బిగ్ బాస్ రియాల్టీ షో (Bigg Boss Telugu Season 5 Contestants Bhumika Payal) సీజన్ వన్, సీజన్ టూ, సీజన్ త్రీ, సీజన్ ఫోర్ పూర్తయ్యాయి ఇప్పటికే. తొలి సీజన్ యంగ్ టైగర్ ఎన్టీయార్ హోస్ట్ చేయగా, సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత నాని రెండో సీజన్ బాధ్యతలు తీసుకున్నాడు. మూడు, నాలుగు సీజన్లకు నాగ్ హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
నిజానికి, బిగ్‌బాస్ సూపర్ హిట్ టీవీ రియాల్టీ షో. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. హిందీ, తమిళ బిగ్ బాస్ రియాల్టీ షోలను తీసుకుంటే, వాటిల్లో పాల్గొన్నవారికి విపరీతంగా పాపులారిటీ పెరుగుతోంది. తెలుగులోనూ కొందరు అలాగే అనూహ్యమైన పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అయితే, తెలుగునాట నెగెటివిటీ ఎక్కువైపోతోంది. అదే అసలు సమస్య.

Also Read: Mallika Sherawat: ఛీ పాడు.. ‘అలా’ నన్ను చూడొద్దు.!
ఓ రొమాన్స్.. ఓ హాస్యం.. ఓ ఎమోషన్.. ఏదైనాసరే, అన్నీ డ్రమెటిక్‌గానే కనిపిస్తున్నాయి తెలుగు రియాల్టీ షో ‘బిగ్ బాస్’కి వచ్చేసరికి. ఎవరిది సమస్య.? నిర్వాహకులదా.? కంటెస్టెంట్లదా.? అన్నది వేరే చర్చ. అందుకేనేమో, కాస్త పేరున్న సెలబ్రిటీలు బిగ్ బాస్ పేరు చెబితే ఆమడదూరం పారిపోతున్నారు.
త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక వ్యవహారాలు షురూ అయి వుండాలి. ఫలానా సెలబ్రిటీ ఈసారి కంటెస్టెంట్ అవబోతున్నారట.. అన్న ఊహాగానాలు రాగానే, ఆయా సెలబ్రిటీలు ఆ ఊహాగానాల్ని ఖండించి పారేస్తున్నారు.. ఎవరూ తమను సంప్రదించలేదని చెబుతూనే, సంప్రదించినా వెళ్ళేది లేదని కుండబద్దలుగొట్టేస్తున్నారు.

Also Read: Swara Bhaskar: ఈ ‘స్వరం’ వివాదాస్పదం.!
నటి భూమిక ఇప్పటికే ఈ విషయమై స్పష్టత ఇచ్చేయగా, పాయల్ రాజ్‌పుట్ కూడా బిగ్ బాస్ గాసిప్స్‌ని ఖండించింది. యూ ట్యూబ్ సంచలనం షన్ముఖ్ తదితరులు ఇంకా ఈ గాసిప్స్‌పై స్పందించలేదు.
గత సీజన్ కోసం సరైన కంటెస్టెంట్లు దొరక్క, దొరికినవారితోనే ‘మమ’ అనిపించేవారన్న ఆరోపణలున్నాయి. ఐదో సీజన్ కోసం (Bigg Boss Telugu Season 5 Contestants Bhumika Payal) ఏం చేస్తారో మరి. ఐదో సీజన్ కూడా నాగ్ హోస్టింగ్‌తోనే జరగనుంది.