Bro The Avatar Trailer Review.. అక్కడేమో చాలా చాలా చిన్న సినిమా ఇది. తెలుగులోకి మాత్రం భారీ బడ్జెట్ చిత్రం అయి కూర్చుంది. అదీ పవన్ కళ్యాణ్ పవర్ అంటే.!
ఊరికే.. 150 కోట్ల పైన ప్రీ రిలీజ్ బిజినెస్ అయిపోలేదు ‘బ్రో ది అవతార్’ సినిమాకి. అక్కడున్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.! అందుకే, అనూహ్యమైన రీతిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఇంతకీ, ‘బ్రో ది అవతార్’ ఎలా వుండబోతోంది.? ఇంకెలా వుంటుంది.. పవర్ ఫుల్ హిట్ అనిపించుకోబోతోంది.! ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘బ్రో’.!
Bro The Avatar Trailer.. ట్రైలర్ కథా కమామిషు ఇదీ..
టైమ్ లేదు.. టైమ్ అయిపోతోంది.. ఇలా హీరో సాయి ధరమ్ తేజ్.. ఇంట్లోవాళ్ళనీ.. ప్రేమించిన అమ్మాయినీ.. పనిచేస్తున్న చోట సహచరుల్నీ.. గదమాయించి మరీ జీవితాన్ని నెట్టుకొచ్చేస్తుంటాడు. ఇంతలోనే అనుకోని ఘటన.!
అన్నీ తారుమారైపోతాయ్.! చచ్చి బతికిపోయాన్.. ఇది తెలియక బతికి చచ్చాను.. అంటాడు ఓ సందర్భంలో హీరో సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్, ‘విరూపాక్ష’తో పోల్చితే ఎనర్జిటిక్‌గా కనిపించాడు.
‘పవర్ హౌస్’ పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? అభిమానులకి పండగే. తెరపై పవన్ కళ్యాణ్ ఎనర్జీ అన్ మ్యాచబుల్ అంతే.!
ట్రైలర్‌లో సాయిధరమ్ తేజ్ ఎక్కువ సేపు కనిపించినట్లు అనిపించడం గమనార్హం. కానీ, పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ మామూలుగా లేదు.
ట్రైలర్‌లో దాదాపు ప్రధాన తారాగణమంతా కనిపించింది. బ్రహ్మానందం.. కనిపించగానే ట్రైలర్‌కి ఎక్స్‌ట్రా విజిల్స్ పడటం గమనార్మం.
సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఇవన్నీ టాప్ క్లాస్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదమో. చాలా రిచ్‌గా సినిమాని తెరకెక్కించిన వైనం ట్రైలర్‌లోనే తెలుస్తోంది. వివిధ రకాలైన గెటప్స్‌లో పవన్ కళ్యాణ్ చెలరేగిపోయారు.
సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) రచనా సహకారం అందించిన సంగతి తెలిసిందే.
కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం. సాయిధరమ్ తేజ్ – కేతిక శర్మల మధ్య రొమాంటిక్ ట్రాక్.. సినిమాకి సమ్‌థింగ్ వెరీ స్పెషల్.!