Chiranjeevi Pawan Kalyan.. వాళ్ళిద్దరి స్థాయి వేరు.! ఆ మెగా అనుబంధం కొందరికి కంటగింపుగా మారిందంటే.. అది కేవలం వారి మీద అక్కసు మాత్రమే.
చెంచాగిరీకి అయినా ఓ హద్దూ అదుపూ వుండాలి. పదవి నుంచి పీకి పారేసినాగానీ, ‘పాచిపని’ మానలేక పోతున్నట్టున్నారు కొందరు. లేకపోతే, చిరంజీవిని పొగిడి, పవన్ కళ్యాణ్‌ని తిట్టడమేంటి.?
అన్నదమ్ముల మధ్య చిచ్చపెట్టే స్థాయికి రాజకీయం ఎప్పుడో దిగజారిపోయిందిగానీ, ఆ దిగజారుడుతనంలో కూడా కొత్త లోతుల్ని వెతుక్కోవడమే మరింత హేయం.
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నారనగానే, అప్పట్లో చాలా కుక్కలు మొరిగాయ్.! మెగా కుటుంబంలో చిచ్చుపెట్టేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో చిరంజీవి కంటతడి పెట్టాల్సి వచ్చింది.
Chiranjeevi Pawan Kalyan ఆ స్థాయి వేరు.!
అలా చిరంజీవి కంటతడి పెట్టడానికి కారణమైన అవే ‘శునకాలు’ ఇప్పుడు చిరంజీవిని దేవుడంటున్నాయ్. పవన్ కళ్యాణ్‌ని చెడ్డోడిగా అభివర్ణిస్తున్నాయి. మరీ, నీతీ జాతీ లేకుండా ఎలా వ్యవహరిస్తారెవరైనా.? రాజకీయం అంటేనే అంత.
పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) మీద నాలుగు విమర్శలు చేస్తే, యజమాని ఎంగిలి చేతిని విదిలిస్తాడేమో.. ఆ ఎంగిలి మెతుకులు ఏరుకోవాలని బహుశా తహతహలాడుతున్నారేమో.!
రాజకీయం అంటే.. ప్రజలకు మేలు చేసే క్రమంలో ఎవరెలాంటి ఆలోచనలు చేస్తున్నారనే దిశగా చర్చ జరగాలి.
దురదృష్టం, ఇప్పుడున్న రాజకీయాల్లో అలాంటి మంచి ఆలోచనల్ని, మంచి ప్రవర్తనని రాజకీయ నాయకుల నుంచి ఆశించలేం.
ఎంగిలి మెతుకుల రాజకీయం.!
పైన చెప్పుకున్నట్టు, యజమాని నుంచి నాలుగు ఎంగిలి మెతుకులు చాలు కొందరికి.. వాళ్ళెంత పెద్ద బాధ్యతగల పదవుల్ని నిర్వహించిన, నిర్వహిస్తున్నవారైనాసరే.
తనకు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని చిరంజీవి (Mega Star Chiranjeevi) చెబుతున్నారు కాబట్టి, ఆయన్ని దేవుడంటున్నారు.
Also Read: సర్‘కారు’ దొంగతనం.! ‘అధికారికం’గా జరిగిన దారి దోపిడీ.!
కానీ.. జనసేన పార్టీకి (Jana Sena Party) చిరంజీవి (Mega Star Chiranjeevi) మద్దతిస్తే.. అప్పుడు కూడా ఆయన్ని దేవుడిగా చూసేంత చిత్తశుద్ధి, మాట మీద నిలకడ.. సోకాల్డ్ పకోడీ గాళ్ళకి వుంటుందా.?