Bigg Boss Non Stop.. బిగ్ బాస్ రియాల్టీ షో గురించి రకరకాల విమర్శలు ఎప్పటినుంచో వినిపిస్తూనే వుంటాయి. ‘నయా వ్యభిచార కేంద్రాలు’గా ఓ రాజకీయ ప్రముఖుడు ఆరోపిస్తుంటాడు బిగ్ బాస్ గురించిన ప్రస్తావన వస్తే.!
కానీ, బిగ్ బాస్ (Bigg Boss Telugu) అంటే అదొక అద్భుతమని ఆ షో కోసం హోస్ట్‌గా పని చేస్తున్న ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున (King Akkineni Nagarjuna) కావొచ్చు, ఆ రియాల్టీ షో ద్వారా పాపులర్ అయిన సెలబ్రిటీలు కావొచ్చు ‘గొప్పగా’ చెప్పడం చూస్తున్నాం.
ఇదిలా వుంటే, బిగ్ బాస్ రియాల్టీ షో మీద ఓ రాజకీయ ప్రముఖుడు కోర్టును ఆశ్రయించగా, ఉన్నత న్యాయస్థానం, బిగ్ బాస్ రియాల్టీ షో తీరు పట్ల ఆక్షేపణ వ్యక్తం చేసింది ప్రాధమికంగా.
కేసు విచారణ జరుగుతోన్న దరిమిలా, తీర్పు రావడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి, ఇప్పుడే కోర్టు ఏం చెప్పబోతుందన్నదానిపై స్పష్టతకు వచ్చేయలేం.
Bigg Boss Non Stop సమాజానికి హానికరమేనా.?
విదేశాల్లో పాపులర్ అయిన ఈ షో ఇండియాకి చాలా కాలం క్రితమే వచ్చింది. హిందీ సహా పలు భాషల్లో సక్సెస్ అయ్యింది. తెలుగులోనూ ఐదు సీజన్లు ముగిసి, ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ఓటీటీ షో వరకూ వచ్చింది.
వేర్వేరు రంగాలకు చెందిన వ్యక్తులు ఓ ఇంట్లో కొన్నాళ్ళపాటు సకల సౌకర్యాల మధ్య బంధీలుగా వుండడం ఈ షో ప్రత్యేకత. ఆడుకుంటారు.. పాడుకుంటారు.. కొట్లాడుకుంటారు.. చాలా చాలా జరుగుతాయ్.
నాటకీయతతో కూడిన ప్రేమలు, బంధాలు, అనుబంధాలు.. కక్షలు, కార్పణ్యాలూ ఇవన్నీ వుండాల్సిందే. తిట్టుకోవడంలో ఎవరికి వారే మాస్టర్ డిగ్రీలు చేసేసినట్టు కనిపిస్తారు. అలా వారిని బిగ్ బాస్ రకరకాల టాస్కుల ద్వారా ప్రేరేపిస్తుంటాడు.
సినిమాల్లో అలా.. బిగ్ హౌస్‌లో ఇలా.!
సినిమాల్లోనూ చిన్న పిల్లలు చూడలేని కంటెంట్, తేలిగ్గానే సెన్సార్ అయిపోయి వచ్చేస్తోంది గనుక, బిగ్ బాస్ రియాల్టీ షోలో (Bigg Boss Telugu) అసభ్యత గురించి కొత్తగా మాట్లాడుకోడానికేమీ లేదు.
బిగ్ బాస్ (Bigg Boss) రియాల్టీ షో సమాజానికి హానికరమన్న చర్చ ఎప్పటినుంచో జరుగుతోంది. అది నిజమేనని కోర్టు తేల్చితే, ఆ తర్వాత పరిణామాలెలా వుంటాయో.! ఆ కారణంగా బ్యాన్ చేస్తే.. ఏమవుతుందో వేచి చూడాలిక.
తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీయార్ హోస్ట్‌గా తొలి సీజన్ బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ప్రారంభమైంది. రెండో సీజన్‌కి నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించాడు.
ఇక, అక్కడి నుంచి అక్కనేని నాగార్జున హోస్ట్‌గా బిగ్ బాస్ రియాల్టీ షో కొనసాగుతూ వుంది.. మూడు సీజన్లు పూర్తయ్యాయ్. ఇప్పుడు ఓటీటీ వెర్షన్ నడుస్తోంది.
Also Read: పెళ్ళికి ముందు ‘ఆ పని’.! చావుకి స్వాగతం పలికేలా.!
ఒక్కటి మాత్రం నిజం.. బిగ్ బాస్ రియాల్టీ షో తర్వాత చాలామంది స్టార్లుగా మారారు. అనూహ్యమైన స్టార్‌డమ్ కొందరి సొంతమైంది. కొంతమంది పరువు పోగొట్టుకున్నారు.. స్టార్‌డమ్ కోల్పోయారు కూడా.
శివ బాలాజీ, కౌశల్ మండా, రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్, సన్నీ ఇప్పటి వరకు నడిచిన బిగ్ బాస్ తెలుగు ఐదు సీజన్లలో వరుసగా విజేతలైనవారు.