Table of Contents
Burj Khalifa Nicole Smith Ludvik.. అంతరిక్షం అంచుల్నితాకిన సత్తా మగువది. ఆడది అంటే, అబల కాదు, సబల.. అని ఎన్నో ఎన్నెన్నో సందర్భాల్లో చెప్పుకున్నాం. చెప్పుకుంటూనే ఉంటాం. అయినా గానీ, ‘ఆడది’ అంటే అదో చిన్న చూపు. కేవలం పురుషాధిక్య ఆలోచనలే దీనికి కారణమా.? అంటే, కాదు కాదు.. ఆడదానికి ఆడదే శత్రువైన సందర్భాలు కోకొల్లలు.
ఇప్పుడిదంతా ఎందుకంటారా.? ఓ మహిళ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిల్చొని ప్రపంచాన్ని చూసింది. ఆ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకుంది. ఆమె పేరు నికోల్ స్మిత్ లడ్విక్. ఎవరీ నికోల్ స్మిత్..? నికోల్ ఓ స్కై డైవింగ్ ఇన్‌స్ట్రక్టర్. యోగా నిపుణురాలు.. ఇంకా చాలా చాలా వున్నాయ్ ఆమె ప్రత్యేకతలు.
Burj Khalifa Nicole Smith Ludvik ఎమిరేట్స్ సృష్టించిన అద్భుతం..
సరే, అసలు విషయంలోకి వెళితే, యూఏఈకి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎమిరేట్స్ సంస్థ ఓ ప్రకటన (యాడ్ షూట్) కోసం నికోల్ స్మిత్ లడ్విక్‌ని సంప్రదించింది. ప్రకటన చిత్రీకరణ పూర్తయిపోయింది. తొలుత ఓ ఫోటో బయటికి వచ్చింది. ఆ ఫోటో చూసి, అంతా గ్రాఫిక్స్ అన్నారు.
ఎందుకంటే, ప్రపంచంలో అత్యంత ఎత్తైన కట్టడంగా పేరొందిన బుర్జ్ ఖలీఫా (828 మీటర్లు) పైన గాల్లో నిల్చొని కనిపించింది నికోల్ స్మిత్. ఆ ఫోటో చూసి, ‘అస్సలిది సాధ్యమయ్యే పనే కాదు. గ్రాఫిక్స్‌లో చేసి పడేశారు..’ అన్నారంతా.

‘మీ ఆలోచనలు తప్పు..’ అంటూ ఎమిరేట్స్ సంస్థ ఓ మేకింగ్ వీడియో విడుదల చేసింది. దాంతో ప్రపంచం నివ్వెరపోయింది. అంత ఎత్తున నికోల్ స్మిత్ లడ్విక్ నిల్చోవడం (ఆమెకు దన్నుగా తగిన ఏర్పాట్లు ఉన్నప్పటికీ) ఓ అద్భుతం. ఒక్కసారి కాదు, రెండు సార్లు ఆమె ఈ ఫీట్ చేసింది.
నికోల్ స్మిత్ లడ్విక్.. నిజంగానే సూపర్ విమెన్..
దుబాయ్ ఎక్స్‌పో 2020ని ప్రమోట్ చేస్తూ, ఎమిరేట్స్ సంస్థ మరో ప్రకటనను వీడియో రూపంలో తెచ్చింది. ‘నేనింకా ఇక్కడే వున్నాను. ప్రపంచంలో అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటైన దుబాయ్ ఎక్స్‌పోని చూడడానికి ఎమిరేట్స్ ఏ – 380 విమానంలో రండి..’ అని ఆ వీడియోలో అంత ఎత్తున నిల్చొని ఆహ్వానిస్తోంది నికోల్.
ఆమె చుట్టూ ఏ – 380 విమానం చక్కర్లు కొడుతోంది ఆ వీడియోలో. ఇలాంటి ప్రకటన ఇంకెవ్వరూ చేయలేరా.? ఏమో, ముందు ముందు చేస్తారేమో.. టెక్నిక్ తెలిసిపోయింది కాబట్టి, అదేం పెద్ద పని కాదని ఇకపై అనుకోవచ్చు గాక. కానీ, నికోల్ అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేసింది.
ఆమె మాత్రమే కాదు.. అంతా అద్భుతమే.!
ఈ ప్రకటన రూపకల్పనలో నికోల్ పడ్డ కష్టం అంతా ఇంకా కాదు. ‘ఆడది’ అంటే, ‘సబల సూపర్ పవర్..’ ఏ రంగంలోనైనా తనదైన ‘ముద్ర’ వేయగలదని చాటి చెప్పింది. ఈ స్ఫూర్తి ‘ముద్ర’ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మహిళల మెదళ్లలో గట్టిగా పడింది, పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read: వెర్రి వెంగళప్పాయ్.! ఓటుకీ, సినిమా చూడ్డానికీ లింకేమిట్రా.?
అన్నట్టు, ఎమిరేట్స్ సంస్థ ఈ వీడియో చిత్రీకరణ కోసం పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. నికోల్ స్మిత్ లడ్విక్ భద్రత కోసం అన్ని జాగ్రత్తలూ తీసుకుంది. 150కి పైగా అంతస్తులున్న ఈ బుర్జ్ ఖలీఫా భవనం మీదకి లిఫ్ట్ ద్వారా చేరుకున్నా. అక్కడి నుంచి టవర్ మీదకు ఎక్కేందుకోసం లిఫ్ట్ సౌకర్యం లేదు. మెట్ల లాంటి మార్గం ద్వారా నికోల్, ఆమెతోపాటు ఒకరిద్దరు సిబ్బంది ప్రమాకరమైన ఫీట్లు చేశారు.
అంతలా కష్టపడ్డారు కాబట్టే ఫలితం.. ప్రపంచమంతా చెప్పుకునే స్థాయిలో వచ్చింది మరి.! నికోల్ మాత్రమే కాదు, ఈ ప్రకటన వీడియో కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ హేట్సాఫ్ చెప్పాల్సిందే సుమీ.!