BRO The Avatar Pawankalyan.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీకి ‘బ్రో’ అనే టైటిల్ కన్‌ఫామ్ చేశారు. గత కొంతకాలంగా ఈ టైటిల్ ప్రచారంలో వున్న సంగతి తెలిసిందే.
ఇదే టైటిల్ కన్‌ఫామ్ చేస్తూ, వెరీ లేటెస్టుగా ఓ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ మోషన్ పోస్టర్‌కి వస్తున్న రెస్పాన్స్ వేరే లెవల్ అంతే.
యాక్సిడెంట్‌లో చనిపోయిన కుర్రాడికి దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తే ఏం జరుగుతుంది.? అనే కాన్సెప్ట్‌తో ‘బ్రో’ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
తమిళ బ్లాక్ బస్టర్ ‘వినోదయ సితమ్’కి రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకి ఒరిజినల్ డైరెక్టర్ సముద్ర ఖని దర్శకత్వం వహిస్తుండగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇన్ పుట్స్ అందించారు.
BRO The Avatar Pawankalyan.. జోష్ షురూ చేసిన పవర్ ఫ్యాన్స్..
కాగా, లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్‌కి థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్దిరిపోయిందంతే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మోడ్రన్ గాడ్‌గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: Agent Disaster.. డైరెక్టర్‌ని అవమానించి తప్పు చేశావ్ అఖిల్.!
మోషన్ పోస్టర్‌లో అయితే, చాలా స్టైలిష్ లుక్స్‌లో పవన్ కళ్యాణ్‌ని చూపించారు. టైటిల్‌తో పాటూ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేయడంపై ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయనే చెప్పాలి.
జూలై 28న ‘బ్రో’ ధియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో హీరోయిన్లుగా కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు.