Bigg Boss Telugu 5 ప్రియ ఈ వారం ఎలిమినేట్ అయ్యింది. ఏ వారం ఎవరి వికెట్ పడుతుందో ముందే తెలిసిపోతోంటే.. అసలు ఆట మీద మజానే వుండడంలేదు. పైగా, హౌస్‌లో గ్లామర్ బాగా తగ్గిపోయింది. ఎక్కువగా ఫిమేల్ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతూ వుండడంపై చాలామందిలో వున్నాయి.
అసలు ఇంకా హౌస్‌లో షన్ముఖ్ జస్వంత్ ఎందుకు కొనసాగుతున్నాడు.? అన్నది మిలియన్ డాలర్ల క్వశ్చన్. ప్రియతో పోల్చితే, షన్నూ హౌస్‌లో ‘పీకింది’ ఏమీ లేదు. ఇకపై పీకబోయేదీ లేదు. చేతిలో వాటర్ బాటిల్.. సిరి, జెస్సీతో గ్రూపు కట్టి.. టైమ్‌పాస్ చేయడం మినహా షన్నూ నుంచి ఆశించడానికి ఇకపై కూడా ఏమీ వుండబోదేమో.

Bigg Boss Telugu 5 సిరి తప్ప.. ఆ ఇద్దరూ వేస్ట్.?
షన్నూ గ్రూపులో సిరి మాత్రం స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఆమెకంటూ ఓ గేమ్ స్ట్రేటజీ వుంది. టాస్కులొస్తే యాక్టివ్‌గానే పార్టిసిపేట్ చేస్తోంది. మిగతా ఇద్దరూ.. అంటే, షన్నూతోపాటు జెస్సీ కూడా వేస్ట్. హౌస్‌లో ప్రస్తుతానికి మిగిలింది నలుగురు ఫిమేల్ కంటెస్టెంట్లు మాత్రమే.. అందులో ఒకరు మళ్ళీ ట్రాన్స్‌జెండర్.
వచ్చేవారం ఎవరి వికెట్ పడుతుంది.? ఖచ్చితంగా ఫిమేల్ కంటెస్టెంటుదే కదా.? అన్న వెటకారపు కామెంట్లు సోషల్ మీడియాలో పడుతున్నాయి. లోబోని హౌస్‌లో వుంచి, ప్రియని బయటకు పంపేయడం ద్వారా బిగ్ బాస్ వ్యూయర్స్ సమాజానికి ఏం సంకేతాలు పంపుతున్నట్టు.?
Also Read: పొట్టి డ్రస్సు.. అనసూయ కస్సు బుస్సు
అసలు బిగ్ బాస్ చూడటమే టైమ్ వేస్ట్ వ్యవహారమంటే.. మళ్ళీ దాని మీద విశ్లేషణలు అవసరమా.? అనుకుంటూనే సోషల్ మీడియాలో బిగ్ బాస్ అభిమానులు చేయాల్సిన రచ్చ అంతా చేస్తున్నారు. బిగ్ బాస్ (Bigg Boss Telugu 5) అనే ఆటకి వున్న క్రేజ్ అలాంటిది.. ఆ అడిక్షన్ అంతే.