన్‌ఫెషన్ రూమ్‌లో శ్రీముఖి కంటతడి పెట్టాల్సి వచ్చింది. రవికృష్ణ పరిస్థితి మరీ దారుణం. ‘తట్టుకోలేకపోతున్నాం బిగ్‌బాస్..’ (Bigg Boss 3 Boothulu) అంటూ మొరపెట్టుకున్నాడు. అయినా, బిగ్‌బాస్ పట్టించుకున్నట్టు కనిపించలేదు.
రేటింగ్స్ పెంచడానికే ఈ తతంగం జరుగుతుండొచ్చుగానీ, ఈ షోని (Bigg Boss Telugu 3) చూసేవారి మానసిక పరిస్థితిపై ఖచ్చితంగా తీవ్ర ప్రభావమే చూపిస్తాయి బిగ్ హౌస్‌లోని గొడవలు. ఎందుకంటే, ఇది నటన కాదు.. రియల్.. అంటూ స్టేజి మీద పదే పదే హోస్ట్ నాగార్జునతో చెప్పిస్తున్నారు గనుక.
బిగ్‌బాస్‌కి వివాదాలు కొత్త కాదు. కానీ, ఆ బిగ్‌బాస్ కారణంగా నాగ్ ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్నాడు, వివాదాలతో సావాసం చేస్తున్నాడు. ఆయన స్థాయిని ఈ వివాదాలు తగ్గించేస్తున్నాయేమోనన్న ఆందోళన అక్కినేని నాగార్జున (King Akkineni Nagarjuna) అభిమానుల్లో వ్యక్తమవుతోంది.