Bro The Avatar Changes.. సముద్రకని దర్శకత్వం వహించి, నటించిన సినిమా ‘వినోదియ సితం’. ఇది తమిళ సినిమా.
‘వినోదియ సితం’ సినిమాని తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు ‘బ్రో’ పేరుతో.! పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో సినిమా తెరకెక్కింది.. విడుదలకు సిద్ధమైంది.
నిజానికి, ‘వినోదియ సితం’ సినిమాలో ఓ పాత్ర, మధ్య వయస్కుడిది.. ఫ్యామిలీ మ్యాన్. కానీ, తెలుగు వెర్షన్‌కి వచ్చేసరికి యువకుడి పాత్ర అది.
దేవుడి పాత్ర సేమ్ టు సేమ్.! కానీ, తెలుగులో చాలా స్టైలిష్‌గా దాన్ని తీర్చిదిద్దారు పవన్ కళ్యాణ్ కోసం.
Bro The Avatar Changes.. అతి పెద్ద మార్పు ఇదే..
సినిమాలో సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మల మధ్య ఆన్ స్క్రీన్ రొమాన్స్.. ఇదే అతి పెద్ద మార్పు. తమిళ వెర్షన్‌లో ఈ తరహా గ్లామర్‌కి ఛాన్స్ ఇవ్వలేదు.

తమిళ వెర్షన్‌కీ, తెలుగు వెర్షన్‌కీ మార్పులు.. అంటే, ఇదే కొత్త సందర్భం కాదు. చాలా సినిమాల విషయంలో జరిగింది. ఆ మార్పులన్నీ వర్కవుట్ అయ్యాయి కూడా.
సో, ‘బ్రో’ సినిమా కోసం చేసిన ఈ గ్లామరస్ మార్పు.. సినిమాకి అదనపు అడ్వాంటేజ్ అవుతుందన్నది నిర్వివాదాంశం.
Also Read : Bhumi Pednekar.. పదహారేళ్ళకే.. ఆ కోరిక.!
‘జానవులే’ అంటూ సాగే సాంగ్ లిరికల్ వీడియో విడుదల చేయనున్నారు ‘బ్రో’ మేకర్స్.. అదీ జులై 15న. దానికి సంబంధించిన స్టిల్‌నే మీరు పైన చూస్తున్నది. ‘బ్రో’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.