BOSS Chiranjeevi MEGA SWAG.. చిరంజీవి అంటే సినిమా.. సినిమా అంటే చిరంజీవి.! చిరంజీవి అంటే డాన్స్.. డాన్స్ అంటే చిరంజీవి.!
అంతేనా.? స్వాగ్ అంటే చిరంజీవి, చిరంజీవి అంటే స్వాగ్.! వాట్ నాట్.. చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.! బాక్సాఫీస్ బద్దలాసుపోయింది మెగా స్వాగ్ దెబ్బకి.!
‘మన శంకర వర ప్రసాద్ గారు’ అంటూ, మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెండితెరపై సందడి చేశారు.
‘మీసాల పిల్ల’ ఆడియో సింగిల్ దగ్గర్నుంచి మొదలైన మెగా హవా.. సినిమా రిలీజ్ అయ్యేవరకూ అంతకు మించి పెరుగుతూ వచ్చింది.
థియేటర్లలో బొమ్మ పడ్డాక, వయసుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా ముసలీ ముతకా.. అందరూ, ‘హుక్ స్టెప్’కి డాన్సులేయడం, మెగా స్వాగ్ రేంజ్ ఏంటో చెప్పకనే చెప్పింది.
ఓవర్సీస్‌లో ప్రీమియర్స్‌తోనే మిలియన్ డాలర్స్ కొల్లగొట్టేసింది ‘మన శంకర వర ప్రసాద్ గారు’.! తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ కూడా ఓ రేంజ్‌లో అదరగొట్టేశాయ్.
యునానిమస్ పాజిటివ్ టాక్ నేపథ్యంలో, ఎర్లీ మార్నింగ్ షోస్‌కి థియేటర్లు జన సంద్రాన్ని తలపిస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో.
మూడున్నర ఆ పైన పడాల్సిన రేటింగ్స్, కుల జాడ్యంతో.. రెండున్నరకే పరిమితమైనా.. అప్పటికే, స్ప్రెడ్ అయిన మౌత్ టాక్ నేపథ్యంలో, సంచలన రికార్డులు సృష్టిస్తోంది ‘మన శంకర వర ప్రసాద్’ వసూళ్ళ పరంగా.
మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు.. ఆ మాటకొస్తే యువత కూడా, థియేటర్ల దగ్గర ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాలోని పాటలకు చిందులేస్తున్న వైనం.. న భూతో న భవిష్యతి.!
BOSS Chiranjeevi MEGA SWAG.. రిపీట్ మోడ్..
ప్రీమియర్స్ చూసేసి, మళ్ళీ పొద్దున్నే థియేటర్ల దగ్గర ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టేస్తుండడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రీమియర్స్ కోసం టిక్కెట్ ధరని డబుల్‌కి ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.
అయినాసరే, ఫ్యామిలీ ఆడియన్స్ అస్సలు తగ్గలేదు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి పది రోజుల పాటు టిక్కెట్ ధరల్ని పెంచుతూ ప్రభుత్వాలు జీవో జారీ చేయగా, ఆ ధరల్నీ లెక్క చేయకుండా సగటు సినీ అభిమాని థియేటర్లకు పోటెత్తుతున్నారు.
ఇదీ అసలు సిసలు సినీ సంక్రాంతి.. అని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చెబుతుండడం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సక్సెస్ రేంజ్‌ని చెప్పకనే చెబుతోంది,
ఈ రోజు చూస్తోంటే, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా గ్రాస్ వసూళ్ళ పరంగా, 300 కోట్ల క్లబ్‌లోకి చాలా తేలిగ్గానే చేరిపోయేలా వుంది.!
