పిచ్చి పీక్స్‌కి వెళ్ళడమంటే ఇదే మరి. ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలపై అసలెందుకు చిరంజీవి స్పందించారు.? అంటూ దీర్ఘాలు తీస్తున్నారు చాలామంది. స్పందించకపోతే, పరిశ్రమ పెద్దగా స్పందించాల్సిన బాధ్యత (Chiranjeevi About MAA Elections) చిరంజీవికి లేదా.? అంటూ నిలదీస్తారు. చిరంజీవి ఏం చేసినా తప్పే.. ఏం చేయకపోయినా తప్పే.!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు. కానీ, పెద్ద రచ్చే జరుగుతోంది. తాము బరిలోకి దిగుతున్నట్లు ప్రకాష్ రాజ్ అండ్ టీమ్ ఎప్పుడైతే మీడియా ముందుకొచ్చిందో, ఆ తర్వాత అసలు కథ షురూ అయ్యింది.
Also Read: రీల్ & రియల్ హీరోయిజం.. Mega ఆపన్నహస్తం.?
సినీ పరిశ్రమకి కులాన్ని ఆపాదించారు, ప్రాంతీయతను ఆపాదించారు.. నానా రచ్చా చేసేశారు. ఎవరు ఇదంతా చేశారంటే, పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖుల ప్రోత్సాహం లేకుండానే మీడియా ఇంత రచ్చా చేసేస్తుందని ఎలా అనుకోగలం.?
పెద్ద పెద్ద విమానాల్లో బిజినెస్ క్లాస్ టిక్కెట్లేసుకుని, విదేశాలకు నిధుల వేట కోసం వెళ్ళారుగా.. అవేం చేశారని ఓ ప్రముఖ నటుడు ప్రశ్నించేశాడు. ‘మా’ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిధి ఖాళీ అయిపోయిందంటూ మరో సీనియర్ నటి ఆరోపించింది. ‘మా’ ప్రతిష్ట మసకబారిపోయిందని మరో సీనియర్ నటుడు ఆరోపించాడు.
Also Read: వెన్నుపోటు ‘విష పురుగు’తో సమాజానికే పెను ముప్పు.!
ఇంత రచ్చ జరిగాక, మెగాస్టార్ చిరంజీవి స్పందించకపోతే ఎలా.? ఆయన ‘మా’ వ్యవస్థాపక అధ్యక్షుడు. పైగా, ప్రస్తుతం సినీ పరిశ్రమ పెద్దగా ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఏ సమస్య వచ్చినా, పరిశ్రమ తరఫున అందరూ చిరంజీవి వద్దకే వెళుతున్నారు.
అందుకే, చిరంజీవి ‘మా’ వివాదంపై స్పందించారు. క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ కృష్ణంరాజుకి లేఖ రాశారు చిరంజీవి. ఈ లేఖలో ఎన్నికలు త్వరగా నిర్వహిస్తే, ఈ వివాదాలు సద్దుమణుగుతాయని మాత్రమే చిరంజీవి పేర్కొన్నారు. ‘పెద్దలు, మీరు తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా బావుంటుంది..’ అని పేర్కొనడం ద్వారా చిరంజీవి తన పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారు.
Also Read: బురదలో కూరుకుపోయిన జర్నలిజం.. సమాజానికి హానికరం.!
‘మా’ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి.? ఎవరు గెలుస్తారు.? అన్నది వేరే చర్చ. కానీ, ఈ వివాదాలతో ‘మా’ ప్రతిష్ట మసకబారుతోంది. సినిమా ఇండస్ట్రీ అంటే, అద్దాల భవనం.. చిన్న రాయి పడినా, భవనం తాలూకు సౌందర్యం (Chiranjeevi About MAA Elections) దెబ్బతింటుంది, వికారంగా మారుతుంది.
నిజానికి, ‘మా’ విషయమై పరిశ్రమలో ప్రముఖ నటీనటులు స్పందించి, దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాల్సి వుంది. అలా జగరకపోవడం వల్లే, ఇప్పుడీ దుస్థితి. రచ్చ జరుగుతున్నప్పుడు ఇంకో నాలుగు రెచ్చగొట్టే కామెంట్లు వేసేటోళ్ళకి అదనపు పబ్లిసిటీ వస్తుంది గనుక, అదే పని చేశారు చాలామంది. సినీ పరిశ్రమకు వేరే శతృవులు అక్కర్లేదనేది ఇందుకే మరి.