Table of Contents
Srisailam Temple and Dam Trip.. బిట్టుగాడికి (Bittoos Travel Muchatlu Srisailam Trip) 10 ఇయర్స్.. వాడి పొట్ట నిండా డౌట్సే.. తెలుసా.? తిండి చాలా తక్కువ తింటాడు. కానీ మన బుర్ర మాత్రం చాలా ఎక్కువ తింటాడండోయ్. పొట్టలో డౌట్స్ ఎక్కువన్నాం కదా. వాటి కోసం చాలా వైడ్‌గా థింక్ చేస్తుంటాడు వాడు. ఒక్కోసారి బిట్టు అడిగే డౌట్స్‌కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందంతే.
అయితే మనోడి డౌట్స్‌కీ, ఏదో తెలుసుకోవాలనే ఆశక్తికి తగ్గట్లుగానే బిట్టు ఫాదర్ కూడా వాడిని మస్త్ ఎంకరేజ్ చేస్తుంటాడు. వీకెండ్స్‌లో కారులో షికారంటే మనోడికి ఎంతో ఇష్టం. అలా వాడికి శ్రీశైలం గురించి తెలిసింది. శ్రీశైలంలో లార్డ్ శివ కొలువుదీరాడని మాత్రమే కాదండోయ్.
శ్రైశైలంలో రోప్ వే, బోటింగ్, డ్యామ్, మ్యూజియం ఇంకా చాలా ఉన్నాయట.. అని ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే వాడి చెవిలో పడింది. అవన్నీ చూద్దాం డాడీ అని శ్రీశైలం తీసుకెళ్లమని మారాం చేశాడు.
అయితే వాడి పేరెంట్స్ శ్రీశైలం అంటే అవి మాత్రమే కాదు నాన్నా.. శ్రీశైలం గొప్ప శైవ క్షేత్రం. 18 శక్తిపీఠాల్లో ఒకటి. పరమశివుడు భ్రమరాంబికా దేవితో కొలువుదీరిన ప్లేస్ అని శ్రీశైల మహాక్షేత్రం గొప్పతనాన్ని వివరిస్తూ, మోస్ట్ పవర్‌ఫుల్ ప్లేస్ అని వాడికి చెప్పి, వాడు కోరుకున్నట్లే ఒక వీకెండ్ శ్రీశైలం టూర్ ప్లాన్ చేశారు. ఆ టూర్ ముచ్చట్లను బిట్టు గాడి ముద్దు ముద్దు మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
ఆహా కొండచిలువలాంటి ఘాటు రోడ్డు.! Bittoos Travel Muchatlu Srisailam Trip
శ్రీశైలం ఘాటు రోడ్డులోకి ఎంటర్ కాగానే ఆ థ్రిల్ ఆహా అనిపించింది. నల్లమల ఫారెస్ట్ మధ్యలో పైతాన్‌లా ఉన్న రోడ్డు. రోడ్డు మీద స్లోగా వెళ్తున్న మా కారు.. అక్కడక్కడా ఫారెస్ట్‌లో జంతువులేమైనా కనిపిస్తాయేయోనని రోడ్డుకిరువైపులా ఆశక్తిగా అటూ ఇటూ వెతికి చూశాను.
అయితే నెమళ్లు, జింకలు మాత్రమే కనిపించాయి నాకు. వెళుతుంటే దారిలో పెద్ద పెద్ద పాముల పుట్టలు కనిపించాయి. అవి పాములు తయారుచేసుకునే పుట్టలు కావు, చీమలు, చెద పురుగులు పుట్టలు అనీ, వాటిల్లో ఆ తర్వాత పాములు చేరతాయనీ డాడీ చెబితే ఆశ్చర్యపోయాను. అంత పెద్ద పుట్టల్ని చీమలు ఎలా కట్టుకున్నాయా..” అని.
ఆమ్రాబాద్ టైగర్ సఫారీ జోన్..!
అలా ముందుకు వెళ్తుంటే దారిలో ఆమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ కనిపించింది. రోడ్డు పక్కనే ఓ పెద్ద పులి బొమ్మ ఉంది. నిజమైన పులేనేమో అని భయపడ్డా. కానీ అది బొమ్మ. అక్కడ మా డాడీ నాకు ఫోటో కూడా తీశారు తెలుసా.. భలే థ్రిల్‌గా ఉందది. లోపలికి వెళితే వ్యూ పాయింట్ ఉంది.
ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక వాహనంలో అక్కడికి తీసుకెళ్లారు. నాకు ఒకటి, రెండు పులులు మాత్రమే కనిపించాయి. కానీ లైవ్‌గా పులిని చూసిన ఫీల్ భలేగుందిలే..
శ్రీశైలం డ్యామ్. అండ్ బోటింగ్.! Bittoos Travel Muchatlu Srisailam Trip
శ్రీశైలం టూర్‌లో నాకు బాగా నచ్చింది డ్యామ్. నేను వెళ్లినప్పుడు డ్యామ్ గేట్లు మూసేసి వున్నాయి. ఈ డ్యామ్‌లో వాటర్‌ని స్టోర్ చేస్తారని డాడీ చెప్పారు. డ్యామ్ కింద వైపు వాటర్ తక్కువగా ఉంది. అక్కడే నాకు ఇష్టమైన బోటింగ్ ఉంది.
బోటింగ్ అంటే హైద్రాబాద్ పార్కుల్లో బోటింగ్‌లా లేదు తెలుసా.? ఇక్కడి బోట్స్ రౌండ్ రౌండ్‌గా ఉన్నాయి. అది బోట్ కాదు, ‘పుట్టె’. ఆ పుట్టెలో ఎక్కేందుకు మొదట్లో భయమేసింది. తర్వాత సరదాగా ఉంది. ఆ పుట్టెలో ఒక తాత మమ్మల్ని డ్యామ్‌కి కాస్త దగ్గర వరకూ తీసుకెళ్లాడు.
కానీ పుట్టెలో వెళ్ళడం వెరీ వెరీ డేంజరస్ అంట. నీళ్ళు పెద్దగా లేకపోవడంతో మాత్రమే ఆ రిస్క్ తీసుకుని వెళ్ళాం. అలా వెళ్లడం అన్ని సందర్భాల్లోనూ సేఫ్ కాదట. నేనైతే సూపర్‌గా ఎంజాయ్ చేశాను ఈ బోటింగ్‌ని.
రోప్ వే..
శ్రీశైలం టూర్ లో నాకు అన్నింటికన్నా బాగా నచ్చింది రోప్ వే. శ్రీశైలం (Bittoos Travel Muchatlu Srisailam Trip) దేవస్థానానికి దగ్గరలోనే వుంటుందది. ఆ రోప్ వేలో పై నుండి కిందకు వెళ్లి, మళ్లీ పైకొస్తుంటే ఎంత బాగుందో తెలుసా.! రోప్‌లో ఒకసారి ట్రావెల్ చేశాక, మళ్లీ మళ్లీ ఆ థ్రిల్‌ని ఎంజాయ్ చేయాలనిపించింది. మధ్యలో అంత వెయిట్‌ని ఆ రోప్ ఎలా మోస్తుందబ్బా.! అని డౌట్ వచ్చింది. పెద్ద పెద్ద ఇనుప చైన్స్‌తో దాన్ని తయారు చేశారు మరి.
రోప్ వే ద్వారా పై నుంచి కిందికి దిగాక, అక్కడ మళ్ళీ బోటింగ్. ఇది అధికారిక బోటింగ్. జలాశయంలో బోటు షికారు భలే సరదాగా వుంది మరి. డ్యామ్ కి దగ్గరగానే వెళ్ళి వచ్చాం బోటులో. ఇంత పెద్ద డ్యామ్ కట్టడానికి ఎంత కష్టపడ్డారోనని అనిపించింది. దీన్ని ఇంజనీరింగ్ అద్భుతమని మా డాడీ నాకు చెప్పారు.
సాక్షి గణపతి టెంపుల్..
ఇక శ్రీశైలం లార్డ్ శివ టెంపుల్ దగ్గరికి వచ్చేస్తే దారిలో ‘సాక్షి గణపతి’ ఆలయం ముందుగా మనకు వెల్‌కమ్ చెబుతుంది. ‘సాక్షి గణపతి’ అంటే ఏంటని అడిగాను. అంటే నేను శ్రీశైలం వచ్చానని ఫస్ట్ గణపతికి చెప్పాలట. అప్పుడు లార్డ్ శివాకి మనమొచ్చామని గణపతి చెబుతాడట. లార్డ్ శివకి సన్ గణపతి కదా.. అందుకని హా.! గణపతిని దర్శించుకున్నాం.
మల్లెల తీర్ధం..
దారిలో మల్లెల తీర్ధం ఉంది. కిందకు దిగాలి. చాలా మెట్లున్నాయి. ఫాస్ట్ ఫాస్ట్‌గా దిగేశాం. కింద కొండల మధ్య నుండి ఎక్కడి నుండో వాటర్ ధారలా వస్తోంది. ఆ వాటర్‌కి చాలా పవర్స్ ఉంటాయట. మెడిసనల్ వాటర్ అని డాడీ చెప్పారు.
అక్క మహాదేవి కేవ్స్..
అన్నట్లు చెప్పడం మర్చిపోయా. రోప్ వే దగ్గరే అక్కమహాదేవి కేవ్స్ అని బోర్డ్ చూశాను. ప్చ్..కానీ ఇప్పుడు ఆ కేవ్స్‌లోకి ఎంట్రీ లేదట. కొంచెం డిజప్పాయింట్ అయ్యాను. కానీ లార్డ్ శివ దర్శనం చేసుకుని హైద్రాబాద్ రిటర్న్ అయ్యాక దారిలో ట్రైబల్ మ్యూజియానికి తీసుకెళ్లారు మా డాడీ.
అక్కడ ఒక పెద్ద శివలింగం ఉంది. ట్రైబల్స్ బొమ్మలున్నాయి. సడెన్‌గా ఆ బొమ్మల్ని చూసి మనుషులే అనుకున్నా.. . ట్రైబల్స్ లైఫ్ స్టైల్‌కి సంబంధించి చాలా విషయాలు ఈ మ్యూజియంలో తెలుసుకున్నాను. తర్వాత అక్కడి పార్కులో కాస్సేపు ఆడుకుని, ఇంటికి తిరుగు ప్రయాణం మొదలు పెట్టాం. అలా శ్రీశైలం టూర్‌ని స్టార్టింగ్ నుండీ ఎండింగ్ వరకూ నేను బాగా ఎంజాయ్ చేశాను.
ఫ్రెండ్స్ మీరు కూడా ఒక్కసారైనా శ్రీశైలం వెళ్లండి. నాలాగే ఎంజాయ్ చేయండి. ఘాటురోడ్డు, డ్యామ్, పెద్ద శివలింగం, ట్రైబల్ మ్యూజియం, రోప్‌వే, బోటింగ్ అన్నీ మంచిగా ఎంజాయ్ చేసేయ్యండి. ఓకేనా. టాటా బైబై..!