Chiranjeevi Political Re-Entry.. మెగాస్టార్ చిరంజీవి, తిరిగి రాజకీయాల్లోకి రావాల్సిందేనా.? పరిస్థితులే ఆయన్ని, తిరిగి రాజకీయాల్లోకి లాక్కొస్తున్నాయా.?
చిరంజీవి అంటే, రాజకీయాల్లో ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ అధినేత.. అంతే కాదు, తిరుపతి ఎమ్మెల్యే కూడా.! అంతకు మించి, ఆయన రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు గతంలో.
కాంగ్రెస్ పార్టీలో అనివార్య కారణాల వల్ల ప్రజారాజ్యం పార్టీ విలీనమైపోయింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజ్యసభకు ఎంపికై, కేంద్ర మంత్రిగా పని చేశారు చిరంజీవి.
Chiranjeevi Political Re-Entry.. రీ-ఎంట్రీ ఎందుకు.?
కొందరు, చిరంజీవి రాజకీయాల్లోకి మళ్ళీ రావాలని బలంగా కోరుకుంటున్నారు. దానిక్కారణం కూడా లేకపోలేదు. రాజకీయాల్లో వున్నా, లేకున్నా.. చిరంజీవిపై దుష్ప్రచారం జరుగుతూనే వుంది.
చిరంజీవి ప్రస్తావన లేకుండా, రాజకీయాలు వుండటం లేదు. తెలంగాణ రాజకీయాల్లోనూ, ఏపీ రాజకీయాల్లోనూ చిరంజీవి పేరు ఏదో ఒక రకంగా ప్రస్తావనకు వస్తూనే వుంది.
ఎలాగోలా చిరంజీవి పేరు ప్రస్తావించి పాపులర్ అయిపోవాలని ‘ప్రతి పనికిమాలిన సన్నాసీ..’ అనుకుంటున్న పరిస్థితి.. అంటూ, మెగాభిమానులు గుస్సా అవుతున్నారు ఇంకో వైపు.
చిరంజీవి రాజకీయాల్లో వున్నా, లేకున్నా ఆయన పేరు మీద రాజకీయాలు చేస్తున్న దరిమిలా, చిరంజీవి రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తేనే, సరైన వేదికలపై ఆయన సరైన సమాధానం ఇవ్వగలుగుతారేమో.!
తిరిగి రాజకీయాల్లోకొస్తే ఏమవుతుంది.?
అయితే, చిరంజీవికి రాజకీయాలపై అస్సలేమాత్రం ఆసక్తి లేదు. స్వతహాగా, చిరంజీవి సున్నిత మనస్కుడు.. ‘అందరివాడు’.! అందుకే, ఆయన్ని సిగ్గూ ఎగ్గూ లేకుండా తూలనాడుతారు కొందరు.
రాజకీయాల్లోకి తిరిగొచ్చేందుకు చిరంజీవి నిర్ణయం తీసుకుంటే, పెద్ద పెద్ద పదవులు ఆయన కోసం ఎదురుచూస్తున్నాయ్. పైగా, అవి జాతీయ స్థాయి పదవులు.
Also Read: వృక్ష రాజం.. కళాకృతిగా మారిన వైనం.! ఇదో అద్భుతం.!
ఆ పదవులకు సంబంధించి, జాతీయ స్థాయి ప్రముఖులు చాలాకాలంగా చిరంజీవిని ఒప్పంచేందుకు ప్రయత్నిస్తూనే వున్నారు. కానీ, చిరంజీవి సుముఖత వ్యక్తం చేయట్లేదు.
ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. పనీ పాటా లేకుండా తన మీద రాజకీయ విమర్శలు చేస్తున్నవారికి, చిరంజీవి రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వడమే సరైన సమాధానమా.?
కాలమే సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఇది.!
