Chiranjeevi Nayanthara Meesala Pilla.. మీసాల పిల్ల అంటే ఏంటి.? పొరగుమోతు అమ్మాయిని మీసాల పిల్ల అని పిలుస్తారట.!
అలాగని, శంకర వరప్రసాద్ గారు చెబుతున్నారు.! ఇక్కడ మీసాల పిల్లేమో నయనతార. శంకర వరప్రసాద్ అంటే, తెలుసు కదా.. కొణిదెల శివ శంకర వరప్రసాద్.. అనగా మెగాస్టార్ చిరంజీవి.!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
‘మన శంకర వరప్రసాద్ గారు’, వచ్చే సంక్రాంతి పండగకి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో, ‘మీసాల పిల్ల’ అంటూ సాగే, పాటకి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు.
Chiranjeevi Nayanthara Meesala Pilla.. బాసూ.. నీ గ్రేసూ.!
మెగాస్టార్ చిరంజీవికి బోల్డంతమంది అభిమానులున్నారు. ఆ అభిమానుల్లో దర్శకులున్నారు, నటీ నటులున్నారు, నిర్మాతలున్నారు, సంగీత దర్శకులు కూడా వున్నారు.
అలాంటి అభిమానుల్లో, విజయ్ పోలాకి అనే కొరియోగ్రాఫర్ కూడా ఒకరు. ఆయనే, ఈ ‘మీసాల పిల్ల’ పాటకి కొరియోగ్రఫీ చేసింది.
‘చిరంజీవిగారికి నేనెంత పెద్ద అభిమానినో, ఈ పాట చూస్తే మీకే అర్థమవుతుంది..’ అంటూ విజయ్ పోలాకి, సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
అట్లుంటది, చిరంజీవి మీద అభిమానం అంటే.! ఏమాటకామాటే చెప్పుకోవాలి, సాంగ్ ప్రోమోలో.. మెగాస్టార్ చిరంజీవి గ్రేసు.. అదుర్స్ అంతే.!
Also Read: మళ్ళీ అదే ప్రశ్న.! అనుష్క శెట్టికి మళ్ళీ ఏమయ్యింది.?
బాసూ.. నీ గ్రేసూ.. అని చిరంజీవి అభిమానులే కాదు, డాన్స్ లవర్స్.. చిరంజీవి గురించి పదే పదే చెప్తారంటే, అదీ చిరంజీవి డాన్సింగ్ టాలెంట్.
ఏడు పదుల వయసులో చిరంజీవి, ‘మీసాల పిల్లా’ అంటూ హీరోయిన్ టీజింగ్ చేస్తూ, డాన్స్ చేస్తుంటే, ఆయన వయసు అలా ముప్ఫయ్ ఏళ్ళకు పడిపోయినట్లనిపిస్తుంది.
నయనతార, చిరంజీవి కలిసి గతంలో పలు సినిమాల్లో నటించారు. అయితే, ఇది మాత్రం కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్. సో, ఈ కాంబినేషన్ నుంచి బోల్డంత ఎంటర్టైన్మెంట్ ఆశించొచ్చు.
