Blue Media Against Janasena.. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి, పోలీస్ అధికారులపై దౌర్జన్యం చేస్తే, దాన్ని ‘క్రైమ్’ అంటారు తప్ప, అదేదో ‘మగతనం’ అనుకుంటే, మూర్ఖత్వం.!
క్రిమినల్స్ మాత్రమే, దాన్ని ‘మగతనం’ అని చెప్పుకుంటారు. దాన్ని పాత్రికేయం ముసుగులో ఎవరైనా ‘మగతనం’గా అభివర్ణిస్తే, రాసింది జర్నలిస్ట్ కాదు, క్రిమినల్.. అని అనుకోవాల్సి వస్తుంది.
సభ్య సమాజానికి ఈ క్రిమినల్ మీడియా ఏం సందేశం ఇస్తోంది.? రాజకీయ పార్టీల కార్యకర్తలు క్రిమినల్స్‌లా మారాలని ఈ మాఫియా కోరుకుంటోందా.?
జనసేన శ్రేణులకు మాజీ మంత్రి పేర్ని నాని నచ్చుతున్నాడట. దానిక్కారణం, పోలీస్ స్టేషన్‌లో పోలీసుల మీద పేర్ని నాని దౌర్జన్యం చేయడమేనట.!
Blue Media Against Janasena.. పాత్రికేయం.. నేరపూరితం.!
దీన్ని జర్నలిజం అనగలమా.? నేరపూరిత పాత్రికేయం అనాలా.? పేర్ని నాని చేసిన పనికి, ఆయన మీద కేసులు నమోదయ్యాయి.. అది వేరే చర్చ.
అసలు, జనసేన శ్రేణులకు పేర్ని నాని ఎలా నచ్చుతాడు.? ఎందుకు నచ్చుతాడు.? నిత్యం, జనసేన మీద పేర్ని నాని విషం చిమ్ముతుంటాడు.
సరే, రాజకీయాల్లో ప్రత్యర్థులుంటారు.. ప్రత్యర్థి పార్టీ మీద రాజకీయ విషం చిమ్మడం మామూలే కాబట్టి, పేర్ని నాని అలా ఏదో వాగుతుంటాడని అనుకోవచ్చు.
ఏదన్నా మంచి పని పేర్ని నాని చేస్తే, జన సేన శ్రేణులకు నచ్చే అవకాశముంటుందేమో. పేర్ని నాని మీద రేషన్ బియ్యం వ్యవహారానికి సంబంధించి కూడా ఆరోపణలు వున్నాయ్.
నేర చరిత్రకి హీరోయిజం ఆపాదించడమేనా పాత్రికేయం.?
ఆ కేసుల్లో పేర్ని నాని సహా, ఆయన కుటుంబ సభ్యులు ఇరుక్కోవడం తెలిసిన విషయాలే. అలాంటప్పుడు, జనసేన శ్రేణులకు పేర్ని నాని నచ్చే అవకాశమే వుండదు కదా.!
అధినాయకుడి విస్మరణకు గురవుతున్న జనసేన శ్రేణులంటూ ఓ వెకిలి ప్రస్తావన తీసుకొచ్చింది వైసీపీ ‘కుల’ మీడియా.! వైసీపీ అభద్రతా భావానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?
పార్టీ నాయకుల్ని, పార్టీ కార్యకర్తల్నీ వదిలేసి.. పొరుగు రాష్ట్రంలో వుంటున్నదెవరు.?
పోనీ, ఏపీలో చక్కబెట్టలేని వ్యవహారాలు, బెంగళూరులో చక్కబెడుతూ, పార్టీకి ఆర్థిక అండదండలు బెంగళూరు నుంచి జగన్ ఏమైనా అందిస్తున్నారా.? అంటే, అదీ లేదాయె.!
Also Read: స్నేక్ బ్యూటీ.! టచ్ చేస్తే, కాటేస్తది జాగ్రత్త.!
రాజకీయాల్లోకి రాక ముందు నుంచీ, మెగా కాంపౌండ్ మీద ఓ వర్గం ఏడుపు చూస్తూనే వున్నాం. దానిక్కారణం కుల జాడ్యం.! జనసేన మీద ఇప్పుడు నీలి మీడియా ఏడుపు కూడా ఆ కులజాడ్యంతోనే.!
లేకపోతే, మీడియా ముసుగులో కుల మాఫియా వెకిలి రాతల్ని ఏమనాలి.? వీటితో, వైసీపీ అధినేత మెప్పుని ఆ కుల మాఫియా పొందగలుగుతుందా.?
2024 ఎన్నికలకు ఇంతకంటే, దారుణమైన కుట్రలకు తెరలేపింది నీలి కూలి మీడియా.! కానీ, ఆ కుట్రల్ని జనసేనాని సమర్థవంతంగా తిప్పి కొట్టారు.!
నీలి కూలి మీడియాని నమ్ముకుని, వైఎస్ జగన్ అదఃపాతాళానికి పడిపోయారు. ఇప్పటికైనా, ఆ నీలి కూలి మాఫియా కబంధ హస్తాల నుంచి జగన్ బయటపడితే మంచిది.
