Chiranjeevi The Family Man.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఫ్యామిలీ మ్యాన్’ తెరకెక్కాల్సి వుందట.! రాజ్-డీకే తొలుత ఆ సబ్జెక్ట్‌ని చిరంజీవి కోసమే తయారు చేశారట.!
ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ సబ్జెక్ట్‌కి సంబంధించి, కొన్ని మార్పులు చేద్దామన్నా చిరంజీవి ఒప్పుకోలేదన్నది అశ్వనీదత్ ఉవాచ.!
సినిమా రంగం అంటేనే, ఓ మ్యాజిక్. ఒక్కోసారి పెద్ద పెద్ద హిట్లు చేజారిపోతాయ్.. ఒక్కోసారి, అనూహ్యంగా ఫ్లాపులు, డిజాస్టర్ల నుంచి తప్పించుకోవడం జరుగుతుంటుంది.
Chiranjeevi The Family Man.. సినిమా.. వెబ్ సిరీస్.!
‘ది ఫ్యామిలీ మ్యాన్’ (The Family Man) వెబ్ సిరీస్ ఏ స్థాయిలో సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.!

కానీ, దీన్నే సినిమాగా తీసి వుంటేనో.! ఏమో, ఎలా వుండేదో.! వెబ్ సిరీస్ గనుక, చాలా అంశాలు అదనంగా అందులోకి వచ్చి చేరాయ్.
వాస్తవానికి, ‘ఫ్యామిలీ మ్యాన్’ (The Family Man) అనే పెద్ద సబ్జెక్ట్‌ని సినిమాగా చేస్తే, తేడా కొట్టేసేదే.! మెగాస్టార్ చిరంజీవి వదిలేసుకున్న చాలా సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయ్.
చాలా కొద్ది సినిమాలు మాత్రమే మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) వదిలేసుకున్నవి విజయాలు సాధించిన సందర్భాలున్నాయ్.
సమంత వల్లనే..
ఇక, సమంత కారణంగా, ‘ఫ్యామిలీ మ్యాన్’కి అంత వైల్డ్ అప్లాజ్ వచ్చింది.. రెండో సీజన్ వరకూ.! శ్రీలంక బ్యాక్‌డ్రాప్.. ఆ ఎమోషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి.
అయితే, వెబ్ సిరీస్ గనుక, అలాంటి బోల్డ్ రోల్స్ ఓకేగానీ, వెండితెరపై.. వాటికి సెన్సార్ ఒప్పుకుంటుందా.? అదీ, చిరంజీవి (Mega Star Chiranjeevi) సినిమాలో అంటే పరిస్థితులు ఎలా వుంటాయో.!
Also Read: Fire Storm Is Coming.. ఈ హైప్ వేరే లెవల్.!
అశ్వనీదత్ ఏ ఉద్దేశ్యంతో ‘ఫ్యామిలీ మ్యాన్’ విషయాన్ని ప్రస్తావించారోగానీ, చిరంజీవి ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడానికే ఆయన ఇలా మాట్లాడారన్న సంకేతాలు అయితే జనాల్లోకి వెళుతున్నాయ్.!