Chiranjeevi Bholaa Shankar Leaks.. బోల్డంత హంగామా చేసి, ఫస్ట్ లుక్ విడుదల చేసే కిక్కు సంగతెలా వున్నాగానీ, మెగాస్టార్ చిరంజీవి ఓ చిన్న లీక్ వదిలితే.. అది సృష్టించే ఇంపాక్ట్ వేరే లెవల్‌లో వుంటుంది.
దటీజ్ మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi).! ఊరికే మెగాస్టార్లు అయిపోరెవరూ.! పైగా, వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి అక్కడ.!
తన తాజా చిత్రం ‘భోళా శంకర్’ గురించి ఓ చిన్న లీక్ వదిలారు మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi Leaks). అదీ, ఓ పాటకు సంబంధించి.
Chiranjeevi Bholaa Shankar Leaks.. అదిరింది బాసూ.!
మెగాస్టార్ చిరంజీవితోపాటు, ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటిస్తోన్న తమన్నా (Tamannaah Bhatia) కూడా వీడియోలో దర్శనమిచ్చింది.
అంతేనా, కీర్తి సురేష్ (Keerthy Suresh).. ఆమెతోపాటు సుశాంత్.. ఇలా ముఖ్యమైన తారాగణం కనిపిస్తోంది. ముందుగా లీకు గురించి ట్విట్టర్‌లో ఓ ఆడియో విడుదల చేశారు చిరంజీవి.
సాయంత్రానికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియో చిరంజీవి వదిలారు. ఆ వీడియోలో, సాంగ్ షూట్ చేస్తున్న వైనం.. అభిమానులకి నిజంగానే పండగను తీసుకొచ్చిందనడం నిస్సందేహం.
Also Read: ‘ఆదిపురుష్’ పబ్లిసిటీ స్టంట్స్.! హనుమాన్‌తో గేమ్స్.!
శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి (Mega Star Chiranjeevi) మార్కు ఫన్.. సెట్‌లో అందర్నీ అలరించింది.
మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భోళా శంకర్’ (Bholaa Shankar) సినిమా, తమిళ సినిమా ‘వేదాళం’కి రీమేక్. ఆగస్టులో ‘భోళా శంకర్’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
అన్నట్టు, ఈ ‘భోళా శంకర్’ (Bholaa Shankar) సినిమాలో చిరంజీవి (Mega Star Chiranjeevi) చెల్లెలుగా కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తోంది.
ఈ పాత్రకి తొలుత సాయి పల్లవిని (Sai Pallavi) అనుకున్నారు. కానీ, రీమేక్ సినిమాలు చేయకూడదన్న మాటకు కట్టుబడి, సాయి పల్లవి మెగా ఛాన్స్ వదిలేసుకుంది.