ఓట్ల పరంగా చూస్తే అబిజీత్ విన్నర్.. అని బిగ్‌బాస్‌కి (Bigg Boss Telugu Grand Finale) సంబంధించి ‘అన్ అఫీషియల్’ పోల్స్ కుండబద్దలుగొట్టేస్తున్నాయి. ప్రస్తుతం ప్రచారంలో వున్న ‘లీక్స్’ని పరిగణనలోకి తీసుకుంటే అబిజీత్, సోహెల్, అరియానా, అఖిల్, హారిక.. ఇలా ఒకటి నుంచి ఐదు వరకు పేర్లు చెబుతున్నారు.
అంటే, ఫస్ట్ ప్లేస్ అబిజీత్‌దీ (Abijeet Duddala), లాస్ట్ ప్లేస్ హారికదీ (Alekhya Harika) అన్న మాట. మరోపక్క, హారిక ఎలిమినేట్ అయిపోయిందనీ, అరియానా కూడా నాలుగో ప్లేస్‌తో ఎలిమినేట్ అయ్యిందనీ అంటున్నారు. ప్రస్తుతం టాప్ 3 పెండింగ్‌లో వున్నాయన్నది సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో వున్న అంశం.
Also Read: బిగ్‌బాస్ విన్నర్ అబిజీత్.. ఇదిగో సాక్ష్యం.!
అదేంటీ, అఖిల్‌కి (Akhil Sarthak) నాలుగో ప్లేస్ ఇచ్చారు, అరియానాకి (Ariyana Glory) రెండో ప్లేస్ ఇచ్చారు కదా.. అంటే, దానికీ సరైన ఆన్సర్ కన్పించడంలేదు లీకు వీరుల నుంచి. ఈ సీజన్ మొత్తం ఇలాగే గందరగోళంగా సాగింది. ఎవరో ఎలిమినేట్ అవ్వాల్సి వుంటే, ఇంకెవర్నో బయటకు పంపారు.
అయితే, ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారనే విషయాన్ని ముందుగానే ‘లీకు’ వీరులు పసిగట్టేశారు. అలా ఇప్పుడు హారిక, అరియానాలపై దాదాపుగా ఓ క్లారిటీ వచ్చేసింది. అదే నిజమవుతుందేమో. ఇదిలా వుంటే, అందరికీ షాకిచ్చేలా అరియానాని విన్నర్ చేస్తారనే అంశమొకటి ప్రచారంలోకి వచ్చింది.
Also Read: బిగ్‌బాస్‌కే గర్వకారణం అబిజీత్: గెలుపంటే ఇదేరా.!
ఈసారి ఎలాగైనా మహిళా విన్నర్‌ని ప్రకటించాలి కాబట్టి.. అన్న కోణంలో ఆ గాసిప్ పాపులర్ అయ్యింది. ఇంతలోనే ‘కథ వేరే వుంది’ అంటూ, సోహెల్ పేరుని హైలైట్ చేస్తున్నారు. ‘సింగరేణి’ కోటాలో సోహెల్‌కి (Syed Sohel Ryan) విన్నర్‌గా ఛాన్సిచ్చారట.
మరి, అఖిల్ సార్థక్ మాటేమిటి.? అంటే, ‘వి లవ్ అఖిల్ సార్థక్’ అంటూ అభిమానులు చేస్తున్న హంగామాతో అతన్నే విన్నర్‌ని చేస్తున్నారనేది మరో కథ. ఏంటో, ఇన్ని కథల మధ్య అసలు విన్నర్ ఎవరన్నదీ ప్రస్తుతానికైతే సస్పెన్సే. ఆ సస్పెన్స్ విడిపోవడానికి ఎంతో సమయం లేదు.
ఆదివారం మేటర్ క్లోజ్ అయిపోతుంది. ముందే చెప్పుకున్నాం కదా.. ఓట్ల పరంగా చూసుకుంటే, అబిజీత్ ఎవరికీ అందనంత ఎత్తులో వున్నాడు.. టాప్ పొజిషన్ అయితే అతనిదే.
రిజర్వేషన్ కోటాలేవన్నా వుంటే మాత్రం.. అబిజీత్‌ని కాదని ఎవరో ఒకరికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 (Bigg Boss Telugu Grand Finale) టైటిల్ కట్టబెట్టేస్తారన్నమాట. అది మహిళా కోటానా.? లేదంటే, పులిహోర కోటానా.? ఇవేవీ కాదు, సింగరేణి కోటానా.? అన్నది తేలాల్సి వుంది.