Table of Contents
Bro The Avatar Preview.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘బ్రో’ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. తమిళ సినిమా ‘వినోదయ సితం’కి ఇది తెలుగు రీమేక్.
దేవుడి పాత్రలో పవన్ కళ్యాణ్ నటించడం కొత్త కాదు. గతంలో ‘గోపాల గోపాల’ సినిమాని చూసేశాం. కాకపోతే, ఇక్కడ ఈ ‘బ్రో’ కోసం ‘సమయం’గా మారాడు పవన్ కళ్యాణ్.
టైమ్ దేవుడన్నమాట.! టైమ్ అంటే దేవుడేనా.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ.
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తికి 90 రోజుల సమయం ఇస్తుంది సమయం. ఈ తొంభై రోజులపాటు ఆ సమయమూ, ఆ వ్యక్తితోనే వుంటాడన్నమాట.
Bro The Avatar Preview.. అందుకే.. అంత ప్రత్యేకం.!
అసలు ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి (Power Star Pawan Kalyan) ఎందుకంత ప్రత్యేకం.? ఇప్పటిదాకా చేసిన చాలా సినిమాల్లానే, ఇది కూడా ఓ సినిమా.

కానీ, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో (Supreme Hero Sai Dharam Tej) కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.
నటుడు సముద్రఖని తొలిసారిగా తెలుగులో దర్శకత్వం చేస్తున్న సినిమా ఇది. వాస్తవానికి సముద్రఖని అంటే దర్శకుడు. నటుడిగా మారాడంతే.
తమిళంలో పలు సినిమాల్ని దర్శకుడిగా తెరకెక్కించిన సముద్రఖని (Samuthirakani), నటుడిగా ఇప్పుడు బిజీ అయ్యాడు. తెలుగులో అయితే మరీనూ.!
అక్కడైతే 35 లక్షల్లోపేనట.!
‘బ్రో’ (Bro The Avatar) కథ అన్ని భాషల్లోనూ ప్రేక్షకులకు చూపించాల్సి వుందనే గట్టి పట్టుదలతో వున్నాడు సముద్రఖని (Samuthirakani).
‘తుళు’భాషలో సినిమా తెరకెక్కిస్తాడట. జస్ట్ అరకోటి బడ్జెట్‌తో పూర్తి చేస్తానని దర్శకుడు సముద్రఖని చెబుతుండడం గమనార్హం.
తెలుగులో మాత్రం, దాదాపు వంద కోట్లు.. ఆ పైన ఖర్చయ్యిందనే ప్రచారం జరుగుతోంది ‘బ్రో’ (Bro The Avatar) సినిమాకి.
ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా చూసుకున్నా, పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) సినిమాల్లోనే హయ్యస్ట్ అనుకోవచ్చు ఈ ‘బ్రో’ సినిమాని.
గెస్ట్ రోల్ లాంటిదే.!
నిజానికి, పవన్ కళ్యాణ్‌ది ఈ సినిమాలో గెస్ట్ రోల్ లాంటిదే.! సినిమా అంతా సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) పాత్రే కనిపిస్తుంది. అతన్ని డ్రైవ్ చేసే పాత్రలో పవన్ కళ్యాణ్ కన్పిస్తాడంతే.!
త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ఈ చిత్రానికి తెలుగులో కొన్ని మార్పులు, చేర్పులు చేశాడు.. ఆ మార్క్ తెరపై ఖచ్చితంగా చూడబోతున్నాం.!
Also Read: ‘ప్రాజెక్ట్-కె’లో ప్రభాస్.! తలకాయని ఇలాగేనా అతికించేది.?
‘సమయం’ పాత్ర తమిళంలో ఒకింత సీరియస్‌గా సాగుతుంది. తెలుగులో మాత్రం హై ఓల్టేజ్ ఫన్ అండ్ ఎనర్జీతో కనిపించబోతోంది.
తమిళంలోనేమో మెయిన్ రోల్.. 50 ఏళ్ళు పైబడిన వ్యక్తి. తెలుగులో మాత్రం, యువకుడి పాత్రగా మార్చారు. పైగా, ఈ సినిమాలో హీరోయిన్ కూడా.!
ఈ మార్పులు తెరపై ఎలా వుండబోతున్నాయో తెలియాలంటే.. సినిమా విడుదలయ్యేదాకా వేచి చూడాల్సిందే.