క్షణక్షణం ఉత్కంఠ రేపేలా షో (Bigg Boss 3 Telugu) నడవాలంటే, ‘మసాలా’ వుండాలి. బిగ్ బాస్ (Bigg Boss Telugu 3) అంటేనే సూపర్బ్‌గా మసాలా దట్టించి, ఆడియన్స్‌ని ఉర్రూతలూగించే షో. ఒక్క మాటలో చెప్పాంటే, హౌస్ మేట్స్ (Varun Sandesh Vithika Sheru) మధ్య చిచ్చుపెట్టి.. బిగ్ బాస్ గేమ్‌ని రక్తి కట్టిస్తుంటాడు.. అది చూసి, ఆడియన్స్ వెర్రెత్తిపోవాలి. 24 గంటలు.. 60కి పైగా కెమెరాలు.. 15 మంది హౌస్ మేట్స్.. ఈ లెక్కన, ఫుటేజ్ ఏ స్థాయిలో వుండాలి.?
కానీ, మనకి కన్పించేది గంట సమయం తాలూకు ఫుటేజీ మాత్రమే. అందులో మళ్ళీ అడ్వర్‌టైజ్‌మెంట్లు.. అసలు హౌస్‌లో ఏం జరుగుతుందో పూర్తిగా మనకి తెలియదు. మనం చూసినదాన్ని బట్టి ఓట్లు వేసేస్తుంటాం. మహేష్ విట్టా (Mahesh Vitta), వితికా షెరుని (Vithika Sheru) ‘పో’ అన్నాడంటూ, వరుణ్ సందేశ్ (Varun Sandesh) ఎంత యాగీ చేశాడో చూశాం. హేమ చుట్టూ జరిగిన రచ్చ సంగతి సరే సరి.
బ్యాలెన్స్‌డ్‌గా వుండే శ్రీముఖినీ( Sree Mukhi) వివాదాల్లోకి లాగేశారు. పునర్నవి సైతం యాంగర్‌ని ప్రదర్శించింది. హిమజ (Himaja), అషు రెడ్డి (Ashu Reddy) కూడా తమని తాము కంట్రోల్ చేసుకోలేకపోయారు కొన్ని సన్నివేశాల్లో ఏడుపులు, పెడబొబ్బలు.. కుట్రలు, కుతంత్రాలు.. అబ్బో, బిగ్ హౌస్‌లో చాలానే వున్నాయి. అన్నీ ఒక ఎత్తు.. వితికా షెరు – వరుణ్ సందేశ్‌ల (Vithika Varun) మధ్య రొమాన్స్ ఇంకో ఎత్తు.
‘ఆ ఇద్దరికీ ప్రైవసీ ఇచ్చేద్దామన్న ఉద్దేశ్యంతో..’ అంటూ బిగ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన హేమ, వరుణ్ – వితికల (Varun Vithika) జంట గురించి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. అందరిలానే వరుణ్, వితిక కూడా కంటెస్టెంట్స్ మాత్రమే. బంధాలు, అనుబంధాలకు తావే లేదని హౌస్ మేట్స్‌తో ఒకటికి పదిసార్లు చెప్పించేస్తుంటారు.
వాస్తవానికి ఈ వారమే వితికా షెరుని (Vithika Sheru) బయటకు పంపేస్తారని అంతా అనుకున్నారు. కానీ, ఆమె సేఫ్ జోన్‌లోకి వెళ్ళిపోయింది. ఓ రెండు మూడు వారాలపాటు అటు వరుణ్ సందేశ్‌గానీ, ఇటు వితికా షెరుగానీ బిగ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశమే లేదన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ రిపోర్ట్.
అయితే, ఖచ్చితంగా ఈ ఇద్దరూ బిగ్ హౌస్ సాక్షిగా విడిపోబోతున్నారట. దానర్థం, వీరి వైవాహిక బంధానికి (Varun Sandesh Vithika Sheru) ఏదో ముప్పు వస్తుందని కాదు. హౌస్ నుంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని. వితికా షెరు.. ఆ కాన్సెప్ట్‌తోనే బిగ్‌హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిందని ఓ గాసిప్ గట్టిగా విన్పిస్తోంది. ఏమో, ఈ గాసిప్స్‌ని ఎంతవరకు నమ్మగలమో చెప్పలేం.
కానీ, తమన్నా సింహాద్రి (Tamanna Simhadri) ఎంట్రీ విషయంలో గాసిప్స్ నిజమయ్యాయి కాబట్టి, వితిక విషయంలోనూ అలాంటి గాసిప్స్ నిజమవుతాయేమో. అదే జరిగితే, బిగ్ హౌస్‌లో ‘రొమాన్స్’ ఒక్కసారిగా జీరో అయిపోతుంది. ఫైనల్‌లో వరుణ్, వితిక.. టైటిల్ కోసం ఫైట్ చేస్తే ఎలా వుంటుంది.? దీనికి వరుణ్ ఆల్రెడీ సమాధానమిచ్చేశాడు.. తాను రాజీ పడతానని. వితిక మాత్రం, టైటిల్ కోసం ఫైట్ చేసి తీరతానని చెప్పిన విషయం విదితమే.
బిగ్ హౌస్‌లో ఏ క్షణం ఎలాగైనా మారిపోవచ్చు. కానీ, హేమ మీద వేసినట్లుగా ‘బ్యాడ్’ స్టాంప్ వేయించుకుని బయటకొచ్చేందుకు వితిక కావొచ్చు, వరుణ్ కావొచ్చు.. (Vithika Varun) సుముఖత వ్యక్తం చేస్తారా.? హేమ మీద ఆల్రెడీ ఆ బ్యాడ్ ఇమేజ్ పడిపోయింది. మిగతా హౌస్‌మేట్స్ ఎవరికీ ఆ దుస్థితి రాకూడదు. తక్కువ ఓట్లు రావడం వేరు.. బ్యాడ్ స్టాంప్‌తో అవమానానికి గురవడం వేరు.