BiggBoss Telugu Season Seven.. బుల్లితెర క్రేజీ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 స్టార్ట్ కానుంది. ఈ సందర్భంగా స్టార్ మా యాజమాన్యం ప్రోమోల మీద ప్రోమోలు రిలీజ్ చేస్తూ వస్తోంది.
అసలే బిగ్‌బాస్ షోపై అంతగా సదభిప్రాయం లేదు ఆడియన్స్‌లో. షోపై క్యూరియాసిటీ వున్నప్పటికీ, ఆడియన్స్ క్యూరియాసిటీని క్యాచ్ చేసేలా షో నిర్వహణ జరగడం లేదు గత కొన్ని సీజన్ల నుంచి.
దాంతో రాబోయే కొత్త సీజన్‌పై అస్సలు ఆసక్తే లేదు ఆడియన్స్‌లో. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ సీజన్ 7 వచ్చేస్తోందహో.! అంటూ రిలీజ్ చేసిన ప్రోమో ఏ స్థాయిలో వుండాలి.
BiggBoss Telugu Season Seven.. హోస్ట్‌ని మార్చండయ్యా బాబూ.!
అస్సలు బాగోలేదు. చెత్త ప్రోమో.. అంటూ విమర్శలు మొదలయ్యాయ్. ఇదిలా వుంటే, హోస్ట్ నాగార్జునని మార్చండయ్యా బాబూ.. అంటూ గత సీజన్ల నుంచే గగ్గోలు పెడుతున్నారు ఆడియన్స్.
కానీ, ఈ సీజన్ కూడా నాగార్జు (Nagarjuna) నే హోస్ట్ అంటూ ప్రోమోస్ ద్వారా కన్ఫామ్ చేసినట్లయ్యింది. దాంతో మరీ ఢీలా పడిపోయారు బిగ్‌బాస్ లవర్స్.

ఇదిలా వుంటే, ‘కుడి ఎడమయితే పొరపాటు లేదోయ్..’ అంటూ ఓ క్యాప్షన్ ఇచ్చారు నాగార్జున (Nagarjuna) ఓ ప్రోమోలో. దీనర్ధం ఏంటబ్బా.! అని జుట్టు పీక్కుంటున్నారు జనం.
ఇంకో ప్రోమోలో.. ఉల్టా.. పుల్టా అంటున్నాడు అక్కినేని నాగార్జున.! ఏంటో ఈ గోల.? తప్పదు.. పబ్లిసిటీ చేసుకోవాలి కదా.! చేసుకుంటారంతే.!
ఇదెక్కడి వైరాగ్యమయ్యా బిగ్‌బాసూ.!
‘కుడి ఎడమైతే..’ అంటే దానికి అసలు సిసలు అర్ధంగా ‘వైరాగ్యం’ అని చెప్పుకోవచ్చేమో. అంటే ఏంటీ.? ఈ సారి బిగ్‌బాస్ చూస్తే వచ్చేది వైరాగ్యమా.? ఉల్టా పుల్టా పరిస్థితీ అంతే.!
మీరూ.. మీ క్రియేటివిటీ మండిపోనూ.! ఎవరికిరా వైరాగ్యం.? చూసే వాళ్లకా.? నిర్వాహకులకా.? లేక కంటెస్టెంట్లకా.? అని వీక్షకుల విస్తుపోతున్నారు.
Also Read: క్రికెటర్ కొంప ముంచేసిన యాంకర్ వర్షిణి.!
అర్ధం పర్ధం లేని ఈ చెత్త ప్రోమోతో బిగ్‌బాస్ మీద ఇప్పుడే ఇంత వైరాగ్యం వచ్చేస్తే, ఇక షో స్టార్టయ్యాకా ఏంటీ పరిస్థితి.?
ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. అలాంటిది ఇప్పటికే జీరో క్రేజ్‌లో వున్న బిగ్‌బాస్ షోకి కాస్త మసాలా, ఎంటర్టైన్మెంట్ దట్టించేలా ప్రోమోస్ వుండాలి కానీ.. ఏంటిది బిగ్‌బాస్.! ఇదీ నెటిజన్ల అభిప్రాయం.