Chiranjeevi Fan Nara Lokesh.. సోషల్ మీడియాలో చిరంజీవి అభిమానులకీ, బాలకృష్ణ అభిమానులకీ అస్సలు పడదు.! పచ్చి బూతులు తిట్టుకుంటారు.!
వాళ్ళలో వాళ్ళు తిట్టుకోవడమే కాదు, నచ్చిన హీరోకి మద్దతిచ్చే క్రమంలో ఇంకో హీరోని తూలనాడుతుంటారు. ఇదొక రోగం.!
సరే, అసలు విషయానికి వస్తే.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి మెగాస్టార్ చిరంజీవి అంటే వల్లమాలిన అభిమానమట.
‘నేను మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఫ్యాన్‌ని. కానీ, ఏం చేస్తాం.? ముద్దుల మామయ్య మీద మమకారం వుంటుంది కదా..’ అంటూ నారా లోకేష్ (Nara Lokesh) చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Chiranjeevi Fan Nara Lokesh దీన్నే రాజకీయమంటారు.!
వైసీపీలోనూ చాలామంది అభిమానులున్నారు మెగాస్టార్ చిరంజీవికి. కానీ, వాళ్ళంతా నిజానికి మెగాస్టార్ చిరంజీవి అభిమానులు కాదు. ఆ ముసుగేసుకుని, పవన్ కళ్యాణ్‌ని తిడుతుంటారు.
రాజకీయం అంటేనే అంత.! చిరంజీవి వేరు, పవన్ కళ్యాణ్ వేరు.. అని చూపించే క్రమంలో ఎప్పటినుంచో ఈ విష రాజకీయం అలా అలా నడుస్తూనే వుంది.
అభిమానమంటే ఎలా వుంటుంది.? చిరంజీవిని (Mega Star Chiranjeevi) అభిమానిస్తే, ఆ చిరంజీవి కుటుంబానికి చెందినవారందరి మీదా అదే అభిమానం వుండాలి కదా.!
ఎన్టీయార్.. వైఎస్సార్.. అలా..
స్వర్గీయ ఎన్టీయార్ మీదున్న అభిమానమే, బాలకృష్ణ (Nandamuri Bala Krishna) మీదా వుంటుంది. అలాగే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీదున్న అభిమానమే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీదా కనిపిస్తుంది.
కేవలం మెగా కాంపౌండ్ విషయానికొచ్చేటప్పటికే ఇష్టాలు చిత్రంగా మారుతుంటాయ్. అల్లు అర్జున్ ఓకే, చిరంజీవి నాట్ ఓకే. రామ్ చరణ్ ఓకే, పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నాట్ ఓకే.!
Also Read: స్వామి శరణం: చరణ్ ఇండియాలో ఇలా!. అమెరికాలో అలా.!
మొత్తమ్మీద, నారా లోకేష్ ఏదో యధాలాపంగా చేసిన వ్యాఖ్యలతో.. అసలు అభిమానం అంటే ఏంటి.? మమకారం అంటే ఏంటి.? రాజకీయాభిమానం అంటే ఏంటి.? అన్నదానిపై చాలామందికి చాలా స్పష్టత వచ్చేసింది.