హౌస్‌లో అగ్గి రాజుకుంది.. కంటెస్టెంట్స్‌లో ముగ్గురు నామినేషన్స్ పర్వంలో రెచ్చిపోయారు. ఒకరు అబిజీత్ కాగా, మరొకరు అఖిల్ సార్థక్. మూడో కంటెస్టెంట్ సోహెల్. ముగ్గురూ (Abijeet Akhil Sohel Bigg Fight) ఎలిమినేషన్ ప్రాసెస్‌కి నామినేట్ అవడం గమనార్హం. సోహెల్‌కి యాంగర్ ఇష్యూస్ వున్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే.
కోపమొస్తే, మెడ నరాలు ఉప్పొంగిపోతున్నాయి. తానేం మాట్లాడుతున్నాడో కూడా తనకే తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు. అఖిల్ కూడా తక్కువేమీ కాదు. అబిజీత్ సంగతి సరే సరి. నామినేషన్ సమయంలో రీజన్స్ చెబుతూ అఖిల్, అబిజీత్.. పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.
సరే, ఎవరి ఇష్టం వారిది. నామినేషన్స్ కాబట్టి.. ఎవరి నోటికొచ్చింది వాళ్ళు వాగేయొచ్చు. అదే జరిగిందిక్కడ. మధ్యలో సోహెల్ దూరాడు. సీన్ మారిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఎపిసోడ్ అంతా పరమ దరిద్రంగా మారిపోయింది. ఇదేం గోల.? ఎవరు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి.
మధ్యలోకి మోనాల్‌ని లాగుతారు.. దివిని లాగుతారు.. ఇంకెవరి పేర్లనో ప్రస్తావిస్తారు. ఈ గందరగోళాన్ని అబిజీత్ జాగ్రత్తగా క్యాష్ చేసుకుంటే, అఖిల్‌తోపాటు సోహెల్ కూడా బకరా అయిపోయాడు. అఖిల్ అడ్డగోలు ఆగ్రహం కూడా, సోహెల్ ఓవరాక్షన్ ముందు డైల్యూట్ అయిపోవడం గమనార్హం.
‘బస్తీ మే సవాల్’ అనుకున్నారు ముగ్గురూ. ‘ఏమో, కొట్టేసుకుంటారేమో..’ అన్నంతదాకా వెళ్ళింది పరిస్థితి. ఈ నస భరించలేక, ‘మీకు మీకు ఏమన్నా ఇష్యూస్ వుంటే మాట్లాడుకోండి.. నా పేరు లాగొద్దు..’ అంటూ మోనాల్ గజ్జర్ చివర్లో అరిచేస్తూ చిరాకు పడుతూ ఏడిచేసింది. ‘హౌస్‌లో అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు’ అనే విమర్శ హోస్ట్ నాగార్జున నుంచి రావడంతో అందరూ రెచ్చిపోయినట్టున్నారు.
ఆఖరికి అవినాష్ కూడా ఓపెన్ అయిపోయాడు. ఏం లాభం.? అంతా డ్రమెటిక్‌గానే అనిపించింది. ‘నువ్వు అలా అరువ్.. నువ్వు ఇలా మాట్లాడు..’ అని ఎవరో స్క్రిప్ట్ పంపినట్లే (Abijeet Akhil Sohel Bigg Fight) నామినేషన్స్ సందర్భంగా చాలామంది వ్యవహరించినట్లున్నారనే అభిప్రాయం బిగ్‌బాస్ వ్యూయర్స్‌లో నెలకొంది.